గనుల మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ - 2047 లక్ష్యసాధనకు బలమైన పునాదిగా
ఖనిజ వనరుల వినియోగం, అభివృద్ధి, విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై జాతీయ సమావేశం
प्रविष्टि तिथि:
09 JAN 2026 7:01PM by PIB Hyderabad
వికసిత భారత్ 2047 కోసం భారత గనుల రంగానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తూ గుజరాత్ లోని గాంధీనగర్‌లో రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్ ( మేధోమథనం) 2026 ప్రారంభమైంది. ఈ రంగంలో సమన్వయ సంస్కరణలు ఆవిష్కరణలకు ఈ సమావేశం రంగాన్ని సిద్ధం చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశాన్ని సంయుక్తంగా ప్రారంభించిన గౌరవ అతిథులు స్వావలంబన కలిగిన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా సుస్థిరమైన ఖనిజ అభివృద్ధి, సమర్థవంతమైన ప్రాజెక్టు అమలు, శాఖల మధ్య సమన్వయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వివిధ రాష్ట్రాల గనుల శాఖ మంత్రులు, కేంద్రరాష్ట్ర శాఖల ఉన్నతాధికారులతో కలిసి గనుల రంగానికి సంబంధించిన పలు అంశాలపై సవివరంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సవాళ్లు, శాఖల మధ్య సమన్వయం, రాష్ట్రాల వారీ సమస్యలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. వారు తమ వివరణాత్మక ప్రసంగాలలో ఆచరణాత్మక పరిష్కారాలను ప్రతిపాదించడంతో పాటు, ఉత్తమ విధానాలను ప్రస్తావించారు. గనుల రంగంలో నిర్వహణ తీరును బలోపేతం చేయడం, నిర్వాహక సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంతో కూడిన చర్చలకు ప్రాతిపదికను అందించారు. అమలులో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడంతో పాటు, సాంకేతిక అనుభవాలను పంచుకున్నారు. అలాగే, వనరుల సుస్థిర వినియోగానికి దోహదపడే నూతన ఆవిష్కరణాత్మక విధానాలపై కూడా చర్చించారు.
సాయంత్రం సెషన్ లో కేంద్రమంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... చింతన్ శిబిర్ లక్ష్యాలు, ప్రాముఖ్యతను వివరించారు. గనుల రంగంలో శ్రామిక శక్తి నిర్వహణ, నిర్వహణ పరమైన విధానాలను మెరుగుపరచడానికి లేబర్ కోడ్ గురించి అవగాహనను అందించారు. గనుల రంగంలో సహకారాన్ని, విజ్ఞానాన్ని పంచుకోవడాన్ని మరింత బలోపేతం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర భాగస్వాముల వాటాదారుల మధ్య అర్థవంతమైన చర్చలు, పరస్పర చర్యలతో ఆ రోజు సమావేశం ముగిసింది.
మొదటి రోజు కార్యక్రమం సదస్సుకు బలమైన పునాది వేసింది. రెండో రోజు కార్యక్రమాన్ని ప్రధానంగా జాతీయ కీలక ఖనిజ మిషన్ ఉద్దేశించారు. ఇది భారతదేశంలోని కీలక ఖనిజాలను గుర్తించడం, ప్రోత్సహించడం, వ్యూహాత్మకంగా వినియోగించడం ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రేరేపించి వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి కీలకం కానుంది.
(रिलीज़ आईडी: 2213675)
आगंतुक पटल : 6