భారత పోటీ ప్రోత్సాహక సంఘం
విశాఖ రిన్యూవబుల్స్ సంస్థ పునరుత్పాదక వ్యాపార పునర్వ్యవస్థీకరణతో పాటు విశాఖ గ్లాస్ సంస్థతో విలీన ప్రతిపాదన
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోద ముద్ర
నాడు పోస్టు చేయడమైనది:
20 APR 2026 7:24PM by PIB Hyderabad
విశాఖ రిన్యూవబుల్స్ సంస్థ పునరుత్పాదక వ్యాపార పునర్ వ్యవస్థీకరణతో పాటు విశాఖ గ్లాస్ సంస్థతో విలీనమయ్యే ప్రతిపాదనను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదించింది.
ప్రతిపాదిత విలీనంలో విశాఖ రిన్యూవబుల్స్ సంస్థ (వీఆర్‌పీఎల్) పునరుత్పాదక వ్యాపార కార్యకలాపాలను పునర వ్యవస్థీకరించడంతో పాటు, విశాఖ గ్లాస్ సంస్థ (వీజీపీఎల్)తో కలిసిపోవడం కూడా ఓ భాగంగా ఉంది. దీనికి అదనంగా, ఈ ప్రతిపాదనలో కింద ప్రస్తావించిన ఇతర దశలు భాగంగా ఉన్నాయి:
వీఆర్‌పీఎల్‌కు చెందిన పైపుల విభాగంతో పాటు మౌల్డింగ్స్ విభాగాన్ని ప్రస్తుతం నడుస్తున్న రూపంలోనే స్లంప్ సేల్ ప్రాతిపదికన ప్రోగ్రెసివ్ పైప్స్ సంస్థ (పీపీపీఎల్)కు బదలాయించి, అప్పగింత ప్రక్రియను పూర్తి చేస్తారు.
విశాఖ రిన్యూవబుల్స్ 1 సంస్థ (వీఆర్1పీఎల్), విశాఖ మెటల్స్ సంస్థ (వీఎమ్‌పీఎల్)లతో పాటు విశాఖ మెటల్స్ 1 సంస్థ (వీఎమ్1పీఎల్)ను వీఆర్‌పీఎల్‌లో విలీనం చేస్తారు.
వీజీపీఎల్/విలీనానంతరం రూపుదాల్చే సంస్థలో వీఆర్‌పీఎల్‌ను కలుపుతారు.
(పైన పేర్కొన్న దశలన్నిటినీ కలిపి, ప్రతిపాదిత విలీనంగా పేర్కొంటారు).
విశాఖ రిన్యూవబుల్స్ సంస్థ (వీఆర్‌పీఎల్) ఈ కింద ప్రస్తావించిన తయారీ కార్యకలాపాను చేపడుతోంది:
(i) ఉన్నత శ్రేణికి చెందిన డిగ్రేడేషనును నిరోధించగలదని భావిస్తున్న ఎథిలీన్ వినైల్ ఎసిటేట్ వంటి (పీఐడీ-రెసిస్టెంట్ ఈవీఏ) ఎన్క్యాప్సులెంట్, బ్లాక్ షీట్ వంటి సోలార్ సిస్టమ్ విడిభాగాల తయారీ,
(ii) సూక్ష్మ సేద్య వ్యవస్థతో పాటు పాలీవినైల్ క్లోరైడ్, అధిక సాంద్రత కలిగి ఉండే పాలీఎథిలీన్ పైపులతో పాటు,
(iii) ప్యాలెట్లు, క్రేట్లు, పెద్ద డబ్బాల వంటి ప్లాస్టిక్ ఉత్పాదనలు.
విశాఖ రిన్యూవబుల్స్ 1 సంస్థ (వీఆర్1పీఎల్)ను ముఖ్యంగా అన్ని రకాలైన సోలార్ ప్యానల్ విడిభాగాల తయారీ వ్యాపారాన్ని నిర్వహించడం కోసం ఏర్పాటు చేశారు.
విశాఖ మెటల్స్ సంస్థ (వీఎంపీఎల్)ను ప్రధానంగా సౌర ఫలకాలకు అవసరమయ్యే అల్యూమినియమ్ ఫ్రేముల తయారీతో పాటు ఇతర సహాయక కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాటు చేశారు.
విశాఖ మెటల్స్ 1 సంస్థ (వీఎం1పీఎల్)ను అన్ని రకాలైన లోహ విడిభాగాల తయారీ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేశారు.
విశాఖ గ్లాస్ సంస్థ (వీజీపీఎల్)ను సోలార్ సిస్టమ్స్‌కు అవసరమైన సోలార్ గ్లాసులను తయారు చేసే వ్యాపారాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేశారు.
ప్రోగ్రెసివ్ పైప్స్ సంస్థ (పీపీపీఎల్)ను సూక్ష్మ సేద్యంతో పాటు బిందు సేద్య వ్యవస్థ, పీవీసీ, మధ్య స్థాయి సాంద్రతతో కూడిన పాలిథీన్ సహా పైపుల నిర్మాణం, గ్రాన్యూల్స్ తదితర ఉత్పత్తుల వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేశారు.
కమిషన్ విస్తృత ఆదేశాన్ని తరువాత జారీ చేస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2254044)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11