సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.87 లక్షల కోట్ల చారిత్రక టర్నోవర్‌ను సాధించిన ఖాదీ , గ్రామీణ పరిశ్రమలు


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉత్పత్తి, అమ్మకాలు, ఉపాధి రంగాల్లో ఖాదీ & గ్రామీణ పరిశ్రమల విశేష పురోగతి

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 4:30PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి, అమ్మకాలు , ఉపాధి కల్పన రంగాల్లో కొత్త రికార్డులను సృష్టించింది. గాంధీ దర్శన్‌, రాజ్‌ఘాట్‌, న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేవీఐసీ ఛైర్మన్‌ శ్రీ మనోజ్‌ కుమార్‌ విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం, ఖాదీ , గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల టర్నోవర్‌ తొలిసారిగా రూ.1.87 లక్షల కోట్ల మార్కును దాటింది.

 

2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.31,154 కోట్లుగా ఉన్న ఖాదీ , గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు, 2025-26 నాటికి రూ.1,87,105 కోట్లకు చేరుకుని 501 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదే కాలంలో ఉత్పత్తి రూ.26,109 కోట్ల నుండి రూ.1,25,296 కోట్లకు పెరిగి 380 శాతం వృద్ధిని సాధించింది. ఉపాధి కల్పనలో కూడా 56 శాతం వృద్ధి నమోదై, ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 1.30 కోట్ల నుండి 2.04 కోట్లకు పెరిగింది.

ఈ విజయాలకు మహాత్మా గాంధీ ఆశయాలు, గ్రామీణ కళాకారుల కృషి , ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వోకల్ ఫర్ లోకల్’, ‘లోకల్ టు గ్లోబల్’ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ప్రధాన కారణమని మనోజ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఖాదీ ఇప్పుడు కేవలం సంప్రదాయ ఉత్పత్తి మాత్రమే కాకుండా, స్వావలంబనతో కూడిన నూతన భారతానికి ప్రతీకగా మారిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

 

ఖాదీ వస్త్రాల రంగంలో కూడా గణనీయమైన పురోగతి నమోదైంది. 2013-14లో రూ.811 కోట్లుగా ఉన్న ఖాదీ ఉత్పత్తి, 2025-26 నాటికి రూ.3,974 కోట్లకు చేరుకోగా, అమ్మకాలు రూ.1,081 కోట్ల నుండి రూ.7,869 కోట్లకు పెరిగి 628 శాతం వృద్ధిని సాధించాయి. గ్రామీణ పరిశ్రమల రంగం కూడా ఉత్పత్తి , అమ్మకాలలో విశేష పురోగతి సాధించింది.

ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 66,494 కొత్త యూనిట్లు స్థాపించబడి, 7.31 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. మహిళా సాధికారతలో భాగంగా, వివిధ శిక్షణా కార్యక్రమాల్లో శిక్షణ పొందిన వారిలో సుమారు 59 శాతం మహిళలే ఉన్నారు.

 

ఖాదీ కళాకారులకు చెల్లించే పారితోషికం కూడా గణనీయంగా పెరిగింది. 2013-14లో ఒక్క హాంక్‌కు రూ.4గా ఉన్న పారితోషికం ప్రస్తుతం రూ.15కు పెరిగి సుమారు 275 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 

****


(రిలీజ్ ఐడి: 2265433) సందర్శకుల సూచీ సంఖ్య : : 155
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English