రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
టోలింగ్ అనుబంధ విస్తారిత వ్యవస్థలో సమాచార ఖచ్చితత్వాన్ని బలోపేతం చేయడానికి వాహన నమోదు సంఖ్యలను సరిచూసే దిశగా ఎన్‌హెచ్ఏఐ చర్యలు
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 5:20PM by PIB Hyderabad
ఫాస్టాగ్ (FASTag)లను జారీ చేస్తున్న బ్యాంకులు ఆ ఫాస్టాగులతో ముడిపెట్టిన వాహన నమోదు సంఖ్యల (వీఆర్ఎన్‌స్)ను వెంటనే సరిచూసి, అవి సక్రమంగా ఉన్నాయని ప్రకటించాలంటూ భారత జాతీయ రహదారి ప్రాధికరణ సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) వ్యవస్థలో సమాచార యథార్థతని, విశ్వసనీయతని పెంచడానికి ఎన్‌హెచ్ఏఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఫాస్టాగ్ రీడర్ నమోదు చేసిన వీఆర్ఎన్ వాహనం నంబర్ ప్లేటుపై ప్రదర్శించిన వాస్తవిక నమోదు సంఖ్యతో సరిపోలడం లేదని ఫిర్యాదులు అందడంతో, ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ఈ విధమైన అంతరాలు నేర నియంత్రణ యంత్రాంగాల్ని బలహీనపరిచే ఆస్కారం ఉండడంతో పాటు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఎగవేసేందుకు దారి తీసే ప్రమాదమూ ఉంది. అంతేకాదు, ఇవి మోటారు వాహనాల చట్టం-1988 కింద ఇతర శిక్షాత్మక నిబంధనల్ని అమలు చేయాల్సిన స్థితిని కల్పిస్తాయి.
ఇలాంటి పొంతన లేకపోయిన సందర్భాలు అనేకం వాహన్ (VAHAN) సమాచార నిధి (డేటాబేస్)తో ముడిపెట్టి ఫాస్టాగులను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించడాని కన్నా ముందు జారీ చేసిన ఫాస్టాగులకు సంబంధించినవిగా గుర్తించారు. ఆ కాలంలో, క్రమబద్ధత యాత్రాంగాలు ఆశించిన స్థాయిలో లేక, పరిమితంగా మాత్రమే ఉండేవి. ప్రక్రియను మనుషుల ప్రమేయంతో పూర్తి చేయవలసి వచ్చేది. దీంతో వాహనాల గుర్తింపు రికార్డుల్లో సంభావిత పరస్పర వైరుధ్యాలు చోటు చేసుకున్నాయి.
త్వరలో మల్టీలేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్) టోలింగ్ వంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను ప్రారంభించనున్న దృష్ట్యా, ఫాస్టాగులతో వీఆర్ఎన్ మ్యాపింగుకు సంబంధించిన యథార్థత్వాన్ని నిర్ధరించడం అత్యంత కీలకంగా మారిందని ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది. ఎంఎల్ఎఫ్ఎఫ్ ప్రణాళికలో భాగంగా, నియమాలను లెక్కచేయని వాహనదారులకు ఎలక్ట్రానిక్ నోటీసులు (ఈ-నోటీసులు) జారీ చేయడం సహా నేర నియంత్రణ సంబంధిత కార్యకలాపాలను ఖచ్చితంగా, సరిచూసిన వాహన గుర్తింపు సమాచారం ఆధారంగా చేపట్టవలసి వస్తుంది.
ఈ సందర్భంలో, ఫాస్టాగులను జారీ చేసే బ్యాంకులు అన్నీ అవి జారీ చేసిన ఫాస్టాగులను వెనువెంటనే సరి అయినవిగా గుర్తించాల్సిందిగా, చెల్లుబాటు కాని వీఆర్ఎన్‌లతో జోడించిన ఫాస్టాగులుగా కనుగొన్న వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిందిగా ఆదేశించారు.
ఎలక్ట్రానిక్ పద్ధతిని ఉపయోగించి టోల్‌ను వసూలు చేసే వ్యవస్థను పారదర్శకంగా, నియమబద్ధంగా, కార్యనిర్వహణ పరంగా సమర్థమైందిగా అమలుచేసే విధంగా ఆ వ్యవస్థని పటిష్ఠపరచాలన్న నిబద్ధతతో ఎన్‌హెచ్ఏఐ పనిచేస్తోంది. సేకరించే సమాచారంలో యథార్థతను మెరుగుపరచడానికి, ఫాస్టాగులను దుర్వినియోగపరచడాన్ని అడ్డుకోవడానికి, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను ఉపయోగించుకొనే వర్గాలకు మరింత మేలైన అనుభవాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2252497)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21