రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భువనేశ్వర్ రాజధాని ప్రాంత రింగు రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును ఖరారు చేసిన ఎన్ హెచ్ఏఐ

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 5:40PM by PIB Hyderabad

ఒడిశాలో ఆరు లైన్ల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ రాజధాని ప్రాంత రింగు రోడ్డు (భువనేశ్వర్ బైపాస్) ప్రాజెక్టు నిర్మాణానికి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ఏఐ) లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్ఓఏ) జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రమేశ్వర్ నుంచి టాంగి వరకు 111 కిలోమీటర్ల పొడవైన రింగు రోడ్డును హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) కింద మూడు ప్యాకేజీలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులు ప్రారంభమైన తేదీ నుంచి సుమారు 30 నెలల్లో పూర్తి అయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రాజెక్టులోని మొదటి ప్యాకేజీని మెసర్స్ పటేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు కేటాయించారు. రమేశ్వర్ నుంచి బిలిపాడ వరకు 40 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో ఇరువైపులా 12.4 కిలోమీటర్ల పొడవైన సర్వీసు రోడ్ల నిర్మాణంరెండు ఇంటర్‌చేంజ్‌లుఒక రైల్వే ఓవర్ బ్రిడ్జి, 10 చిన్న వంతెనలు, 142 కల్వర్టులు. ఒక వేసైడ్ ఎమినిటీ (ప్రయాణికుల సౌకర్య కేంద్రం)ఏడు ఎలివేటెడ్ అండర్‌పాస్‌లుఎనిమిది వీయూపీ,ఎల్ వీయూపీఎస్ వీయూపీల అభివృద్ధి కూడా ఉన్నాయి.

ఈ ప్రాజెక్టులోని రెండో ప్యాకేజీని మెసర్స్ వీఆర్ సీ కన్స్ట్రక్షన్స్ (ఇండియా) సంస్థకు అప్పగించారు. ఒడిశాలోని బిలిపాడ నుంచి గోబింద్‌పూర్ వరకు 30 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల రహదారి నిర్మించనున్నారు. వీటిలో ఇరువైపులా 7.2 కిలోమీటర్ల పొడవైన సర్వీస్సురోడ్ల నిర్మాణంమూడు ఇంటర్‌చేంజ్‌లు, 11 చిన్న వంతెనలు, 90 కల్వర్టులుఒక మార్గమధ్య సౌకర్య కేంద్రంమూడు ఎలివేటెడ్ అండర్‌పాస్‌లు. 3 వాహన అండర్‌పాస్‌లు, 6 లైట్ వాహనాల అండర్‌పాస్‌లు,  3 చిన్న వాహనాల వెహికల్ అండర్‌పాస్‌లు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టులోని మూడవ ప్యాకేజీని మెసర్స్ హెచ్ జీ  ఇన్‌ఫ్రా   ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు కేటాయించారు. ఇది గోబింద్‌పూర్ నుంచి బందోలా టోల్ ప్లాజా సమీపంలోని టాంగి వరకు 40 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల రహదారి. ఇరువైపులా 10 కిలోమీటర్ల పొడవైన సర్వీస్ లేదా స్లిప్ రోడ్లు నిర్మించనున్నారు. ఇందులో ఒక ఇంటర్‌చేంజ్, 23 చిన్న వంతెనలు, 69 కల్వర్టులుఒక మార్గమధ్య సౌకర్య కేంద్రంరెండు ఎలివేటెడ్ అండర్‌పాస్‌లుఅండర్‌పాస్‌లు, 6 వీయూపీ, 16 ఎల్ వీయూపీ, 3 ఎస్ వీయూపీలను నిర్మించనున్నారు.

గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ రాజధాని ప్రాంత రింగు రోడ్డు (భువనేశ్వర్ బైపాస్).. భువనేశ్వర్కటక్ఖోర్ధా పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ద్వారా ప్రాంతీయ అనుసంధానతనురవాణా సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్ ద్వారా ప్రాంతీయ అనుసంధానం పెరుగుతుంది. సరుకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. స్థానికంగా సురక్షితమైనవేగవంతమైన స్థిరమైన ప్రయాణ సౌకర్యాలను ఇది ప్రోత్సహిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2235303) సందర్శకుల సూచీ సంఖ్య : : 52
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी