కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
బీడీ, గని, సినీ కార్మికుల పిల్లల ఉపకార వేతనాల కోసం 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం
प्रविष्टि तिथि:
15 JUN 2026 7:44PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన కార్మిక సంక్షేమ సంస్థకు సంబంధించిన వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ ఉపకారవేతన పథకాల కింద ఆర్థిక సహాయం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బీడీ కార్మికులు... సున్నపురాయి- డోలమైట్, ఇనుప ఖనిజం, మాంగనీస్ - క్రోమ్ ఖనిజాల, అభ్రకం గనులు కార్మికులు... సినీ కార్మికుల పిల్లలకు ఈ ఉపకారవేతనాలు ఇస్తారు.
1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు (ప్రీ-మెట్రిక్), 11వ తరగతి నుంచి వృత్తి నిపుణుల డిగ్రీ కోర్సుల వరకు (పోస్ట్-మెట్రిక్) చదువుతున్న విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్పీ) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీలు:
· ప్రీ-మెట్రిక్ (1 నుంచి 10వ తరగతి వరకు): 2026 ఆగస్టు 31
· పోస్ట్-మెట్రిక్ (11వ తరగతి నుంచి వృత్తి నిపుణుల డిగ్రీ వరకు): 2026 అక్టోబర్ 31
· అభ్యర్థులు దరఖాస్తులను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్పీ) ద్వారా సమర్పించొచ్చు.
దరఖాస్తు సమర్పణ, వెరిఫికేషన్ విషయంలో సహాయం కోసం అభ్యర్థులు ఎన్ఎస్‌పీ హెల్ప్‌డెస్క్ నంబర్: 0120-6619540 లేదా helpdesk@nsp.gov.in ఈమెయిల్ ద్వారా సంప్రదించొచ్చు.
మరింత సమాచారం కోసం అభ్యర్థులు ‘వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం, కార్మిక సంక్షేమ సంస్థ, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోఠి, హైదరాబాద్ – 500001 (ఫోన్: 040-29561297, ఈమెయిల్: wclwohyd[at]nic[dot]in)’ను లేదా తమకు సమీపంలో ఉన్న ఈ సంస్థ వైద్యశాలలను సంప్రదించొచ్చు.
అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువు కంటే ముందే దరఖాస్తులను సమర్పించాలని వెల్ఫేర్ కమిషనర్ కోరారు.
***
(रिलीज़ आईडी: 2273210)
आगंतुक पटल : 37
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English