|
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రాచీన రాతప్రతుల డిజిటలీకరణ (జ్ఞాన భారతం కార్యక్రమం)
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 1:12PM by PIB Hyderabad
2025-26 వార్షిక బడ్జెట్లో ప్రకటించిన జ్ఞాన భారతం మిషన్‌ను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (ఎంవోసీ) ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ప్రాచీన రాతప్రతులకు సంబంధించిన సర్వే, రిజిస్ట్రేషన్, విస్తృతమైన సాంకేతిక మౌలిక సదుపాయాల నిర్మాణం, భాగస్వామ్యాల ఏర్పాటు, డాక్యుమెంటేషన్, పరిరక్షణ, డిజిటలైజేషన్, ప్రచురణ, సామర్థ్య పెంపు, పరిశోధన తదితర అంశాలపై ఈ మిషన్ పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా డీవీడీ, హెచ్డీడీ, మైక్రోఫిల్మ్ లాంటి బహుళ రూపాల్లో 8 లక్షలకు పైగా రాతప్రతులు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వీటిని జ్ఞాన భారతం ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్‌వోపీ) ప్రకారం పునర్వ్యవస్థీకరిస్తున్నారు. వీటిలో 1.29 లక్షల రాతప్రతులు నేషనల్ డిజిటల్ రిపోజిటరీ (ఎన్‌డీఆర్) ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
దీనికి అదనంగా 2026 మార్చి 16న జాతీయ రాతప్రతుల సర్వే ప్రారంభమైంది. దీని ద్వారా సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, పండితులు, మఠాలు, దేవాలయాలు, గ్రంథాలయాలు, ఇతర రిపోజిటరీల వద్ద అందుబాటులో ఉన్న పురాతన ప్రతులను గుర్తించి, వాటిని డాక్యుమెంట్ చేసి, సమగ్ర జాతీయ డేటాబేస్‌ను రూపొందిస్తారు. ఇప్పటివరకు 12.97 లక్షలకు పైగా రాతప్రతుల సమాచారాన్ని సేకరించారు. ఆర్థిక సంవత్సరం 2025-26లో 2026 మార్చి 15 నాటికి మొత్తం రూ.13.29 కోట్లు వెచ్చించారు. దేశవ్యాప్తంగా క్లస్టర్ కేంద్రాలు(సీసీలు), స్వతంత్ర కేంద్రాలు (ఐసీలు) వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యతను ఈ మిషన్ చేపట్టింది. ఇప్పటివరకు సీసీ/ఐసీ జాబితాలో చేర్చిన వాటి వివరాలు దిగువన ఉన్నాయి:
|
క్లస్టర్ కేంద్రాలు
|
|
క్రమసంఖ్య
|
రాష్ట్రం
|
సంస్థ పేరు
|
|
1
|
అస్సాం
|
సంస్కృత విభాగం, అస్సాం విశ్వవిద్యాలయం, సిల్చార్
|
|
2
|
బీహార్
|
నవ నలంద మహావిహార్, నలంద
|
|
3
|
ఢిల్లీ
|
జామియా హమ్దార్ద్ విశ్వవిద్యాలయం గ్రంథాలయం
|
|
4
|
కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం
|
|
5
|
గుజరాత్
|
శ్రుత రత్నాకర, అహ్మదాబాద్
|
|
6
|
ఓరియెంటల్ ఇనిస్టిట్యూట్, మహారాజా షాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా, వడోదర
|
|
7
|
హిమాచల్ ప్రదేశ్
|
హిమాచల్ స్టేట్ మ్యూజియం, సిమ్లా
|
|
8
|
జమ్మూ కాశ్మీర్
|
పర్షియన్ విభాగం, కాశ్మీర్ విశ్వవిద్యాలయం, శ్రీనగర్
|
|
9
|
శాశ్వత్ ఆర్ట్ గ్యాలరీ, జమ్ము
|
|
10
|
కర్ణాటక
|
సంస్కృతి ఫౌండేషన్, మైసూరు
|
|
11
|
ఓరియెంటర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, మైసూరు
|
|
12
|
కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం, బెంగళూరు
|
|
13
|
కేరళ
|
ఓరియెంటల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ, కేరళ విశ్వవిద్యాలయం, తిరువనంతపురం
|
|
14
|
లదాఖ్
|
సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్టడీస్, లేహ్
|
|
15
|
మణిపూర్
|
మణిపూర్ స్టేట్ ఆర్కైవ్స్
|
|
16
|
మధ్యప్రదేశ్
|
సంస్కృత విభాగం, డాక్టర్ హరి సిం గౌర్ విశ్వవిద్యాలయం, సాగర్
|
|
17
|
మహారాష్ట్ర
|
కవి కులగురు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం, నాగపూర్
|
|
|
భండార్కర్ ఓరియెంటల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ పుణె
|
|
19
|
ఒడిశా
|
సరస్వతి భద్రక్
|
|
20
|
సంస్కృత విభాగం, ఉత్కల్ విశ్వ విద్యాలయం, భువనేశ్వర్
|
|
21
|
రాజస్థాన్
|
రాజస్థాన్ సంస్కృత అకాడమీ, జైపూర్
|
|
22
|
విశ్వ గురుదీప్ ఆశ్రమ్ శోధ్ సంస్థాన్, జైపూర్
|
|
23
|
సిక్కిం
|
నామ్గ్యేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీ, గాంగ్‌టక్
|
|
24
|
తెలంగాణ
|
తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, హైదరాబాద్
|
|
25
|
ఉత్తరప్రదేశ్
|
వృందావన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, వృందావన్
|
|
26
|
ఉత్తరాఖండ్
|
శ్రీ లక్ష్మీధర్ ఆచార్య చక్రధర జోషి విద్యామందిర్ శోధ్ సంస్థాన్, నక్షత్ర వేదశాల, దేవప్రయాగ
|
|
27
|
పతంజలి విశ్వవిద్యాలయం
|
|
28
|
పశ్చిమ బెంగాల్
|
ది ఏసియాటిక్ సొసైటీ, కోల్‌కతా
|
|
స్వంతంత్ర కేంద్రాలు
|
|
1
|
ఆంధ్ర ప్రదేశ్
|
సనాతన జీవన ట్రస్టు, తిరుపతి
|
|
2
|
బీహార్
|
ఖుదాబక్ష్ ఓరియెంటల్ పబ్లిక్ లైబ్రరీ, పాట్నా
|
|
3
|
బోధ గయ మఠం, గయ
|
|
4
|
గుజరాత్
|
ఆధ్యాత్మ పరివార్ ట్రస్టు, సూరత్
|
|
5
|
హర్యానా
|
కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర
|
|
6
|
కర్ణాటక
|
తారా ప్రకాశం వేదిక్ లైబ్రరీ అండ్ రీసెర్చి సెంటర్ బెంగళూరు
|
|
7
|
కేరళ
|
సేవాధి మ్యూజియం అండ్ ఐడియాలాజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, కొట్టాయం
|
|
8
|
చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఎర్నాకులం
|
|
9
|
మహారాష్ట్ర
|
ఆనందాశ్రమ్ సంస్థాన్, పుణె
|
|
10
|
భారత్ ఇతిహాస్ సంశోధక్ మండల్ సదాశివ పేఠ్, పుణె
|
|
11
|
మధ్యప్రదేశ్
|
అనేకంత్ జ్ఞాన మందిర్, బీనా
|
|
12
|
సింధియా ఓరియెంటల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, ఉజ్జయిని
|
|
13
|
రాజస్థాన్
|
అభయ్ జైన్ గ్రంథాలయ, బికనేర్
|
|
14
|
రాజస్థాన్ ఓరియెంటల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, జోద్‌పూర్
|
|
15
|
పద్మశ్రీ నారాయణ్ దాస్ పాండులిపి శోధ్ సంస్థాన్, జైపూర్
|
|
16
|
ఉత్తరప్రదేశ్
|
నగరి ప్రచారిణి సభ, వారణాసి
|
|
17
|
హిందీ సాహిత్య సమ్మేళన్, ప్రయాగరాజ్
|
|
18
|
పశ్చిమ బెంగాల్
|
కోల్‌కతా విశ్వవిద్యాలయం
|
ఈ సమాచారాన్ని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ రోజు అందించారు.
(రిలీజ్ ఐడి: 2242662)
|