భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: సాగర్ వాణి వ్యవస్థ

నాడు పోస్టు చేయడమైనది: 01 APR 2026 11:55AM by PIB Hyderabad

భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్పరిధిలోని ఇన్‌కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్).. సముద్ర ఆధారిత ముందస్తు హెచ్చరికలుసలహా సేవలను సమగ్రంగా అందిస్తోందిఈ సేవలు ఆంధ్రప్రదేశ్ఒడిశా సహా అన్ని తీరప్రాంత రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 12 తీరప్రాంత జిల్లాల్లో (అనకాపల్లిబాపట్లడాక్టర్ బీ.ఆర్అంబేద్కర్ కోనసీమపశ్చిమ గోదావరికాకినాడకృష్ణాప్రకాశంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుశ్రీకాకుళంతిరుపతివిశాఖపట్నంవిజయనగరం).. ఒడిశాలోని తీరప్రాంత జిల్లాల్లో (బాలాసోర్భద్రక్కేంద్రపారాజగత్‌సింగ్‌పూర్పూరీగంజాంసముద్ర సమాచార సేవలు అందుతున్నాయిడాక్టర్ బీ.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్య ల్యాండింగ్ కేంద్రాల (ఎఫ్ఎల్‌సీద్వారా సేవలను విస్తరించారుఇవి సమీప గ్రామాలలోని మత్స్యకార వర్గాలకు తమ వేట పనులను ప్రారంభించడంలో తోడ్పడుతున్నాయిఅదేవిధంగా జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో 11, పూరీ జిల్లాలో 20 మత్స్య ల్యాండింగ్ కేంద్రాల ద్వారా స్థానిక లబ్ధిదారులకు సముద్ర సమాచారాన్ని సులభంగా పొందేలా సౌకర్యం కల్పించారు

భారత్‌లోని అన్ని తీరప్రాంత రాష్ట్రాలుజిల్లాల్లో దాదాపు లక్షల మంది మత్స్యకారులు.. ఇతర తీరప్రాంత లబ్ధిదారులు 'పొటెన్షియల్ ఫిషింగ్ జోన్' (పీఎఫ్‌జెడ్సలహాలుఇతర ఇన్‌కాయిస్ సేవలను పొందుతున్నారుముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,03,915 మందిఒడిశాలో 1,58,711 మంది వాట్సాప్ఈమెయిల్ఎస్ఎంఎస్టెలిగ్రామ్సముద్ర మొబైల్ యాప్ వంటి వివిధ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా నేరుగా ఇన్‌కాయిస్ సేవలను అందుకుంటున్నారుఈ ప్రత్యక్ష మార్గాలే కాకుండా ఎన్జీఓలురిలయన్స్ ఫౌండేషన్ఎం.ఎస్స్వామినాథన్ ఫౌండేషన్రాష్ట్ర మత్స్యశాఖల వంటి భాగస్వామ్య సంస్థల ద్వారా కూడా ఈ సేవలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారుతద్వారా మరిన్ని ఎక్కువ మంది వినియోగదారులకు ఈ సమాచారం చేరుతోంది.

ఎస్ఎంఎస్మొబైల్ ఫోన్లుఈమెయిల్వెబ్‌సైట్మొబైల్ యాప్‌లుసామాజిక రేడియోసామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్‌లుశాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలు (జెమిని ప్లాట్‌ఫామ్వీఓఐపీ ఫోన్లువంటి సమర్థవంతమైన మల్టీ-ఛానల్ కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా సముద్ర సంబంధిత హెచ్చరికలుసలహాలను ఇన్‌కాయిస్ అందిస్తోందిఈ సమాచారం తీరప్రాంత వర్గాలుమత్స్యకారులకు సులభంగా అర్థమయ్యేలావారు సమర్థవంతంగా వినియోగించుకునేలా చూసేందుకు 'పొటెన్షియల్ ఫిషింగ్ జోన్సలహాలుసముద్ర పరిస్థితి సూచనలను స్థానిక భాషలలో అందిస్తున్నారువీటితో పాటు 'కామన్ అలర్ట్ ప్రోటోకాల్' (సీఏపీఆధారిత 'సచేత్ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా హెచ్చరికలను ఇన్‌కాయిస్ జారీ చేస్తోందిఇది సముద్ర సంబంధిత హెచ్చరికలను రాష్ట్రజిల్లా అధికారులకు సజావుగా చేరవేయడానికి.. తద్వారా వారు ప్రజలకు మరింత వేగంగా సమాచారాన్ని అందించడానికి వీలు కల్పిస్తోంది

సముద్ర సమాచార సేవలను ఒకే వేదికపై అందించడానికి ఇన్‌కాయిస్.. బహుభాషా మొబైల్ యాప్ 'సముద్ర'ను (స్మార్ట్ యాక్సెస్ టూ మెరైన్ యూజర్స్ ఫర్ ఓషియన్ డాటా రిసోర్సెస్ అండ్ అడ్వైజర్స్అభివృద్ధి చేసిందిఈ యాప్ సునామీలుతుపాను ఉద్ధృతిభారీ అలలుస్వెల్ సర్జ్ వంటి సముద్ర ప్రమాదాలపై ఎప్పటికప్పుడు తక్షణ హెచ్చరికలను జారీ చేస్తోందితద్వారా యాప్ వినియోగదారులు సకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతోందిఇది మత్స్యకారులు చేపలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడేందుకు పీఎఫ్‌జెడ్ సలహాలను కూడా అందిస్తోందిదీనివల్ల వేట సామర్థ్యం పెరగడమే కాకుండా వారి జీవనోపాధికి మద్దతు లభిస్తోందిఅదనంగా 'సముద్రయాప్ ఐదు రోజుల సముద్ర పరిస్థితి సూచనలను అందిస్తూ నావికులుమత్స్యకారులుతీరప్రాంత వర్గాలకు ముందస్తు ప్రణాళికలు వేసుకోవడంప్రమాదాలను తగ్గించడంసముద్ర భద్రతను పెంపొందించడంలో తోడ్పడుతుందిఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాతో పాటు ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్పూరీ జిల్లాల్లో ఈ కమ్యూనికేషన్ మార్గాలన్నీ విస్తృతంగా ఉపయోగమవుతున్నాయి

మారుమూల తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు సముద్ర సలహాలను సమర్థవంతంగా చేరవేసే లక్ష్యంతో అన్ని తీరప్రాంత రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలలో నిరంతర అవగాహనసామర్థ్య పెంపుదల కార్యక్రమాలను చేపడుతోందిరాష్ట్ర ప్రభుత్వ సంస్థలుస్థానిక అధికారులువిద్యా సంస్థలుతీరప్రాంత భాగస్వాముల సహకారంతో అవగాహన సదస్సులువర్క్‌షాప్‌లుశిక్షణా కార్యక్రమాలుసునామీ మాక్ డ్రిల్స్సునామీ సిద్ధత వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ముఖ్యంగా సుదూరతీరానికి దూరంగా ఉన్న జలాల్లో వేటకు వెళ్లే మత్స్యకారులుతీరప్రాంత వర్గాల కోసం ఇన్‌కాయిస్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందిఇందులో భాగంగా వినియోగదారుల ముఖాముఖి వర్క్‌షాప్‌లుశిక్షణా తరగతుల ద్వారా వారి సంసిద్ధతకార్యాచరణ భద్రతపరిస్థితిపై అవగాహనప్రమాదాల తీవ్రతను తగ్గించే నైపుణ్యాలను పెంపొందిస్తోందిఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్పూరీ జిల్లాల్లో ఇటువంటి అవగాహన సదస్సులుబీచ్ శుభ్రత కార్యక్రమాలుమాక్ డ్రిల్స్ నిర్వహించారు. 'సునామీ సంసిద్ధతకార్యక్రమంలో భాగంగా ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్పూరీ జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి ఐదు తీరప్రాంత గ్రామాలను యునెస్కో-ఐఓసి 'సునామీ సంసిద్ధసామాజాలుగా గుర్తించింది.

ఈ సమాచారాన్ని 2026 ఏప్రిల్ 1వ తేదీన లోక్‌సభలో కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రంశాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి (స్వతంత్రడాక్టర్ జితేంద్ర సింగ్ సమర్పించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2247983) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी