హోం మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్‌షిప్ 2026ను నిర్వహించనున్న సీఐఎస్ఎఫ్
జూలై 23 నుంచి 30 వరకు జరిగే ఈ పోటీల్లో ఐదు క్రీడాంశాల్లో పోటీపడనున్న
36 పోలీస్, సీఏపీఎఫ్ సంస్థలకు చెందిన 1,600 మందికి పైగా క్రీడాకారులు
प्रविष्टि तिथि:
20 JUL 2026 6:00PM by PIB Hyderabad
అఖిల భారత పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఏఐపీఎస్సీబీ) ఆధ్వర్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) నిర్వహించే 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్‌షిప్- 2026 హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎమ్‌సీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జూలై 23 నుంచి 30 వరకు జరగనుంది.

ఈ ఛాంపియన్‌షిప్‌లో 36 రాష్ట్ర పోలీస్, కేంద్ర సాయుధ భద్రతా దళాల (సీఏపీఎఫ్) సంస్థలకు చెందిన 1,600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొని జూడో, వుషు, టేక్వాండో, కరాటే, పెంచాక్ సిలాట్ క్రీడాంశాలలో పోటీపడనున్నారు. ఆయా జాతీయ సమాఖ్యలకు చెందిన దాదాపు 150 మంది సాంకేతిక అధికారులు ఈ పోటీలను పర్యవేక్షించనున్నారు.
నేడు హైదరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో (ఎన్ఐఎస్ఏ) నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో (కర్టెన్ రైజర్-కమ్-ప్రెస్ కాన్ఫరెన్స్) ఈ ఛాంపియన్‌షిప్ వివరాలను వెల్లడించారు. మీడియాను ఉద్దేశించి ఎన్ఐఎస్ఏ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీమతి హర్‌ప్రీత్ కౌర్ సోహి మాట్లాడుతూ.. ఈ ఛాంపియన్‌షిప్ పోలీస్, సీఏపీఎఫ్ సిబ్బందిలో క్రీడా సంస్కృతిని పెంపొందించడంతో పాటు అథ్లెట్లు తమ ప్రతిభను, క్రీడా నైపుణ్యాన్ని చాటుకోవడానికి ఒక జాతీయ వేదికను అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఒలింపియన్ శ్రీ పారుపల్లి కశ్యప్, ప్రముఖ రోయింగ్ కోచ్ శ్రీ ఇస్మాయిల్ బైగ్ మాట్లాడుతూ.. యూనిఫాం ధరించే దళాలలో క్రమశిక్షణ, సహనశీలత, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఉద్ఘాటించారు. ఈ ఛాంపియన్‌షిప్ అథ్లెట్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
MY2Q.jpeg)
YUFS.jpeg)
ఆసియా క్రీడలు- 2026 రానున్న వేళ ఈ ఛాంపియన్‌షిప్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందులో పోటీపడుతున్న అయిదు క్రీడల్లో జూడో, వుషు, టేక్వాండో, కరాటేలు ఆసియా క్రీడల్లో కూడా ఉన్నాయి. పోలీస్, సీఏపీఎఫ్లకు చెందిన అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయికి ఉపయోగపడే విలువైన పోటీ అనుభవాన్ని ఇది అందించనుంది.
తెలంగాణ రాష్ట్ర జంతువైన మచ్చల జింక (చిటాల్) ఆధారంగా రూపొందించిన ఈ ఛాంపియన్‌షిప్ మస్కట్ 'వీరా'ను ఆవిష్కరించారు. ఇది సజీవత, ప్రభావశీలత, సహనశీలత, చురుకుదనం అనే గుణాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది మార్షల్ ఆర్ట్స్, భద్రతా దళాల స్ఫూర్తిని తెలియజేస్తోంది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ, తెలంగాణ పోలీస్ అకాడమీ, ఇతర భాగస్వామ్య సంస్థలు రవాణా, నిర్వహణ సహకారాన్ని అందిస్తున్నాయి. నిర్ణీత నిబంధనలకు అనుగుణంగా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) యాంటీ-డోపింగ్ పరీక్షలను నిర్వహిస్తుంది. పాల్గొనే క్రీడాకారులు, అధికారుల కోసం సమగ్రమైన వైద్య, వసతి ఏర్పాట్లను చేశారు.

I47K.jpeg)
***
(रिलीज़ आईडी: 2286752)
आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English