గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సామాజిక ఆరోగ్య సంరక్షణ రంగంతో గిరిజన వైద్యుల అనుసంధానం
గిరిజన వైద్యుల కోసం జాతీయ సామర్థ్య వికాస కార్యక్రమానికి శ్రీకారం
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా గిరిజన ఆరోగ్య రూపాంతరీకరణలో ఆ తెగల వైద్యులకు భాగస్వామ్యం
భువనేశ్వర్‌లోని ‘ఐసీఎంఆర్-ఆర్‌ఎంఆర్‌సీ’తో మంత్రిత్వశాఖ అవగాహన ఒప్పందంతో దేశంలో తొలి జాతీయ గిరిజన ఆరోగ్య పర్యవేక్షక కేంద్రం ఏర్పాటు
प्रविष्टि तिथि:
16 JAN 2026 6:11PM by PIB Hyderabad
గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవల బలోపేతం దిశగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో ఈ రోజు గిరిజన వైద్యుల కోసం సామర్థ్య వికాస కార్యక్రమం నిర్వహించింది. దేశ ప్రజారోగ్య వ్యవస్థలో గిరిజన వైద్యుల సహకారాన్ని అధికారికంగా గుర్తించి, వారిని భాగస్వాములను చేసే తొలి చారిత్రక జాతీయ కార్యక్రమమిది. సార్వజనీన, చివరి అంచెదాకా సామాజికాధారిత ప్రగతి ద్వారా వికసిత భారత్‌కు రూపుదిద్దాలనే గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది.
ఈ ప్రారంభ కార్యక్రమంలో గౌరవనీయ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జువల్ ఓరం, సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ శ్రీ బలరాం నాయక్, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ప్రముఖ వైద్య-పరిశోధన సంస్థల ప్రతినిధులు సహా దేశం నలుమూలల నుంచి దాదాపు 400 మంది గిరిజన వైద్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ మనీష్ ఠాకూర్ ప్రసంగిస్తూ- గిరిజన సమాజంలో గిరిజన వైద్యులపై విశ్వాసం, సామాజిక గుర్తింపు తరతరాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ చేపట్టే ప్రజారోగ్య కార్యక్రమాల్లో... ప్రత్యేకించి వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సకాలంలో ఆస్పత్రికి తరలింపులో గిరిజన వైద్యులను సహకార భాగస్వాములుగా భావిస్తున్నదని ఆయన తెలిపారు. గిరిజనానికి అధికారిక ఆరోగ్య సంరక్షణ లభ్యతలో భౌగోళిక, సాంస్కృతిక, వ్యవస్థాగత అవరోధాలు పరిమితులను సృష్టిస్తున్నాయని చెప్పారు. అందువల్ల విశ్వసనీయతగల వైద్యుల చురుకైన భాగస్వామ్యంతో చివరి అంచెదాకా సేవా ప్రదానాన్ని గణనీయంగా బలోపేతం చేయవచ్చునని ఆయన వివరించారు.
మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి రంజనా చోప్రా మాట్లాడుతూ- సామాజిక ఆధారిత, నేతృత్వ ఆరోగ్య సదుపాయాలను ప్రధాన స్రవంతిలోకి తేవడంలో గిరిజన వైద్యులకు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ విధానాలు చౌకైనవి, స్థిరమైనవి మాత్రమేగాక స్థానిక వాస్తవిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని ఆమె చెప్పారు. అనేక గిరిజన జిల్లాల్లో మలేరియా, క్షయ, కుష్ఠు వంటి అంటు వ్యాధుల నిరంతర విస్తరణను ప్రముఖంగా ప్రస్తావించారు. అందువల్ల గిరిజన భౌగోళిక ప్రాంతాల్లో ఈ వ్యాధుల నిర్మూలన అంతిమ లక్ష్యంగా అవిరళ కృషి చేయాల్సి ఉందని ఆమె పిలుపునిచ్చారు.
ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల గిరిజన వైద్యులతో సంభాషించిన సందర్భంగా- తమకు తగిన గౌరవం, అధికారిక గుర్తింపు, సంప్రదాయ జ్ఞాన వారసత్వం కోసం పటిష్ఠ యంత్రాంగాలు, అరుదైన ఔషధ మొక్కలు-మూలికల సంరక్షణ దిశగా వారిలోని బలమైన ఆకాంక్షను ఆమె గ్రహించారు. గిరిజనానికి ఆరోగ్య సేవల ప్రదానాన్ని బలోపేతం చేయడంలో లక్ష మంది గిరిజన వైద్యులను అధికారికంగా గుర్తించి, భాగస్వాములుగా అనుమతించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని మంత్రిత్వ శాఖ నిర్దేశించిందని ఆమె తెలిపారు.
పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ ‘దృష్టి’ కింద దేశంలో తొలి జాతీయ గిరిజన ఆరోగ్య పరిశీలన కేంద్రం- ‘భారత్ గిరిజన ఆరోగ్య అబ్జర్వేటరీ’ ఏర్పాటుపై గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భువనేశ్వర్‌లోని ఐసీఎంఆర్ ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తి కావడం విశేషం. దేశవ్యాప్తంగా గిరిజన జిల్లాల్లో తెగ-విభజిత ఆరోగ్య పర్యవేక్షణ, అమలు పరిశోధన, పరిశోధనాధారిత వ్యాధి నిర్మూలన కార్యక్రమాలను ఇది సంస్థాగతీకరిస్తుంది. ముఖ్యంగా మలేరియా, కుష్ఠు, క్షయ వ్యాధులపై దృష్టి సారిస్తూ గిరిజన-నిర్దిష్ట ఆరోగ్య సమాచారం, విశ్లేషణలు, నిదర్శనాల ఆధారిత ప్రణాళికలో దీర్ఘకాలిక జాతీయ అంతరాన్ని పరిష్కరిస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మిక శ్రేయస్సు, దైనందిన జీవనంలో యోగా, ధ్యానం ప్రాధాన్యాన్ని వివరిస్తూ గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్‌ఫుల్‌నెస్, శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు పూజ్య దాజీ ప్రసంగించారు. సంప్రదాయ వైద్య మానవ నమూనాతో పోలికలను వివరిస్తూ- వైద్యులు తమ స్వాభావిక జ్ఞానాన్ని తదుపరి తరానికి బదిలీ చేయకుండా మరణిస్తే.. ముఖ్యంగా యువ గిరిజనం సంప్రదాయ అభ్యసన వ్యవస్థల నుంచి వైదొలగి, తరతరాల దేశీయ జ్ఞానాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. జీవనోపాధి భద్రత, పర్యావరణ స్థిరత్వం, సంపూర్ణ శ్రేయస్సును జోడించే దిశగా గిరిజన ప్రగతిని ఆరోగ్య సేవలకు మించి విస్తరించాలని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని హార్ట్‌ఫుల్‌నెస్ రిట్రీట్‌లో దీర్ఘకాలిక శ్వాసకోశ ముప్పును తగ్గించడానికి ‘ఎల్‌పీజీ’ సీఎస్‌ఆర్-మద్దతుగల కాలుష్యరహిత వంట పరిష్కారాలు, సమాజ కేంద్రక ఉపాధి నమూనాలను ఈ సందర్భంగా ఉదాహరించారు. గిరిజన వైద్యుల “ఆధునికీకరణ” లక్ష్యం కాదని, వారి దేశీయ జీవనశైలి, జ్ఞాన వ్యవస్థలకు గుర్తింపు, సంరక్షణ, వినియోగమేనని ఆయన స్పష్టం చేశారు.
వివరించింది. ముందస్తు పరీక్షలు, కౌన్సెలింగ్, అపోహలు తీర్చడం, సకాలంలో ఆస్పత్రికి తరలింపులో గిరిజన వైద్యుల పాత్రను స్పష్టం చేసింది.
మణిపూర్ ప్రభుత్వ ఆయుష్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పుఖ్రాంబం ఇబోటోమ్ సింగ్ చివరి సాంకేతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు “వ్యాధి నివారణ పద్ధతులను ప్రోత్సహించడంలో గిరిజన వైద్యుల పాత్ర, ప్రజారోగ్య వ్యవస్థల అనుసంధానిత కర్తవ్యబద్ధత, రిఫరల్-ఆధారిత వైద్యులతో సంబంధాల కల్పన ద్వారా నివారణ వైద్యం, పరిశుభ్రత, పోషకాహారం, నైతికత, రోగి భద్రత వగైరాలపై ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని ఈ కార్యక్రమం విశదం చేసింది.
ఈ కార్యక్రమం గిరిజన-స్వదేశీ అభివృద్ధిలో ఒక వినూత్న మార్పును సూచిస్తుంది. శాస్త్రీయ ఆధారాలు, సంస్థాగత భాగస్వామ్యాలు, సాంస్కృతికంగా పాదుకున్న విధానాలలో గిరిజన ఆరోగ్య కార్యాచరణను ఇది ప్రోత్సహిస్తుంది. తద్వారా గిరిజన వైద్యులను సమాజ స్థాయి ఆరోగ్య ప్రదాతలుగా నిలబెడుతుంది. సమగ్ర, నిదర్శనాధారిత, సుస్థిర గిరిజనాభివృద్ధిపై కేంద్రం ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం బలోపేతం చేసింది.
***
(रिलीज़ आईडी: 2215502)
आगंतुक पटल : 3