భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2027 నాటికి అంతరిక్షం, సముద్ర అంతర్భాగానికి ఒకే సమయంలో మానవ సహిత యాత్రలను చేపట్టి అరుదైన ఘనతను భారత్ సాధిస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్


వేగంగా సాగుతున్న డీప్ ఓషన్ మిషన్: 2026లో 500 మీటర్లు, 2027లో 6000 మీటర్ల మానవ సహిత డైవ్‌ను భారత్ చేపడుతుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

సుస్థిరమైన, సమ్మిళిత వృద్ధికి శక్తినిస్తున్న ‘విరాసత్ కే వికాస్’ అనే పీఎం మోదీ దార్శనికత: డాక్టర్ జితేంద్ర సింగ్

प्रविष्टि तिथि: 16 DEC 2025 6:39PM by PIB Hyderabad

వచ్చే దశాబ్దం నాటికి భారత్ చేపట్టబోయే లక్ష్య సాధన ప్రణాళికను కేంద్ర శాస్త్రసాంకేతికతభూ విజ్ఞాన శాస్త్ర సహాయ మంత్రి (స్వంతంత్ర హోదా), పీఎంవోసిబ్బందిప్రజా ఫిర్యాదులుపింఛన్లుఅణుశక్తిఅంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 2027 నాటికి అంతరిక్షంసముద్ర అంతర్భాగంలోకి మానవ సహిత యాత్రలను ఒకే సమయంలో చేపట్టి అరుదైన ఘనతను భారత్ సాధిస్తుందని ఆయన అన్నారుఇది దేశ సమగ్ర, దార్శనిక శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుది.

పాత్రికేయ సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసంసామర్థ్యంఉద్దేశంలో స్పష్టత ద్వారా వికసిత్ భారత్ 2047 దిశగా భారత శాస్త్రీయ ప్రయాణం రూపుదిద్దుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారుదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో.. భారత్ ఏం సాధించిందన్నదే కాకుండా.. విలువలువ్యవస్థలుపురోగతి సాధించిన మార్గాలను కూడా ప్రపంచం నిశితంగా గమనిస్తుందని వివరించారు.

ప్రజాస్వామ్యంరాజ్యాంగ సామర్థ్యం, కొనసాగుతున్న నాగరికత భారత్ సాధించిన గొప్ప విజయాల్లో ఉన్నాయనిభవిష్యత్తులో సాధించే వృద్ధికి పునాది వేస్తాయని మంత్రి పేర్కొన్నారు.

అన్వేషణ హద్దులను భారత్ విస్తరిస్తోందంటూనే.. సంప్రదాయ రంగాల నుంచి అంతరిక్షంసముద్ర అంతర్భాగ పరిశోధన లాంటి నూతన రంగాల వైపు నిర్ణయాత్మకంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. 2026 ఆరంభంలోనే సముద్రంలో 500 మీటర్ల లోతుకు చేరుకొనే మానవ సహిత డీప్ సీ కార్యక్రమాన్ని చేపట్టాలని భారత్ యోచిస్తోందని ఆయన తెలియజేశారుఇది డీప్ ఓషన్ మిషన్లో ముఖ్యమైన విజయం అవుతుందన్నారుఇది రానున్న సంవత్సరాల్లో మరింత లోతుగా డైవ్ చేయడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తుందితద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన జలాంతర్గామి ‘మత్స్య’ను ఉపయోగించి 6,000 మీటర్ల లోతు వరకు అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది.

దేశానికి 2027 కీలకమైన సంవత్సరంగా నిలుస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారుఆ ఏడాది భారత్ తన వ్యోమగాములను అంతరిక్షానికి పంపిస్తుందనిఅదే సమయంలో సముద్ర అంతర్భాగంలో మానవ సహిత అన్వేషణను చేపడుతుందని వివరించారుఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ దేశాలు మాత్రమే సాధించాయన్నారుభారత శాస్త్రీయ పరిపక్వతకుసమగ్ర పద్ధతిలో సంక్లిష్టమైనసమాంతర అన్వేషణను చేపట్టే సామర్థ్యానికి ఈ డ్యూయల్ మిషన్ చిహ్నమని ఆయన వర్ణించారు.

గత దశాబ్ద కాలంలో అంతరిక్ష రంగంలో చేపట్టిన సంస్కరణలు ప్రభావాన్ని చూపాయని, ముఖ్యంగా అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశాలను కల్పించాయని మంత్రి వివరించారుస్వీయ నియంత్రణలకు లోబడి ఉండటం నుంచి.. అంతరిక్ష రంగంలో ఆత్మవిశ్వాసంతో వేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందన్నారుఇప్పుడు భారత్‌లో వందల కొద్దీ అంతరిక్ష అంకుర సంస్థలుఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. భవిష్యత్తులో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అనేక రెట్లు వృద్ధి చెందుతుందనిజాతీయ వృద్ధిలోఅంతర్జాతీయ సహకారంలో ప్రధాన సహాయకారిగా ఎదుగుతుందని అంచనా.

భారతదేశానికున్న ప్రత్యేకమైన సహజసాంస్కృతికనాగరికతా వనరుల గురించి కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారుఅది హిమాలయాలుమహా సముద్రాలుసంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలైనా లేదా జీవవైవిధ్యమైనా దేశ అభివృద్ధి నమూనా దాని వారసత్వ వనరులకు విలువను జోడించడంపై ఆధారపడి ఉందని అన్నారువిరాసత్ (వారసత్వం)ను వికాస్ (అభివృద్ధి)తో అనుసంధానించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత.. భారతదేశానికి సుస్థిరమైనసమగ్రమైన, ప్రపంచానికి తోడ్పడే విధంగా వృద్ధిని సాధించే వీలును కల్పిస్తుందని చెప్పారు.

డీప్ ఓషన్ మిషన్ గురించి ప్రస్తావిస్తూ.. భారత్‌కు 11,000 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతం ఉందనికీలకమైన ఖనిజాలుమత్స్య సంపద నుంచి వైద్యపరమైనజీవపరమైన సంపద వరకు దశాబ్దాల పాటు నిరుపయోగంగా ఉన్నాయన్నారుఈ సామర్థ్యాన్ని వినియోగించుకోవడంతో పాటు అంతర్జాతీయ సముద్ర ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసే వ్యూహాత్మక చొరవగా ఈ మిషన్‌ను వర్ణించారుసముద్ర లోతుల్లో అన్వేషణ ప్రాధాన్యందానికున్న జాతీయ ప్రాముఖ్యం గురించి స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసాల్లో ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు.

అంతర్జాతీయ ధోరణులను అనుసరించే దేశంగా భారత్ ఇప్పుడు లేదనిఇతరులు అనుసరించే కొత్త మార్గాలను రూపొందిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారుఅభివృద్ధినిసాంకేతిక పురోగతులను సమతుల్యం చేసుకుంటూనే అంతరిక్ష శాస్త్రమైనాబయోటెక్నాలజీసముద్ర అంతర్భాగ పరిశోధనైనా లేదా సమగ్ర ఆవిష్కరణలైనా అభివృద్ధిలో ఆదర్శప్రాయంగా ఉండేలా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది.

తన ప్రసంగాన్ని ముగిస్తూఆర్థిక విజయాలతో మాత్రమే కాకుండా.. కొత్త అంశాలను అన్వేషించే విశ్వాసంసంస్కరణలు చేపట్టే ధైర్యంఅంతర్జాతీయ వృద్ధికి అర్థవంతంగా సహకరించే సామర్థ్యంతో 2047 దిశగా భారత్ ప్రయాణాన్ని నిర్వచించాలని మంత్రి వివరించారు. ‘‘భూమిపైసముద్ర అంతర్భాగంలోఅంతరిక్షంలో భారత్ చేపడుతున్న కార్యక్రమాలు అంతిమంగా మానవ ప్రయోజనాలు కోసమే’’ అని ఆయన అన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2205630) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी