నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవుల అభివృద్ధి

నాడు పోస్టు చేయడమైనది: 13 FEB 2026 5:55PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ పరిపాలన నియంత్రణలో ఉన్న దేశంలోని 12 క్రియాశీల ప్రధాన ఓడరేవుల జాబితా అనుబంధం-1లో ఉంది. వీటికి తోడు మహారాష్ట్రలోని వధావన్ ఓడరేవు, అండమాన్ నికోబార్ దీవులలోని గలతీ బే ఓడరేవులను కొత్తగా ప్రధాన ఓడరేవులుగా ప్రకటించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా నియంత్రణలో ఉన్న ఇతర 68 క్రియాశీల ఓడరేవుల (ఓటీఎంపీ) జాబితా అనుబంధం - 2లో అందుబాటులో ఉంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, ఆ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓడరేవుల వివరాలు: 

i.శ్రీకాకుళం జిల్లాలో మూలపేట ఓడరేవు (గతంలో భావనపాడు ఓడరేవు) 

ii. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఓడరేవు 

iii. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవు

iv. కాకినాడ జిల్లా కాకినాడ సెజ్ (కే సెజ్) ఓడరేవు 

ఓడరేవుల ఆధునికీకరణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది, ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బెర్తులు,  టెర్మినల్స్‌ను యంత్రీకరించడం, డిజిటలైజేషన్,  రవాణా అనుసంధానం, కొత్త బెర్తులు,  టెర్మినల్స్ నిర్మాణం, పెద్ద ఓడల రాకపోకలకు వీలుగా సముద్రపు లోతును పెంచడానికి క్యాపిటల్ డ్రెడ్జింగ్ చేపట్టడం, అలాగే రోడ్డు, రైలు,  జలమార్గాల అనుసంధానాన్ని అభివృద్ధి చేయడం వంటి పనులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, నౌకల రాకపోకల సమయాన్ని తగ్గించడానికి,  పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. వీటిలో డాక్యుమెంట్ల అవసరం లేకుండా చేయడం, ఓడరేవుల వద్దకు నేరుగా సరుకు చేరవేసే,  ప్రవేశించే సౌకర్యం కల్పించడం, కంటైనర్ స్కానర్లను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఆర్డర్లు, ఇన్వాయిస్‌లు,  చెల్లింపుల కోసం ఇ-డెలివరీ విధానం, ఆర్ఎఫ్ఐడి ఆధారిత గేట్ ఆటోమేషన్ వ్యవస్థ,  సముద్ర రవాణాకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందించే 'సాగర్ సేతు 2.0' (మారిటైమ్ సింగిల్విండో) వంటి సాంకేతిక మార్పులను అమలు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఓడరేవుల అభివృద్ధి, విస్తరణ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం అనేక పథకాలు, మిషన్లు,  కార్యక్రమాలను ప్రారంభించింది. సాగరమాల పథకం కింద ఐదు ప్రధానాంశాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అవి: ఓడరేవుల ఆధునీకీకరణ, ఓడరేవుల అనుసంధానం, ఓడరేవుల ద్వారా పారిశ్రామికీకరణ, తీరప్రాంత సమాజ అభివృద్ధి, తీరప్రాంత రవాణా,  అంతర్గత జల రవాణా. రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, ప్రధాన ఓడరేవులు, ఇతర సంస్థల వంటి అమలు చేసే ఏజెన్సీలకు ఈ సహాయం అందుతుంది. ప్రధాన ఓడరేవులలో పర్యావరణహితమైన వ్యవస్థను ప్రోత్సహించడానికి 'హరిత సాగర్' గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలను ప్రారంభించారు. సంప్రదాయ ఇంధన ఆధారిత హార్బర్ టగ్గుల స్థానంలో పర్యావరణహితమైన, సుస్థిరమైన ప్రత్యామ్నాయాలను ప్రవేశపెట్టేందుకు గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ (జీటీటీపీ) ను చేపట్టారు. దీనికి అదనంగా, క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం క్రూయిజ్ భారత్ మిషన్ ను కూడా ప్రారంభించింది.

సాగరమాల పథకంలోని ఓడరేవుల ఆధునికీకరణ   కింద ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా ఓడరేవుల అభివృద్ధి ఆధునికీకరణ కోసం కేటాయించిన, మంజూరు చేసిన,  విడుదల చేసిన నిధుల పూర్తి వివరాలు అనుబంధం – 3లో అందుబాటులో ఉన్నాయి.

                                                                                                     అనుబంధం - 1

12 ప్రధాన రేవుల జాబితా 

వరస నెం. 

ప్రధాన రేవు

రాష్ట్రం 

1

శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టు అథారిటీ 

పశ్చిమ బెంగాల్

2

పరదిప్ పోర్టు అథారిటీ 

ఒడిశా

3

విశాఖపట్నం పోర్టు అథారిటీ 

ఆంధ్ర ప్రదేశ్ 

4

చెన్నై పోర్టు అథారిటీ 

తమిళనాడు 

5

కామరాజర్ పోర్టు లిమిటెడ్

6

వీఓ చిదంబరనార్ పోర్టు అథారిటీ 

7

కొచ్చిన్ పోర్టు అథారిటీ 

కేరళ

8

న్యూ మంగళూరు పోర్టు అథారిటీ 

కర్ణాటక

9

మార్ముగోవా పోర్టు అథారిటీ 

గోవా

10

ముంబై పోర్టు అథారిటీ 

మహారాష్ట్ర

11

జవహర్లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ 

12

దీన దయాళ్ పోర్టు అథారిటీ 

గుజరాత్

                                                                                                      అనుబంధం- 2

ప్రధాన రేవులు కాకుండా నిర్వహణలో ఉన్న ఇతర రేవులు

 

వరస నెం. 

రాష్ట్రం/ రేవు

వరస నెం.

రాష్ట్రం / రేవు

 

గుజరాత్ 

 

గోవా

1

అలాంగ్

1

పనాజీ 

2

బేడీ 

 

కర్ణాటక

3

భావనగర్ 

1

కార్వర్ 

4

దహేజ్ 

2

ఓల్డ్ మంగళూర్

5

జఫరాబాద్ 

 

అండమాన్ నికోబార్

6

జఖా 

1

కెంపబల్ బే 

7

మగ్దల్లా 

2

దిగ్లిపుర్ (పోర్ట్ కార్న్వాలీస్)

8

మగ్డల్లా హజీరా పోర్టు (ఏహెచ్పీపీఎల్)

3

స్వరాజ్ద్వీప్(హావ్లాక్)

9

మగ్ధల్లా అదానీ  హాజీరా పోర్టు 

4

  హట్ బే 

10

నవ్లఖి 

5

కచల్ ( ఈస్ట్ బే) 

11

ఓఖా 

6

మలక్కా ( కార్ నికోబార్ (ఈస్ట్) 

12

పిపావావ్ ( జీపీపీఎల్)

7

మయాబందర్

13

పోర్ బందర్ 

8

నాన్ కౌరీ హార్బర్ (కమొత్ర) 

14

సిక్కా

9

షహీద్ ద్వీప్ 

15

మాండవి ముంద్రా

10

పోర్టు బ్లెయిర్

16

మాండవి ముంద్రా

పోర్ట్ , సెజ్ 

11

రంగట్  ( ఎలిఫిన్స్తన్ హార్బర్) 

17

వెరవల్ 

 

తమిళనాడు

18

సలయ 

1

కడలూర్ 

 

మహారాష్ట్ర

2

ఎన్నోర్ మైనర్ పోర్ట్ 

1

బంకొట్ 

3

కట్టుపల్లి 

2

భివాండి 

4

కూడంకులం 

 

 

 

***


(రిలీజ్ ఐడి: 2228203) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी