సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 ఆగస్టు 4, 5 తేదీల్లో రెండో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యబృంద సమావేశం

प्रविष्टि तिथि: 05 AUG 2026 4:28PM by PIB Hyderabad

బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యబృందం రెండో సమావేశంఆస్తుల పునరుద్ధరణపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశాలు కేంద్ర సిబ్బందిశిక్షణ (డీవోపీటీశాఖ ఆధ్వర్యంలో తెలంగాణలోని హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిశాయిబ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహిస్తున్న ఈ సమయంలో.. 2026 ఆగస్టు 4, 5 తేదీల్లో ఈ సమావేశాలను నిర్వహించారు.

 

భారత్ అధ్యక్షతన నిర్వహిస్తున్న బ్రిక్స్‌ సమావేశాల ఇతివృత్తమైన.. ‘పటిష్టతఆవిష్కరణసహకారంసుస్థిరతల కోసం నిర్మాణం’ లక్ష్యానికి అనుగుణంగా ఈ సమావేశాలను నిర్వహించారుఅన్ని బ్రిక్స్ సభ్య దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారుఉన్నతస్థాయి విధాన రూపకర్తలునిపుణులుకార్యకర్తలతోపాటు.. అవినీతి నిరోధకఆర్థిక నిఘాచట్టాల అమలు సంస్థల ప్రతినిధులు హాజరై వివిధ అవినీతి నిరోధక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

సిబ్బందిశిక్షణ విభాగం కార్యదర్శి శ్రీమతి రచనా షా ఈ సమావేశాన్ని ప్రారంభించి ప్రతినిధులకు స్వాగతం పలికారుఅవినీతిని ఎంతమాత్రం సహించని భారత విధానాన్ని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారుసుపరిపాలనసుస్థిరాభివృద్ధిప్రజా విశ్వాసాలకు.. నైతికతసమగ్రతలే అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారుబలమైన సంస్థలుసాంకేతికత ప్రాతిపదికగా పాలనపారదర్శకతజవాబుదారీతనంనిరంతర అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు.

 

బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యబృందం సాధారణ అవగాహనను పెంచుకునే వేదికగానే కాకుండా.. ఆచరణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టే దిశగా వేగంగా పరివర్తన చెందుతోందని కార్యదర్శి వ్యాఖ్యానించారుప్రభావవంతమైన అంతర్జాతీయ సహకారం సాధ్యపడాలంటే.. సకాలంలో సమాచార మార్పిడిసంబంధిత అధికారిక సంస్థల మధ్య సత్వర సమన్వయం అవసరమని ఆమె పేర్కొన్నారుఅలాగే అధికారిక పరస్పర చట్టపరమైన సాయంనేరగాళ్ల అప్పగింత విధానాలకు తోడుగా.. క్షేత్రస్థాయి నిపుణుల మధ్య నమ్మకమైన సమాచార వినిమయ వ్యవస్థలూ అత్యంత కీలకమైనవన్నారు.

అవినీతికి పాల్పడి దేశం దాటి పరారైన నేరగాళ్లను పట్టుకోవడంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడంనేరస్తుల అప్పగింత ప్రక్రియకు తోడ్పడడం లక్ష్యంగా.. బ్రిక్స్ దేశాల కోసం చట్టాలను అమలు చేసే నిపుణులతో అనుసంధానం కోసం అధ్యక్ష స్థానంలో భారత్ కీలక ప్రతిపాదన చేసిందిదానికి సభ్య దేశాల నుంచి విశేష మద్దతు లభించిందిఈ ప్రతిపాదిత నెట్‌వర్క్ లక్ష్యాలుపరిధికార్యాచరణ విధానాలపై సభ్య దేశాలు నిర్మాణాత్మకంగా చర్చించిసూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయిక్షేత్రస్థాయి నిపుణుల కోసం ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేందుకు చర్చలను కొనసాగించాలని నిర్ణయించాయిఈ కార్యక్రమంతో అనధికారిక సహకారం పెరగడంతోపాటు.. పరారీలో ఉన్న నేరగాళ్లను గుర్తించడం సులభతరమవుతుందనిఅధికారికంగా నేరస్తుల అప్పగింత కోసం ప్రస్తుతమున్న యంత్రాంగానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నారు.

 

అవినీతికి పాల్పడి పరారైన నేరగాళ్లను గుర్తించడానికివారి అప్పగింతకు తోడ్పడటానికి ఉద్దేశించిన అనధికారిక సహకారంపై బ్రిక్స్ సమాచార నిధి (రిపాజిటరీ)ని కూడా సభ్య దేశాలు స్వాగతించాయివివిధ దేశాల అమలు విధానాలుఅందుబాటులో ఉన్న అనధికారిక సహకార మార్గాల సమాచారాన్ని ఒకే చోటికి చేర్చే ఒక ఆచరణాత్మకనిపుణుల ప్రాతిపదికన నడిచే ఆధారంగా ఇది ఉపయోగపడుతుంది.

ఆస్తుల పునరుద్ధరణపై ఏర్పాటైన బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశం.. సంబంధిత అధికారిక సంస్థల మధ్య ప్రత్యక్ష సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన ఆచరణాత్మక అంశాలలో గణనీయమైన పురోగతిని సాధించిందిఅధికారిక పరస్పర చట్టపరమైన సహాయ విధానాలకు తోడ్పడుతూనే.. దర్యాప్తు ప్రాథమిక దశల్లో క్షేత్రస్థాయి నిపుణుల మధ్య సకాలంలో సమాచార మార్పిడిని సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రమాణీకృత విధానాలపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

 

బ్రిక్స్ దేశాల్లోని అధికారిక సంస్థల మధ్య మరింత ప్రత్యక్ష సమాచార మార్పిడికి తోడ్పడే ప్రధాన అంశాలునిపుణుల డైరెక్టరీని కూడా నిపుణుల నెట్‌వర్క్ స్వాగతించిందిఈ జాబితా ఎప్పటికప్పుడు కచ్చితంగాకార్యాచరణోపయోగంగా ఉండేందుకు వీలుగా.. అదనంగా నిపుణులను నామినేట్ చేయడంతోపాటుభవిష్యత్ బ్రిక్స్ అధ్యక్ష దేశాలు ఈ డైరెక్టరీని క్రమానుగతంగా సమీక్షించి నవీకరించేందుకు సభ్య దేశాలు మద్దతు తెలిపాయి.

 

అంతర్జాతీయ ఆస్తుల రికవరీకి సంబంధించి తమ అనుభవాలుసంస్థాగత విధానాలుఆచరణాత్మక కేస్ స్టడీలను బ్రిక్స్ సభ్య దేశాలు పరస్పరం పంచుకున్నాయిబ్రిక్స్ దేశాల్లోని పరిశోధకులునిపుణుల మధ్య నిరంతర జ్ఞాన భాగస్వామ్యంమెరుగైన సహకారం విలువను ఈ చర్చలు స్పష్టం చేశాయి.

"ఆవిష్కరణలుసాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక విలువలతో కూడిన పాలనఅనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం... సాంకేతికత ఆధారిత పాలనలో ఆచరణాత్మక ఆవిష్కరణలను పంచుకోవడానికి సభ్య దేశాలకు ఒక వేదికను అందించిందిసమగ్ర డిజిటల్ సేకరణ వేదికలు విచక్షణారహిత జోక్యాలనుఅవినీతి ముప్పును తగ్గిస్తూ... పారదర్శకతట్రేసబిలిటీనిష్పక్షపాత పోటీసామర్థ్యాలనూ మెరుగుపరుస్తాయని ఈ చర్చలు స్పష్టం చేశాయి.

సరైన సంస్థాగత భద్రతా చర్యలుమానవ పర్యవేక్షణల మద్దతుతో ఎప్పటికప్పుడు ప్రమాదాలను గుర్తించడంధ్రువీకరించడం ద్వారా... నివారణపరమైన అప్రమత్తత దిశగా పర్యవేక్షణను మళ్లించడంలో కృత్రిమ మేధస్సుమెషిన్ లెర్నింగ్బిగ్-డేటా అనలిటిక్స్ సామర్థ్యాన్నీ సభ్యులు ప్రముఖంగా ప్రస్తావించారుపౌరులకు సాధికారత కల్పించడంలోసంస్థాగత జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంలోప్రజా విశ్వాసాన్ని పెంపొందించడంలో ఓపెన్ డేటాడిజిటల్ సామాజిక ఆడిట్‌లుఫిర్యాదు పరిష్కార వేదికలుఉమ్మడి నిఘా ప్రాముఖ్యతనూ ఈ చర్చలు పునరుద్ఘాటించాయి.

“ఫైనాన్షియల్ టెక్నాలజీవర్చువల్ డిజిటల్ అసెట్స్ ద్వారా తలెత్తుతున్న ప్రమాదాలుఅవినీతి సొమ్మును దాచడంలాండరింగ్ చేయడంలో వాటి దుర్వినియోగాన్ని పరిష్కరించడం” అనే అంశంపై చర్చ జరిగిందిఫిన్‌టెక్వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఆర్థిక సమ్మిళితాన్నిఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నప్పటికీ... వాటి వేగంపరిమితులు లేని స్వభావంపారదర్శకత లోపం కారణంగా అక్రమ సొమ్మును దాచిపెట్టడానికిబదిలీ చేయడానికీ వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని సమావేశం గుర్తించింది.

వర్ధమాన సాంకేతికతల చట్టబద్ధమైన నూతన ఆవిష్కరణ సామర్థ్యాన్ని పరిరక్షిస్తూనే... మనీలాండరింగ్ నిరోధకఉగ్రవాద నిధుల నిరోధక భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసే స్పష్టమైనముప్పు-ఆధారిత నియంత్రణ విధానాల ఆవశ్యకతను సభ్యులు స్పష్టం చేశారువర్ధమాన వర్గీకరణలుపర్యవేక్షణ సంబంధిత అభిప్రాయాలను పంచుకోవడం... ఎఫ్‌ఐయూ-టు-ఎఫ్‌ఐయూసరిహద్దు సహకారాన్ని మరింతగా పెంపొందించడం... అక్రమ డిజిటల్ ఆర్థిక లావాదేవీలు జరిగే వేగానికి అనుగుణంగా సమాచార మార్పిడినీ అందుబాటులోకి ఉంచడంపై బ్రిక్స్ సహకారం దృష్టి సారించాలనీ వారు ఉద్ఘాటించారు.

భారత్ బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో కొనసాగిన కాలంలో సాధించిన పురోగతిని ఈ సమావేశాలు చర్చించాయిఆస్తుల రికవరీసరిహద్దు అవినీతి నిర్మూలనపరారీలో ఉన్న నేరస్తులను గుర్తించడంకొత్తగా తలెత్తుతున్న ఆర్థికపరమైన నష్టాలను పరిష్కరించడం సహా పారదర్శకమైనజవాబుదారీసాంకేతికత ఆధారిత పాలనను ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఆచరణాత్మక సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల బ్రిక్స్ సభ్య దేశాల సమష్టి నిబద్ధతనూ ఈ సమావేశాలు పునరుద్ఘాటించాయి.

భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గ సమావేశాల ఫలితాలు... భవిష్యత్తులో బ్రిక్స్‌కు అధ్యక్షత వహించే దేశాలు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి బలమైన పునాది వేశాయిఅవినీతి నిరోధకచట్టాన్ని అమలు చేసే అధికారుల మధ్య సహకారం కోసం వాటిని క్రమంగా సమర్థమైనవిశ్వసనీయమైన కార్యాచరణ వేదికలుగా అభివృద్ధి చేశాయి.

 

***


(रिलीज़ आईडी: 2295026) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English