ప్రధాన మంత్రి కార్యాలయం
అరబ్ విదేశాంగ మంత్రుల ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
అరబ్ దేశాలతో భారత్‌కున్న బలమైన, చారిత్రక ప్రజా సంబంధాల గురించి వివరించిన ప్రధాని
వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక, ఆరోగ్య సేవలు, ఇతర రంగాల్లో సహకారానికి భారత దేశ అంకితభావాన్ని పునరుద్ఘాటించిన ప్రధాని
పాలస్తీనా ప్రజలకు భారత మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటిస్తూ.. గాజా శాంతి ప్రణాళికతో సహా ప్రస్తుతం చేపడుతున్న శాంతి ప్రయత్నాలను స్వాగతించిన పీఎం
प्रविष्टि तिथि:
31 JAN 2026 2:44PM by PIB Hyderabad
భారత్‌లో జరుగుతున్న రెండో ఇండియా-అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు, లీగ్ ఆఫ్ అరబ్ దేశాల సెక్రటరీ జనరల్, అరబ్ ప్రతినిధి బృందాల నాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.
అరబ్ దేశాలకు, భారత్‌కు మధ్య ఉన్న బలమైన, చారిత్రక ప్రజా సంబంధాల గురించి ప్రధానమంత్రి వివరించారు. ఇవి అనేక సంవత్సరాలుగా మన సంబంధాలకు స్ఫూర్తినిస్తూ.. బలోపేతం చేస్తున్నాయన్నారు.
భవిష్యత్తులో భారత్-అరబ్ భాగస్వామ్యం కోసం తన దార్శనికతను వివరించారు. ఉభయ పక్షాల ప్రజలకు పరస్పరం ప్రయోజనం కలిగేలా వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సేవలు, ఇతర ప్రాధాన్య రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
పాలస్తీనా ప్రజలకు భారత్ మద్దతు కొనసాగుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ.. గాజా శాంతి ప్రణాళికతో సహా కొనసాగుతున్న శాంతి ప్రయత్నాలను ప్రధాని స్వాగతించారు. ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం నెలకొల్పే దిశగా తోడ్పాటు అందించడంలో అరబ్ లీగ్ పోషిస్తున్న కీలకమైన పాత్రను ప్రశంసించారు.
***
(रिलीज़ आईडी: 2221295)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam