ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ రచయిత శ్రీ వినోద్ కుమార్ శుక్లా కన్నుమూత... ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
23 DEC 2025 7:24PM by PIB Hyderabad
ప్రసిద్ధ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ వినోద్ కుమార్ శుక్లా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. హిందీ సాహిత్య లోకానికి ఆయన అమూల్య సేవలు చిరస్మరణీయమని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ వినోద్ కుమార్ శుక్లా మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హిందీ సాహితీ లోకానికి ఆయన అమూల్య సేవలందించారు. ఆయన కృషి చిరస్మరణీయం కాబట్టి, ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2207940)
आगंतुक पटल : 4