ఎరువుల విభాగం
రికార్డు స్థాయిలో ఎరువుల ఉత్పత్తిని సాధిస్తున్న భారత్..
‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలతో సాలుసరి 283.74 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిన దేశీయ యూరియా ఉత్పత్తి సామర్థ్యం
పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్) పథకం ద్వారా ఫాస్ఫేట్, పోటాషియమ్ (పీ ఎండ్ కే) ఎరువుల సరఫరాలో
లోటుపాట్లను సరిచేసిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 6:07PM by PIB Hyderabad
ఎరువుల రంగంలో దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ముడిపదార్థాల దీర్ఘకాలిక సరఫరాకు ఏర్పాట్లు చేసి, కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టింది. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ రాజ్యసభలో ఈ రోజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానాన్నిస్తూ, కొత్త పెట్టుబడి విధానం (ఎన్ఐపీ) - 2012తో పాటు, ఆ విధానానికి 2014 అక్టోబరు 7న చేసిన సవరణ ఫలితంగా ఆరు నూతన యూరియా యూనిట్లను ఏర్పాటు చేశారనీ, వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నాలుగు జాయింట్ వెంచర్ యూనిట్లతో పాటు ప్రయివేటు కంపెనీలకు చెందిన రెండు యూనిట్లు ఉన్నాయనీ తెలిపారు. ఈ యూనిట్లు సాలుసరి 76.2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎమ్‌టీపీఏ) యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడించాయనీ, దీంతో 2014-15లో 207.54 ఎల్ఎమ్‌టీపీఏ గా ఉన్న మొత్తం దేశీయ సామర్థ్యం 2023-24లో 283.74 ఎల్ఎమ్‌టీపీఏకు పెరిగిందని వివరించారు. దీనికి అదనంగా, ఎఫ్సీఐఎల్కు చెందిన తాల్చేర్ యూనిట్టును నామినేటెడ్ పీఎస్‌యూల జాయింట్ వెంచర్ కంపెనీగా ‘తాల్చేర్ ఫర్టిలైజర్స్’ (టీఎఫ్ఎల్) రూపంలో పునరుద్ధరించడానికి ఒక ప్రత్యేక విధానాన్ని కూడా ఆమోదించామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కోల్ గ్యాసిఫికేషన్ రూట్లో ప్రతి సంవత్సరం 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉండే ఒక గ్రీన్‌ఫీల్డ్ యూరియా యూనిట్టును ఏర్పాటు చేస్తారని మంత్రి తెలియజేశారు. అస్సాంలోని నామరూప్‌లో గల బ్రహ్మపుత్ర వేలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ (బీబీఎఫ్సీఎల్) ప్రాంగణంలోనే...12.78 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎమ్‌టీ) యూరియా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఒక కొత్త బ్రౌన్‌ఫీల్డ్ అమోనియా-యూరియా కాంప్లెక్సును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ కొత్త బ్రౌన్‌ఫీల్డ్ సంస్థ పేరు అస్సామ్ వేలీ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ (ఏవీఎఫ్సీసీఎల్) అని మంత్రి పేర్కొన్నారు.
దీనికి అదనంగా, 25 గ్యాస్ ఆధారిత యూరియా యూనిట్లను దృష్టిలో పెట్టుకొని కొత్త యూరియా విధానం (ఎన్‌యూపీ)- 2015ని ప్రభుత్వం 2015 మే 25న ప్రకటించింది. ఆర్ఏసీ పరిధికి ఆవల స్వదేశీ యూరియాను సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం. వార్షిక ఉత్పత్తితో పోలిస్తే, 20-25 ఎల్ఎమ్‌టీ యూరియా 2014-15 లో అదనంగా ఉత్పత్తి కావడానికి ఎన్‌యూపీ- 2015 దోహదం చేసింది.
పైన ప్రస్తావించిన చర్యలన్నిటి ఫలితంగా యూరియా ఉత్పత్తి 2014-15లో సాలుసరి 225 ఎల్ఎమ్‌టీ నుంచి వృద్ధి చెంది, 2023-24లో రికార్డు స్థాయిలో 314.07 ఎల్ఎమ్‌టీకి చేరుకుంది. 2024-25లో దేశంలో 306.67 ఎల్ఎమ్‌టీ యూరియాను ఉత్పత్తి చేశారు.
ఫాస్ఫేట్, పొటాషియమ్ (పీ అండ్ కే) ఎరువుల కోసం పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్) పథకాన్ని ప్రభుత్వం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా, పీ అండ్ కే ఎరువులు ఓపెన్ జనరల్ లైసెన్స్ (ఓజీఎల్) పరిధిలోకి చేరుతాయి. కంపెనీలు తమ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఈ ఎరువులను దిగుమతి చేసుకొనేందుకు, లేదా తయారు చేసేందుకు ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు.
దిగుమతి చేసుకున్న ఫాస్ఫేటిక్ ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడానికీ, దేశాన్ని స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడానికీ ఈ కింది చర్యల్ని ప్రభుత్వం తీసుకుంది:
-
ఎమ్ఆర్‌పీ సహేతుకతను నిర్ధారించడానికీ, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికీ ఎరువుల విభాగం 2024 జనవరి 18న మార్గదర్శకాల్ని జారీ చేసింది.
-
అభ్యర్థనల ఆధారంగా, కొత్త తయారీ యూనిట్లు లేదా ఇప్పటికే పనిచేస్తున్న యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి ఎన్‌బీఎస్ పథకంలో భాగంగా గుర్తింపును ఇవ్వడం, రికార్డుల్లో నమోదు చేయడం వంటి చర్యలు చేపట్టారు.
-
ఎన్‌బీఎస్ విధానం పరిధిలోకి వచ్చే ఫాస్ఫేట్, పొటాషియమ్ ఎరువుల సంఖ్య 2021లో 22 గ్రేడ్లుగా ఉండగా, ప్రస్తుతం 28 గ్రేడ్లకు చేరుకుంది.
-
దేశీయంగా తయారుచేసిన ఎరువు ఎస్ఎస్‌పీ విషయంలో సరకు రవాణా సబ్సిడీని 2022 ఖరీఫ్ కాలం నుంచి మంజూరు చేశారు. ఫాస్ఫేటిక్ లేదా ‘పీ’ పోషకాలను అందించడానికి ఎస్ఎస్‌పీని ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు ఈ చర్యను తీసుకున్నారు.
దీనికి తోడు, ముడిపదార్థాల దిగుమతి కోసం సరఫరా పరమైన భద్రతను పటిష్ఠపరచడానికి వనరులు ఉన్న దేశాలతో భారతీయ ఎరువుల కంపెనీలు దీర్ఘకాలిక ఒప్పందాల (ఎల్‌టీఏస్)ను కుదుర్చుకోవడానికీ, అవగాహన ఒప్పందాల (ఎంఓయూస్)ను ముందుకు తీసుకుపోవడానికీ మార్గాన్ని ప్రభుత్వం సుగమం చేసింది. తదనుగుణంగా, 2025-26కు జోర్డాన్, మొరాకో, టోగో, మారిటానియాల నుంచి రాక్ ఫాస్ఫేట్, మొరాకో, ట్యునీషియా, సెనెగల్ నుంచి ఫాస్ఫోరిక్ యాసిడ్, సౌదీ అరేబియా, ఓమాన్, జపాన్, మలేషియాల నుంచి అమోనియా దిగుమతి చేసుకోవడానికి భారతీయ కంపెనీలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.
గత మూడు సంవత్సరాల్లో, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా అమలుచేసిన కార్యక్రమాల్లో భాగంగా యూరియా, డీఏపీ, తదితర ఎరువుల దేశీయ ఉత్పత్తికి సంబంధించిన సంవత్సర వారీ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
|
YEAR-WISE PRODUCTION OF MAJOR FERTILIZERS
|
|
|
Production (Fig. in LMT)
|
|
|
YEAR
|
Urea
|
DAP
|
SSP
|
|
2022-23
|
284.94
|
43.47
|
56.44
|
|
2023-24
|
314.09
|
42.93
|
44.44
|
|
2024-25
|
306.67
|
37.69
|
52.44
|
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో.. అంటే 2022-23, 2023-24 లతో పాటు 2024-25లో, వర్తమాన సంవత్సరం 2025-26లో దేశంలో కూడా యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే ఎరువుల లభ్యత సరిపడినంత స్థాయిలో ఉంది. ఆయా కాలాల్లో ఈ ఎరువుల అవసరం, అందుబాటు, విక్రయాలకు సంబంధించిన వివరాలను అనుబంధ పత్రంలో చూడవచ్చు.
దీనికి అదనంగా, దేశంలో ఎరువులను సకాలంలో, తగినంత స్థాయిలో సరఫరాల్ని నిర్ధారించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రతి ఒక్క పంటకాలంలోనూ ఈ కింది చర్యలను తీసుకుంటున్నారు:
-
ప్రతి పంటకాలం మొదలయ్యే ముందు, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగం (డీఏ అండ్ ఎఫ్డబ్ల్యూ) సంప్రదించి రాష్ట్రం వారీగానూ, నెల వారీగానూ ఎరువుల అవసరాలని అంచనా వేస్తుంది.
-
వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగం రూపొందించే అంచనా ఆధారంగా ఎరువుల విభాగం నెలవారీ సరఫరా ప్రణాళికను జారీ చేసి రాష్ట్రాలకు తగినంత మొత్తంలో ఎరువులను కేటాయిస్తుంది. అంతేకాక, ఎరువుల లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తుంది.
-
సమీకృత ఎరువుల నిర్వహణ వ్యవస్థగా వ్యవహరించే ఆన్-లైన్ వెబ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లో సబ్సిడీపై అందించే ప్రధాన ఎరువుల రాకపోకలను పర్యవేక్షిస్తారు.
-
రాష్ట్రాల వ్యవసాయ అధికారులతో వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగం, ఎరువుల విభాగం కలిసి క్రమం తప్పక వారం వారీ వీడియో కాన్ఫరెన్సును నిర్వహిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా ఎరువులను పంపిణీ చేయడానికి ఏవైనా దిద్దుబాటు చర్యల్ని చేపట్టవలసి వస్తే వాటిని చేపడుతాయి.
-
రాష్ట్రం లోపల ఎరువులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తారు.
రాజ్యసభలో నక్షత్రం గుర్తు లేని ప్రశ్న సంఖ్య 3550కు చెందిన భాగం (సి)కి సంబంధించిన సమాధానంలో ప్రస్తావించిన అనుబంధం ఇది.. (ఈ ప్రశ్నకు 2026 మార్చి నెల 24న సమాధానాన్ని ఇవ్వాల్సి ఉండింది).
|
ALL INDIA
|
|
REQUIREMENT, AVAILABILITY & SALES OF FERTILIZERS DURING 2022-23 to 2025-26 (Till 18.03.26)
|
|
Fig. in LMT
|
|
S.No
|
State
|
UREA
|
DAP
|
MOP
|
NPKS
|
|
Requirement
|
Availability
|
DBT Sales
|
Requirement
|
Availability
|
DBT Sales
|
Requirement
|
Availability
|
DBT Sales
|
Requirement
|
Availability
|
DBT Sales
|
|
1
|
2025-26 (Till 18.03.26)
|
375.18
|
439.87
|
387.51
|
109.39
|
120.41
|
98.57
|
26.07
|
29.70
|
21.81
|
155.54
|
194.92
|
147.15
|
|
2
|
2024-25
|
364.01
|
443.83
|
387.92
|
111.92
|
105.14
|
96.29
|
22.21
|
30.85
|
22.02
|
151.29
|
183.98
|
149.72
|
|
3
|
2023-24
|
356.08
|
437.47
|
357.81
|
110.18
|
127.42
|
109.73
|
27.62
|
22.74
|
16.45
|
126.31
|
156.51
|
116.80
|
|
4
|
2022-23
|
359.19
|
415.82
|
357.26
|
114.20
|
130.93
|
105.31
|
34.17
|
19.55
|
16.32
|
120.69
|
138.15
|
107.31
|
- Indicator of comfortable availability: Availability >Requirement
- Secondary Indicator of comfortable availability: Availability > Sales
***
(రిలీజ్ ఐడి: 2245049)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6