కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో లాజిస్టిక్స్, ఇ-కామర్స్‌ వ్యవస్థల బలోపేతం లక్ష్యంగా అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన తపాలా శాఖ, డీటీడీసీ

నాడు పోస్టు చేయడమైనది: 27 APR 2026 5:21PM by PIB Hyderabad

భారత లాజిస్టిక్స్-కామర్స్ వ్యవస్థల బలోపేతం లక్ష్యంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలాశాఖడీటీడీసీ ఎక్స్‌ప్రెస్ సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయిఈ రెండు సంస్థలకు చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో... తపాలా శాఖలోని పార్శిల్ డైరెక్టరేట్ జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ కుమార్ ఝాడీటీడీసీ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ నేషనల్ ఛానల్ హెడ్ శ్రీ జతిందర్ సేథీలు ఈ రోజు న్యూఢిల్లీలో ఈ ఒప్పందాన్ని లాంఛనంగా ఖరారు చేశారు.

దేశవ్యాప్తంగా పార్శిల్ డెలివరీ కార్యకలాపాలను గణనీయంగా మెరుగుపరచడం కోసం విస్తారమైన తపాలా శాఖ మౌలిక సదుపాయాలునెట్‌వర్క్‌ను... డీటీడీసీ లాజిస్టిక్స్ అనుభవంతో కలిపి ఉపయోగించుకోవడం లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరింది. 2025లో ఇరు పక్షాల మధ్య ప్రారంభమైన సహకారం నిరంతరాయంగా కొనసాగుతుందని ఈ అవగాహన ఒప్పందం సూచిస్తుంది.

అవగాహన ఒప్పంద ముఖ్యాంశాలు:

లక్ష్యం: లాజిస్టిక్స్వ్యాపార కార్యకలాపాల్లో నూతన అవకాశాలను అన్వేషించడంవిస్తరించడంతద్వారా క్యాష్ ఆన్ డెలివరీ సేవలు సహా దేశవ్యాప్త పార్శిల్ డెలివరీ కోసం తపాలా శాఖ విస్తృతమైన పోస్టల్ నెట్‌వర్క్‌ను డీటీడీసీ ఉపయోగించుకునేలా చేయడం.

మెరుగైన సహకారం: కార్యాచరణ సామర్థ్యాన్నిసేవల నాణ్యతను మెరుగుపరచడం కోసం ఉమ్మడి లాజిస్టిక్స్ కార్యకలాపాలుసామర్థ్య భాగస్వామ్యంపార్శిల్ రంగంలోని ఉత్తమ పద్ధతులుమార్కెటింగ్ వ్యూహాల సమకాలీకరణపై ఈ అవగాహన ఒప్పందం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

క్రమబద్ధమైన సమీక్షా యంత్రాంగాలు: భాగస్వామ్య పురోగతిని అంచనా వేయడానికివారి వ్యవస్థల ఏకీకరణను నిర్ధారించడానికిలాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం కోసం కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఇరు పక్షాలు త్రైమాసిక సమావేశాలను నిర్వహిస్తాయి.

డీటీడీసీకి ప్రయోజనాలు:

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 1.64 లక్షల సాటిలేని తపాలా కార్యాలయాల నెట్‌వర్క్‌ను డీటీడీసీ వినియోగించుకోనుందిఈ భాగస్వామ్యం ద్వారా డీటీడీసీ తన లాజిస్టిక్స్ కార్యకలాపాలను విస్తరించుకోవడానికిడెలివరీ వేగాన్ని మెరుగుపరచుకోవడానికిముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో భారత ఇ-కామర్స్ రంగంలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి వీలు కలుగుతుంది.

తపాలా శాఖకు ప్రయోజనాలు:

ఈ సహకారం ద్వారా డీఓపీ తన పార్శిల్ వ్యాపారాన్ని మెరుగుపరుచుకుంటుందిఇది వేగవంతమైన రవాణాడెలివరీ సేవలను సులభతరం చేయడంతో పాటుతన నెట్‌వర్క్‌నూ విస్తరిస్తుందిడీటీడీసీతో చేతులు కలపడం ద్వారా భారత లాజిస్టిక్స్ రంగంలో తన పాత్రను మరింత బలోపేతం చేసుకోవాలనితద్వారా దేశాన్ని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా మార్చాలనే దార్శనికతకు తోడ్పాటునందించే లక్ష్యంతో తపాలా శాఖ ముందుకు సాగుతోంది.

తపాలా శాఖ గురించి:

సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని తపాలా శాఖ... దేశవ్యాప్తంగా 1.64 లక్షలకు పైగా తపాలా కార్యాలయాలతో ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోందిదేశంలో ఇ-కామర్స్ వృద్ధిని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ... సమాచారలాజిస్టిక్స్ఆర్థిక సేవలను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది.

డీటీడీసీ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ గురించి:

దేశంలోని ప్రముఖ ఎక్స్‌ప్రెస్ పార్సెల్ డెలివరీ కంపెనీల్లో డీటీడీసీ ఒకటిఇది దేశీయఅంతర్జాతీయ ఇ-కామర్స్ కోసం వినూత్న లాజిస్టిక్స్ పరిష్కారాలను అందిస్తుందిఈ కంపెనీ వివిధ రంగాల్లోని వ్యాపారాలకు మద్దతునిస్తూ... నమ్మకమైనతక్కువ ఖర్చుతో కూడినవిస్తరించదగిన లాజిస్టిక్స్ సేవలను అందించడానికి ఇది కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2256169) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी