హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డీజీ సీఐఎస్ఎఫ్ శ్రీ ప్రవీర్ రంజన్‌తో కలిసి దీక్షాంత్ పరేడ్‌ను వీక్షించిన తెలంగాణ గవర్నర్ * హైదరాబాద్‌లోని ఎన్ఐఎస్ఏ నుంచి 200 మంది అధికారులను విధుల్లోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్

प्रविष्टि तिथि: 13 JUN 2026 2:48PM by PIB Hyderabad

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)... హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో గల తన క్యాంపస్‌లో 39వ బ్యాచ్ అసిస్టెంట్ కమాండెంట్లు, 9వ బ్యాచ్ సబ్-ఇన్‌స్పెక్టర్ల (మాజీ సైనికులు) పాసింగ్ అవుట్ పరేడ్‌ను నిర్వహించింది. దీని ద్వారా 200 మంది శిక్షణ పొందిన అధికారులు లాంఛనంగా ఈ బలగాల కార్యాచరణ విభాగంలోకి చేరారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రవీర్ రంజన్, సీఐఎస్ఎఫ్‌కు చెందిన ఇతర సీనియర్ అధికారులు, రాష్ట్ర సివిల్, పోలీసు ప్రముఖులుఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

శిక్షణ పూర్తి చేసుకున్న 200 మంది అధికారుల్లో... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సీఏపీఎఫ్ (ఏసీ) పరీక్ష ద్వారా ఎంపికైన 76 మంది అసిస్టెంట్ కమాండెంట్లు (వీరిలో అయిదుగురు మహిళా అధికారులు ఉన్నారు) ఉండగా, 124 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లు (మాజీ సైనికులు) ఫోకస్డ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కోర్సును పూర్తి చేశారు.

విశ్వాసం, బాధ్యత, అచంచలమైన కర్తవ్యానికి ప్రతీక. మీ నడవడిక, నిజాయతీ, ధైర్యంతో అందరికీ ఆదర్శంగా ఉంటూ మార్గదర్శకులుగా నిలవండి." అని అన్నారు.

చేశారనీ పేర్కొన్నారు. భారత సైన్యం, ఎన్‌ఎస్‌జీతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన 'బ్యాటిల్ హార్డెనింగ్ ప్రోగ్రామ్' ద్వారా 2,643 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వగా, 2025–26లో కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 4,500 మందికి పైగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 1,600 మంది సైబర్ కమాండోలకు సైబర్‌ సెక్యూరిటీపై యుద్ధం కోసం అవసరమైన పరికరాలనూ సమకూర్చారు. సైబర్ శిక్షణ, సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ఎన్‌ఐటీ, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ, ఐఐటీ మద్రాస్‌లతో... అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, అధునాతన సైబర్ పరిశోధన కోసం ఐఐడీఎం కాంచీపురంతో కుదిరిన అవగాహన ఒప్పందాలు (ఎమ్‌వోయూలు) ఈ బలగాల సాంకేతిక ఆధిక్యతను మరింత బలోపేతం చేస్తున్నాయి.

మౌలిక సదుపాయాల పరిరక్షణ, సరిహద్దు భద్రత సంబంధిత కోర్సులకు శ్రీలంక, నేపాల్‌ దేశాలకు చెందిన అధికారులూ హాజరవుతున్నారు. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేస్తూ హైదరాబాద్-ఎన్ఐఎస్ఏ... అంతర్జాతీయ సామర్థ్యాల పెంపుదల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఆవిర్భవించింది. రాష్ట్ర పోలీస్ అకాడమీలు, రాష్ట్ర పారిశ్రామిక భద్రతా దళాలకు చెందిన 2,000 మందికి పైగా సిబ్బంది పారిశ్రామిక భద్రత, క్లోస్ ప్రొటెక్షన్, ప్రతిస్పందన పద్ధతులపై 24 ప్రత్యేక కోర్సులకు హాజరయ్యారు. 45 మంది అధికారులు ప్రత్యేక ఆర్‌ఎస్‌ఓ శిక్షణనూ పూర్తి చేశారు. కిషన్‌గంజ్‌లో 7వ ప్రాంతీయ శిక్షణా కేంద్రం కోసం బీహార్ ప్రభుత్వం 110 ఎకరాలను కేటాయించడం, సీఐఎస్‌ఎఫ్ శిక్షణా మౌలిక సదుపాయాల గణనీయమైన విస్తరణకు నాంది పలికింది.

ప్రతిస్పందన, నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తూ... సవరించిన శిక్షణా నిబంధనల ప్రకారం శిక్షణ పొందిన ఈ అధికారులు, కీలక మౌలిక సదుపాయాల రక్షణ, విమానయాన భద్రత, వీఐపీ రక్షణ, విపత్తు ప్రతిస్పందన వంటి రంగాల్లో సీఐఎస్ఎఫ్ సామర్థ్యాలను మరింత పెంపొందించడానికి సన్నద్ధులయ్యారు. ఈ నియామకం గత ఏడాది కాలంలో ఏర్పాటు చేసిన అనేక కొత్త యూనిట్ల అవసరాలనూ తీరుస్తుంది. సీఐఎస్ఎఫ్ కార్యాచరణ పరిధి నిరంతరం పెరుగుతున్నందున... ఓడరేవుల భద్రత, జైలు భద్రత వంటి విస్తరిస్తున్న బాధ్యతలను స్వీకరించడానికీ ఈ బలగాలు సన్నద్ధమవుతున్నాయి.

శిక్షణలో శ్రేష్ఠత ద్వారా జాతీయంగా గుర్తింపు పొందిన ఎన్ఐఎస్ఏ, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) విభాగంలో ఉత్తమ శిక్షణా సంస్థగా రెండుసార్లు — 2017–18, 2020–21లో కేంద్ర హోం మంత్రి ట్రోఫీని అందుకుంది. 2024లో సామర్థ్య పెంపుదల కమిషన్ కింద 'ఉత్కృష్ట' సంస్థగా గుర్తింపు సాధించింది.

హైదరాబాద్‌లోని ఎన్ఐఎస్ఏలో జరిగిన ఈ పాసింగ్ అవుట్ పరేడ్... కేవలం భద్రతా నిపుణులుగా మాత్రమే కాకుండా, అంతకంతకూ సంక్లిష్టమవుతున్న అంతర్గత భద్రతా వాతావరణంలో దేశంలోని కీలక ఆస్తులను పరిరక్షించగల సామర్థ్యంతో పాటు క్రమశిక్షణ గల నాయకులుగా అధికారులను తీర్చిదిద్దడం పట్ల సీఐఎస్ఎఫ్ నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

****


(रिलीज़ आईडी: 2272497) आगंतुक पटल : 83
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English