|
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
జ్ఞాన భారతం మిషన్
నాడు పోస్టు చేయడమైనది:
02 FEB 2026 3:30PM by PIB Hyderabad
‘జ్ఞాన భారతం’ 2025-26 కేంద్ర బడ్జెటులో ప్రకటించిన, కేంద్ర సాంస్కృతిక శాఖకు చెందిన ఒక ప్రధాన కార్యక్రమం. మన దేశంలో ప్రాచీన పుస్తకాల విస్తృత వారసత్వ సంపదను ఉద్ధరించడం, భావితరాల వారికి అందించడం ఈ కార్యక్రమ లక్ష్యాలు. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలన్న జాతీయ దృష్టికోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది. మానవ వనరులను తీర్చిదిద్దడంతో పాటే దేశ సంస్కృతిని కూడా సంరక్షించుకోవడం, ప్రాచీనకాలం నుంచీ భారత్‌లో పోగుపడిన జ్ఞానాన్ని ముందు తరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలబెట్టడం కూడా ఈ కార్యక్రమం ధ్యేయాలే. ఈ కార్యక్రమానికి అండదండలను అందించడానికి, స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్‌సీ) 2025-2031 మధ్య కాలానికి రూ. 491.66 కోట్లు మంజూరు చేసింది. ఈ కార్యక్రమం అయిదు విభాగాలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది.
ఆ విభాగాలు :
1. సర్వే, జాబితాను రూపొందించడం (క్యాటలాగింగ్),
2. సంరక్షణ, సామర్థ్యాల పెంపుదల,
3. సాంకేతికత, డిజిటలీకరణ,
4. భాషా విజ్ఞానం, అనువాదం,
5. పరిశోధన, ప్రచురణ, ప్రజాబాహుళ్యంలోకి తీసుకుపోవడం.
‘జ్ఞాన భారతం’లో భాగంగా క్లస్టర్ సెంటర్ (సీసీ)లతో పాటు ఇండిపెండెంట్ సెంటర్ (ఐసీ)లతో దేశవ్యాప్త అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ఏర్పాటు చేసిన సీసీలూ, ఐసీల జాబితాను అనుబంధ పత్రంలో చూడవచ్చు.
‘జ్ఞానభారతం’లో భాగంగా 7.5 లక్షలకు పైగా చేతి రాత పుస్తకాలను డిజిటల్ రూపంలోకి మార్చారు. వీటిలో 1.29 లక్షల చేతి రాత పుస్తకాలను జ్ఞానభారతం పోర్టల్ అయిన https://gyanbharatam.com లో అందుబాటులోకి తీసుకువచ్చారు.
చేతిరాత పుస్తకాల డిజిటలీకరణకీ, జాబితాను రూపొందించడానికీ (క్యాటలాగింగ్) కీలకమైన సాంకేతిక ప్రమాణాలూ, నాణ్యత పరమైన ప్రమాణాలూ, మెటాడేటా ప్రోటోకాల్స్ ఈ కింది పేర్కొన్న విధంగా ఉన్నాయి:
1. భద్రత, ఉన్నత నాణ్యత కలిగిన డిజిటల్ అవుట్‌పుట్లని అందించడానికి ఖచ్చితమైన ఇమేజింగ్ ప్రమాణాల్ని నిర్దేశించడం.
2. చల్లని కాంతిని ప్రసరించే హానికరం కాని, ఫేస్-అప్ ఓవర్‌హెడ్ స్కానర్లను ఉపయోగిస్తూ కనీసం 400 డీపీఐ, 24-బిట్ కలర్ స్కానింగును (అవసరమైన చోట్ల 600 డీపీఐ సాంకేతికతతో) చేపట్టడం.
3. వర్ణ ప్రకాశాన్ని కాపాడుతూ 100 శాతం మాన్యువల్ నాణ్యతా ధ్రువీకరణ, డీస్క్యూయింగ్, క్రాపింగ్, కీటకాల గుర్తులు గానీ లేదా మరకల వంటి డిజిటల్ ‘‘శబ్దాల’’ను తొలగించడం వంటివి.. అనివార్య ఇమేజ్ పోస్ట్-ప్రాసెసింగ్ ప్రక్రియలో భాగంగా ఉంటాయి.
4. మాస్టర్ ఫైళ్లు టీఐఎఫ్ఎఫ్ వి. 6.0 (ఎల్‌జడ్‌డబ్ల్యూ కంప్రెస్డ్) పద్ధతిలోనూ, ప్రతులను జేపెగ్ ఫార్మేట్‌లోనూ అందుబాటులో ఉంచడం; వెతకదగిన ప్రతులను చెరిపివేయడం కుదరని వాటర్‌మార్క్‌లను కలిగి ఉండే పీడీఎఫ్/ఏ మాధ్యమంలో ఉంచడం.
5. ఎల్‌టీఓ-9 టేపుల పద్ధతిలో దీర్ఘకాలిక నిల్వ సౌలభ్యం.. క్లౌడ్ ఆధారిత బ్యాకప్‌తో పాటు ఏదైనా వైపరీత్యం సంభవిస్తే పునఃప్రాప్తి సదుపాయం.
6. పూర్తి స్థాయిలో పనిచేయగలిగిన, కృత్రిమ మేథను జతచేసిన డిజిటల్ వేదికనీ, మొబైల్ అప్లికేషన్‌నీ నిర్మించడం.
7. మెటాడేటా సంగ్రహణ స్థాయులు: వర్ణనాత్మక మెటాడేటా (కంటెంటు), నిర్మాణాత్మక మేటాడేటా (మార్గనిర్దేశం), సాంకేతిక మెటాడేటా, పరిపాలన సంబంధిత మేటాడేటా.. దీన్లో చేతిరాత పుస్తకాల్లోని సారాంశం వివరాలు, మూలాధారం తాలూకు వివరాలు, సంస్థాగత వివరాలు, స్థానికత, భాష, లిపి, సంరక్షణ స్థితి, ఏ తేదీన తీర్చిదిద్దిందీ, డిజిటల్ ఆబ్జెక్టు వెర్షను, ఏ ఫార్మేట్ ఫైలును ఉపయోగించిందీ, ఏ రకమైన కంప్రెషన్ సాంకేతికతను ఉపయోగించిందీ, ఆబ్జెక్టు సంబంధం తదితర అంశాలు ఉంటాయి.
8. డిజిటలీకరించిన ప్రతి ఒక్క బ్యాచుతో పాటు మెటాడేటాను సీఎస్వీ, ఎక్స్ఎమ్ఎల్ ఫార్మేట్లలో అందజేస్తారు.
ఈ విషయాల్లో కింద వివరించిన చర్యలను చేపట్టారు:
(i) జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా పైన పేర్కొన్న అయిదు విభాగాల్లోనూ కార్యకలాపాల నిర్వహణకు ఇప్పటి వరకూ 45 కేంద్రాలను అనుసంధానం చేశారు.
(ii) జ్ఞాన భారతం అమలు కోసం సంబంధిత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో నోడల్ సమన్వయ ప్రాధికార సంస్థ లాగా పనిచేయడానికి ఇప్పటి వరకూ 20 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా చేర్చుకున్నారు.
(iii) సంరక్షణ, సంవర్ధనకు సంబంధించిన అంశాలపై సమగ్ర నియమావళిని కూడా రూపొందించారు. ఈ నియమావళిని సంరక్షణ నిపుణుల స్పందనను తెలుసుకోవడం కోసం వారికి అందించారు.
(iv) ఒక సర్వే యాప్‌ను రూపొందించారు. దీనిని ఆసక్తి ఉన్న వర్గాల స్పందనను తెలుసుకోవడం కోసం ఆయా వర్గాలకు అందించారు.
(v) ఈ కింది పనుల కోసం సాంకేతిక భాగస్వాములను కలుపుకొన్నారు:
మౌలిక స్థాయి మెటాడేటా రూపకల్పనతోపాటు దానిని జాతీయ డిజిటల్ రిపాజిటరీ (ఎన్‌డీఆర్)కు సమన్వయపరచడంతో పాటు ఎన్‌డీఆర్ మాధ్యమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచడం కోసం చేతిరాత ప్రతుల, వాటికి సంబంధించిన మెటాడేటా ఏకీకరణను సులభతరం చేయడం.
చేతిరాత పుస్తకాల డిజిటలీకరణ కోసం ఎంపిక చేసిన కేంద్రాలన్నింటిలో స్కానర్లు, తదితర ఉపకరణాలను సమకూర్చడం.
పూర్తి స్థాయిలో పనిచేయగలిగే, కృత్రిమ మేధతో ఏకీకరించిన డిజిటల్ వేదికనీ, మొబైల్ అప్లికేషన్‌నీ సిద్ధం చేయడం.
నిరంతర ప్రాతిపదికన హాట్, కోల్డ్, క్లౌడ్-ఆధారిత స్టోరేజ్ హోస్టింగ్, బ్యాకప్‌తో పాటు భద్రత సేవలను అందించడం.
చాలా కాలం కిందటి పత్రాలతో పాటు, వైపరీత్యాల బారిన పడిన పత్రాల పున:ప్రాప్తి సంబంధిత నిర్వహణ కోసం ఎల్‌టీఓ-9 టేపును ఉపయోగిస్తూ సమాచారాన్ని నిల్వ చేయడం.
28 క్లస్టర్ సెంటర్లలో.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్, అలాగే 17 ఇండిపెండెంట్ సెంటర్లలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలోని సనాతన్ జీవన్ ట్రస్టు ఉన్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
అనుబంధ పత్రం
|
Cluster Centres (28)
|
|
S. No
|
State
|
Organization Name
|
|
1
|
Assam
|
Dept. of Sanskrit, Assam University, Silchar
|
|
2
|
Bihar
|
Nava Nalanda Mahavihar, Nalanda
|
|
3
|
Patna Musuem, Patna
|
|
4
|
Delhi
|
University Library Jamia Hamdard
|
|
5
|
Central Sanskrit University
|
|
6
|
Gujarat
|
Shruta Ratnakara, Ahmedabad
|
|
7
|
Oriental Institute, The Maharaja Sayajirao University of Baroda, Vadodara
|
|
8
|
Himachal Pradesh
|
Himachal State Museum, Shimla
|
|
9
|
J & K
|
Dept. of Persian, University of Kashmir, Srinagar
|
|
10
|
Shasvat Art Gallery Jammu
|
|
11
|
Karnataka
|
Samskriti Foundation, Mysuru
|
|
12
|
Oriental Research Institute, Mysuru
|
|
13
|
Kerala
|
Oriental Research Institute & Manuscript Library, University of Kerala, Thiruvananthapuram
|
|
14
|
Ladakh
|
Central Institute of Buddhist Studies, Leh
|
|
15
|
Manipur
|
Manipur State Archives
|
|
16
|
Madhya Pradesh
|
Department of Sanskrit, Dr. Hari Singh Gour University, Sagar
|
|
17
|
Maharashtra
|
Kavi Kulaguru Kalidas Sanskrit University, Nagpur
|
|
18
|
Bhandarkar Oriental Research Institute, Pune
|
|
19
|
Odisha
|
SARASVATI Bhadrak
|
|
20
|
Department of Sanskrit, Utkal University, Bhubaneswar
|
|
21
|
Rajasthan
|
Rajasthan Sanskrit Academy, Jaipur
|
|
22
|
Vishwa Gurudeep Ashram Shodha Sansthan, Jaipur
|
|
23
|
Sikkim
|
Namgyal Institute of Tibetology, Gangtok
|
|
24
|
Telangana
|
Telangana State Archives & Research Institute, Hyderabad
|
|
25
|
Uttar Pradesh
|
Vrindavan Research Institute, Vrindavan
|
|
26
|
Uttarakhand
|
Shri Laxmidhar Acharya Chakradhar Joshi Vidyamandir Shodh Sansthan (SLACJVMSS), Nakshatra Vedhshala, Devprayag
|
|
27
|
University of Patanjali
|
|
28
|
West Bengal
|
The Asiatic Society, Kolkata
|
|
Independent Centres (17)
|
|
1
|
Andhra Pradesh
|
Sanatan Jeevan Trust, Tirupati
|
|
2
|
Bihar
|
Khuda Baksh Oriental Public Library, Patna
|
|
3
|
Bodh Gaya Math, Gaya
|
|
4
|
Gujarat
|
Adhyatma Parivar Trust, Surat
|
|
5
|
Haryana
|
Kurukshetra University, Kurukshetra
|
|
6
|
Karnataka
|
Tara Prakashan Vedic Library & Research Centre, Bangaluru
|
|
7
|
Kerala
|
Sevadhi Museum & Ideological Research Institute, Kottayam
|
|
8
|
Chinmaya International Foundation, Ernakulam
|
|
9
|
Maharashtra
|
Anandashram Samsthan, Pune
|
|
10
|
Bharat Itihas Sanshodhak Mandal Sadashiv Peth, Pune
|
|
11
|
Madhya Pradesh
|
Anekant Gyan Mandir Bina
|
|
12
|
Scindia Oriental Research Institute, Ujjain
|
|
13
|
Rajasthan
|
Abhay Jain Granthalaya, Bikaner
|
|
14
|
Rajasthan Oriental Research Institute, Jodhpur
|
|
15
|
Padmashri Narayan Das Pandulipi Shodh Sansthan, Jaipur
|
|
16
|
Uttar Pradesh
|
Nagari Pracharini Sabha, Varanasi
|
|
17
|
Hindi Sahitya Sammelan, Prayagraj
|
***
(రిలీజ్ ఐడి: 2222514)
|