బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్యాప్టివ్, వాణిజ్య, ఇతర గనుల నుంచి రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2026 4:16PM by PIB Hyderabad

భారత బొగ్గు రంగం 2025–26 ఆర్థిక సంవత్సరంలో మార్చి 112026న క్యాప్టివ్, కమర్షియల్, ఇతర గనులు బొగ్గు ఉత్పత్తిలో 200 మిలియన్ టన్నుల మైలురాయిని దాటడం ద్వారా  కీలక విజయం సాధించింది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాముల సమష్టి కృషి, అచంచలమైన నిబద్ధతను ఈ విజయం ప్రతిబింబిస్తుంది. వారి అవిశ్రాంత కృషి, సమర్థత దేశంలో బొగ్గు ఉత్పత్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి.

మొత్తం ఉత్పత్తిలో క్యాప్టివ్, వాణిజ్య బొగ్గు గనులు 194.17 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించగాఇతర గనులు 6.06 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేశాయి. దీంతో మొత్తం ఉత్పత్తి చరిత్రాత్మక 200 మిలియన్ టన్నుల మార్కును దాటింది. ముఖ్యంగా2025–26 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి... 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం ఉత్పత్తి (197.32 మిలియన్ టన్నులు)ని మార్చి 072026నే అధిగమించింది. అంటే గత సంవత్సరం కంటే 24 రోజులు ముందుగానే ఈ మైలురాయిని సాధించింది. ఈ రంగం బలమైన ఊపును ప్రదర్శిస్తూనే ఉంది. అదే సమయంలో 10.56 శాతం వార్షిక వృద్ధినీ నమోదు చేసింది.

బొగ్గు సరఫరా కూడా స్థిరమైన వృద్ధి పథాన్ని కొనసాగిస్తోంది. ఇది 7.71 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తూ... 182.98 మిలియన్ టన్నుల నుంచి 197.09 మిలియన్ టన్నులకి పెరిగింది. ఈ నిరంతర ఉత్పత్తి పెరుగుదల దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి పెరుగుతున్న ఈ రంగం సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. కీలకమైన వినియోగ రంగాలకు నమ్మకమైన బొగ్గు సరఫరాను నిర్ధారిస్తుంది.

భారత ఇంధన రంగానికి కీలక చోదక శక్తిగా క్యాప్టివ్, వాణిజ్య బొగ్గు మైనింగ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే విధానాలుసాంకేతిక ఆవిష్కరణలు, మైనింగ్ సిబ్బంది అంకితభావం ద్వారా ఈ రంగం జాతీయ వృద్ధికి తన వంతు సహకారాన్ని విస్తరిస్తూనే ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారే మార్గంలో భారత్ ముందుకు సాగుతున్నప్పుడు నమ్మకమైన ఇంధన సరఫరాను నిర్ధారించడంలో, పారిశ్రామిక పురోగతికి మద్దతునివ్వడంలో, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను బలోపేతం చేయడంలో బొగ్గు కీలక పాత్రను ఈ విజయాలు పునరుద్ఘాటిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2240046) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी