పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రచారకులుగా మారాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన శ్రీ సురేష్ గోపి
తెలంగాణలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్వహించిన స్వచ్ఛత పఖ్వాడా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి
प्रविष्टि तिथि:
14 JUL 2026 5:41PM by PIB Hyderabad
పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు ప్రచారకులుగా మారాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి ఈ రోజు పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ఉద్యమం మాత్రమే కాదని అది వ్యక్తిగత బాధ్యత, 'జన్ భాగీదారి' (ప్రజా భాగస్వామ్యం)తో ముడిపడి ఉన్న ఒక సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) సంయుక్తంగా నిర్వహించిన స్వచ్ఛత పఖ్వాడా కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.

శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి నాయకత్వంలో 'స్వచ్ఛ భారత్ మిషన్' పరిశుభ్రతను ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మార్చిందని శ్రీ సురేష్ గోపి అన్నారు. ప్రతి శుభ్రమైన తరగతి గది, చెత్త లేని వీధి, పచ్చని ప్రాంగణం బాధ్యతాయుతమైన ప్రజల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందన్న ఆయన... ఇది దేశ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
'తల్లి పేరు మీద ఒక చెట్టు’ (ఏక్ పేడ్ మా కే నామ్)' కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతి మొక్కను సంరక్షించాలని ఆయన కోరారు. భావితరాలకు మనం అందించగలిగే గొప్ప బహుమతుల్లో వృక్షాలు ముఖ్యమైనవని అన్నారు. అవి స్వచ్ఛమైన గాలి, నీడ, జీవవైవిధ్యం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయని ఆయన అన్నారు. ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని... తద్వారా పచ్చని తెలంగాణ, హరిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశ ఇంధన భద్రతను నిర్ధారించడమే కాకుండా సుస్థిరాభివృద్ధి, సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి కూడా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లతో (హెచ్‌పీసీఎల్) పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నయారా ఎనర్జీల సంయుక్త ప్రయత్నాలను ఆయన అభినందించారు. తమ ప్రధాన బాధ్యతలకు అతీతంగా దేశ నిర్మాణం పట్ల ఇంధన రంగ సంస్థలు చూపే నిబద్ధతను ఇటువంటి కార్యక్రమాలు తెలియజేస్తాయని ఆయన అన్నారు.
13I9.jpeg)
విద్యార్థులు క్రమశిక్షణ, కరుణ, చిత్తశుద్ధి, ప్రకృతి పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలని శ్రీ సురేష్ గోపి కోరారు. ప్రతిభ అనేది కేవలం విద్యాపరమైన ప్రదర్శనలోనే కాకుండా బాధ్యతాయుతమైన పౌరుడిలో కూడా ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు- విద్యుత్‌ను ఆదా చేయాలని, ఒక్క సారి వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, ప్రజల ఆస్తులను కాపాడాలని, పర్యావరణ పరిరక్షణ కోసం చురుకుగా సహకరించాలని ఆయన విద్యార్థులను విన్నవించారు.
1UDC.jpeg)
‘వికసిత్ భారత్- 2047’ సంకల్పం గురించి మాట్లాడుతూ.. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, విద్య, సామాజిక బాధ్యతను నిర్ధారించడంలో ప్రతి పౌరుడికి ఒక పాత్ర ఉందని కేంద్ర మంత్రి అన్నారు. స్వచ్ఛత స్ఫూర్తిని జీవితకాల నిబద్ధతగా మార్చుకోవాలని... స్వచ్ఛమైన, పచ్చని, ఆరోగ్యకరమైన, మరింత మానవత్వంతో కూడిన భారత్‌ను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
X5ME.jpeg)
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కార్యనిర్వాహక డైరెక్టర్ - రాష్ట్ర హెడ్ (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) శ్రీ పీయూష్ మిట్టల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) జనరల్ మేనేజర్ శ్రీ సుశీల్ కుమార్ రాయ్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సురేష్ గోపి... 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని పాఠశాల ప్రాంగణం నుంచి వారి ఇళ్లకు, సమాజానికి తీసుకువెళ్లేలా విద్యార్థులను ప్రోత్సహించిన ఆయన.. వాళ్లకు మొక్కలను పంపిణీ చేశారు.
***
(रिलीज़ आईडी: 2284572)
आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English