సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో ఆధునీకరించిన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎన్‌సీఎస్‌సీ చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా

प्रविष्टि तिथि: 11 JUL 2026 6:08PM by PIB Hyderabad

షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (ఎన్‌సీఎస్‌సీ) చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా 2026 జూలై 13న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. కవాడిగూడలోని సీజీఓ టవర్స్ సముదాయంలో నూతనంగా ఆధునీకరించిన ఎన్‌సీఎస్‌సీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో చైర్మన్ వెంట ఎన్‌సీఎస్‌సీ సభ్యులు శ్రీ వడ్డెపల్లి రాంచందర్కమిషన్ కార్యదర్శి శ్రీ గుడే శ్రీనివాస్ (ఐఏఎస్‌) పాల్గొననున్నారు.

 

కార్యాలయ ప్రారంభోత్సవ వేడుక అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో చైర్మన్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులుప్రజాప్రతినిధులువివిధ షెడ్యూల్డ్ కులాల సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. పర్యటనలో భాగంగా చైర్మన్ ప్రజలను స్వయంగా కలిసి షెడ్యూల్డ్ కులాల సంక్షేమంహక్కుల పరిరక్షణసమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతులను స్వీకరిస్తూ వారితో ముఖాముఖి మాట్లాడుతారు.

  

అధికారిక పర్యటనలో భాగంగా ఎన్‌సీఎస్‌సీ చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనుంది.

 

రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల సామాజికఆర్థిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించివాటిని మరింత మెరుగుపరచడంపై ఈ చర్చలు ప్రధానంగా సాగనున్నాయి. సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలును పర్యవేక్షించడంరాజ్యాంగపరమైన రక్షణలను బలోపేతం చేయడంతెలంగాణలోని ఎస్సీ వర్గాలపై ప్రభావం చూపుతున్న కీలక సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఈ ఉన్నత స్థాయి సమీక్ష సాగనుంది.

 

***


(रिलीज़ आईडी: 2283696) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English