ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐఐటీ హైదరాబాద్‌లో రెండు రోజుల ఎన్‌హెచ్‌సీఎక్స్ ఇన్నోవేషన్ మీట్‌‌కు ముగింపు పలికిన ఎన్‌హెచ్ఏ: తాము రూపొందించిన పరిష్కారాలను ప్రదర్శించిన ఎన్‌హెచ్‌సీఎక్స్ హ్యాకథాన్ ఫైనలిస్టులు

నాడు పోస్టు చేయడమైనది: 07 MAR 2026 3:54PM by PIB Hyderabad

ఐఐటీ హైదరాబాద్‌లో నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ఏనిర్వహిస్తున్నఎన్‌హెచ్‌సీఎక్స్ ఇన్నోవేషన్ మీట్‌ ముగిసిందిఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎంపరిధిలో పరస్పరం ఆధారపడి పనిచేసేనియంత్రణలకు అనుగుణంగా ఆరోగ్య పరిష్కారాల స్వీకరణను ముందుకు తీసుకెళ్లేలా నియంత్రణ సంస్థలురాష్ట్ర ప్రభుత్వాలుపారిశ్రామిక దిగ్గజాలుసాంకేతిక ఆవిష్కర్తలువిద్యాసంస్థలను ఈ కార్యక్రమం ఒక్కచోట చేర్చింది.

2026 మార్చి 6, 7 తేదీల్లో ఈ కార్యక్రమం జరిగింది. 2026 ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించిన ఎన్‌హెచ్‌సీఎక్స్ హ్యాకథాన్ పోటీల గ్రాండ్ ఫినాలే‌ను కూడా ఈ రెండు రోజుల కార్యక్రమం సూచిస్తుందిఇక్కడ విజేతలుగా నిలిచిన బృందాలు తమ పరిష్కారాలను విశిష్ట అతిథుల ముందు ప్రదర్శించారు.

ఏబీడీఎం పరిధిలో పని చేేసే మూడు సంస్థల్లో నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌హెచ్‌సీఎక్స్ఒకటిదేశ వ్యాప్తంగా ఆరోగ్య బీమా క్లెయిముల ప్రక్రియను సులభతరం చేయడానికిప్రామాణికీకరణ కోసం ఇది ఏర్పాటైందిఆసుపత్రులుబీమా సంస్థలురోగుల మధ్య క్లెయిముల డేటాను సులభంగా మార్చుకోవడానికి వీలుగా ఏకీకృత డిజిటల్ మౌలిక వసతులను ఈ సంస్థ అందిస్తుందిఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ), జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (జీఐసీ), నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ ఈహెచ్ఆర్ స్టాండర్డ్స్ (ఎన్ఆర్‌సీఈఎస్), ఇన్స్యూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ), నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్), ఐఐటీ హైదరాబాద్గూగుల్ఇండియా ఇన్సూర్‌టెక్ అసోసియేషన్ (ఐఐఏ), ఎన్ఏటీహెల్త్ సంయుక్తంగా ఈ హ్యాకథాన్‌ నిర్వహించాయిక్లెయిముల ప్రక్రియను సులభతరం చేసే దిశగా సహకారాత్మక విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

(ఎడమ నుంచి కుడికిఐఐటీ హైదరాబాద్ డీన్ ప్రొఫెసర్ జీ నరహరి శాస్త్రిఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవైద్యకుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (ఏహెచ్‌పీఐడైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జ్ఞానిఏబీడీఎం జేఎస్ఎండీ శ్రీ కిరణ్ గోపాల్ వస్కా

 

ఎన్‌హెచ్‌సీఎక్స్ ఇన్నోవేషన్ మీట్ రెండో రోజు ప్రారంభ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యంవైద్యంకుటుంబ సంక్షేమ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (ఏహెచ్‌పీఐడైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జ్ఞానిఐఐటీ హైదరాబాద్ డీన్ ప్రొఫెసర్ జీ నరహరి శాస్త్రిఇతర విశిష్ట అతిథులుపారిశ్రామికవిద్యా ప్రతినిధులు పాల్గొన్నారు.

భారత ఇన్స్యూరెన్స్ రంగంలో ఆరోగ్య క్లెమయిలు సంక్లిష్టత అనేది అత్యంత దీర్ఘకాలంగా ఎదురవుతున్న సమస్య అని డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్ తన ప్రసంగంలో వివరించారుఅలాగే మిలియన్ల మంది పౌరులను ప్రభావితం చేసే ప్రక్రియకు ప్రామాణీకరణపరస్పరం ఆధారపడే విధానాన్ని తీసుకురావడంలో ఎన్‌హెచ్‌సీఎక్స్ పాత్రను వివరించారు.

‘‘ఆసుపత్రులుబీమా సంస్థలకు మాత్రమే నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్‌ఛేంజ్ పరిమితం కాలేదుఇది రోగులుఆరోగ్యసేవలు అందించేవారుబీమా సంస్థలుసాంకేతిక ఆవిష్కర్తలతో సహా మొత్తం వ్యవస్థకు సేవలు అందించేందుకు రూపొందించిన వ్యవస్థయూపీఐ లాంటి డిజిటల్ మౌలిక వసతుల మాదిరిగానే ఎన్‌హెచ్‌సీఎక్స్‌కు దీర్ఘకాలిక లక్ష్యం కూడా ఉందివ్యవస్థను ఏ సంస్థ నిర్వహిస్తుందో తెలియనప్పటికీ అది సజావుగానమ్మకమైన సేవలు అందిస్తే ప్రజలు ఆ వేదికను విశ్వసిస్తారు.’’

డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్సీఈవోనేషనల్ హెల్త్ అథారిటీ

 

విస్తృత స్థాయిలో అందించే నాణ్యమైన సేవలను మెరుగుపరిచేందుకు డిజిటల్ సాంకేతికతకృత్రిమ మేధడేటా ఆధారిత వ్యవస్థలే కేంద్రంగా ఉన్నాయనే ఏకాభిప్రాయం విశిష్ట అతిథుల ప్రారంభోపన్యాసాల్లో వ్యక్తమయింది.

 

‘‘డిజిటల్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాథమిక బ్లాకులను నిర్మించే శక్తిని ఆంధ్రప్రదేశ్‌లో మేం బలంగా విశ్విస్తున్నాంరాష్ట్రంలో జనాభా అంతటికీ ఏబీహెచ్ఏ సంఖ్యలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందిఅలాగే దీనికి అత్యంత ప్రాధాన్యమిస్తోందిఇది డిజిటల్ ప్రజా మౌలిక వసతులను బలోపేతం చేయడంలోనూడిజిటల్ ఆరోగ్య రంగంలో ప్రతి పౌరుడికీ భాగస్వామ్యం అందించడంలోనూ మా అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది.’’

శ్రీ సౌరభ్ గౌర్ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యంవైద్యంకుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి

 

 

పోటీలకు సమర్పించిన 110 పరిష్కారాలను ఐఐటీ హైదరాబాద్ఎన్ఆర్‌సీఈఎస్జీఐసీగూగుల్ఐఐఏఎన్ఏటీహెల్త్ఎన్‌హెచ్ఏ ప్రతినిధులతో కూడిన స్వతంత్ర నిపుణుల జ్యూరీ మూల్యాంకనం చేసిందిఆరోగ్య బీమా క్లెయిములకు సంబంధించిన కీలకమైన సమస్యలను పరిష్కరించే వినూత్న ఆవిష్కరణలను గుర్తిస్తూ హ్యాకథాన్ విజేతలను సత్కరించారు.

దేశవ్యాప్తంగా ఏబీడీఎంను స్వీకరించేందుకు సహకారాన్ని బలోపేతం చేయడంభాగస్వాములు చేసిన కృషిని గుర్తించడమే లక్ష్యంగా మూడు భాగస్వామ్యాలను ఎన్‌హెచ్ఏ ఈ సందర్భంగా ప్రారంభించిందిచెల్లింపులుసేవల వ్యవస్థ అంతంటా ఎన్‌హెచ్‌సీఎక్స్‌ను అమలు చేయడంలోనూవిస్తరించడంలోనూ తమ వంతు పాత్రను అంకితభావంతో పోషించిన సంస్థలను ఎన్‌హెచ్‌సీఎక్స్ ఛాంపియన్స్ గుర్తిస్తుంది. ప్రభుత్వ మార్గాల ద్వారా మాత్రమే కాకుండాతమ పరిధిలో ఏబీడీఎంపై అవగాహన పెంచిన సంస్థలునైపుణ్య విభాగాలను ఏబీడీఎం అంబాసిడర్స్ గుర్తిస్తుందిఎన్‌హెచ్‌సీఎక్స్ ద్వారా సమర్పించిన పీఎం-జేఏవై క్లెయిములను అందించేందుకు విజయవంతమైన మాడ్యూళ్లను తయారు చేసిన సంస్థలను ఎన్‌హెచ్‌సీఎక్స్-పీఎంజేఏవై ఎర్లీ ఇంటిగ్రేటర్స్ సత్కరిస్తుందితద్వారా ప్రామాణికమైనపరస్పర ఆధారిత క్లెయిమ్స్ ఎక్స్‌ఛేంజ్ పరిధిలోకి ప్రభుత్వం నిధులు అందిస్తున్నప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య భరోసా పథకాన్ని తీసుకువస్తుందిఈ మూడు కార్యక్రమాల పరిధిలో మొదటి విడత పురస్కార గ్రహీతలను ఇన్నోవేషన్‌ మీట్‌లో ప్రకటించారు.

ప్రభుత్వంనియంత్రణపారిశ్రామికసాంకేతిక రంగాలకు చెందిన వారిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్యానెల్ చర్చలు ఇన్నోవేషన్ మీట్‌లో జరిగాయిక్లెయిముల సవాళ్లకు సంబంధించి సాంకేతికకార్యాచరణ కోణాలపై మొదటి రోజు చర్చలు జరిగాయిక్లెయిము సెటిల్మెంట్లకు ప్రామాణీకరణఏఐసాంకేతికత ద్వారా ఆరోగ్య బీమా వ్యవస్థ రూపాంతరం లాంటి అంశాలపై చర్చించారురెండో రోజు విస్తరణస్వీకరణపై రెండో రోజు దృష్టి సారించారుఅలాగే క్లెయిముల ప్రక్రియ భవిష్యత్తుఎన్‌హెచ్‌సీఎక్స్‌ను ఆసుపత్రులు స్వీకరించడంలో ఎదురయ్యే నిర్దిష్ట అడ్డంకులుప్రోత్సహకాలను పరిశీలించారు.

రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎన్‌హెచ్ఏ జాయింట్ సెక్రటరీమిషన్ డైరెక్టర్(ఏబీడీఎంశ్రీ కిరణ్ గోపాల్ వస్కా ముగించారుఈ రెండు రోజుల్లో నిర్వహించిన చర్చల సారాంశాన్ని ఆయన సమర్పించారుఅనంతరం ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ శ్రీ అజయ్ సేథ్ ముగింపు ఉపన్యాసం చేశారుఆరోగ్య వ్యవస్థ ఆధారిత ఆవిష్కరణలుఅత్యున్నత స్థాయి విధాన చర్చలుక్షేత్రస్థాయిలో ఎన్‌హెచ్‌సీఎక్స్ స్వీకరణను ప్రోత్సహించే సంస్థలకు గుర్తింపు మేలు కలయికతో ఇన్నోవేషన్ మీట్ జరిగిందిఇది భారత్‌లో డిజిటల్ ప్రాధాన్యమైనపరస్పర ఆధారిత ఆరోగ్య క్లెయిముల వ్యవస్థకు గణనీయమైన వేగాన్ని అందిస్తుందని అంచనా వేస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2236420) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English