కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో 5జీ సేవల ప్రస్తుత స్థితి

प्रविष्टि तिथि: 11 DEC 2025 4:53PM by PIB Hyderabad

 దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లో 5జీ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయనిప్రస్తుతం 99.9 శాతం జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని కమ్యూనికేషన్లుగ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాజ్యసభలో ఈ రోజు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారుదేశవ్యాప్తంగా గ్రామీణపట్టణ ప్రాంతాల్లో 31.10.2025 నాటికి 5.08 లక్షల 5జీ బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ (బీటీఎస్)లను టెలికాం సేవల ప్రొవైడర్లు (టీఎస్‌పీఏర్పాటు చేశారు.

సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కాల్ డ్రాప్‌లను తగ్గించడానికిఇంటర్నెట్ అనుసంధానతను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందిఅవి:

  1. గ్రామపంచాయతీ (జీపీ)లుగ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు భారత్ నెట్ ప్రాజెక్టు.

  2. వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈప్రభావిత ప్రాంతాలుఆకాంక్షాత్మక జిల్లాల్లో మొబైల్ సేవలను అందించే పథకం.

  3. 4జీ సేవలు అందుబాటులో లేని గ్రామాల్లో మొబైల్ కవరేజీ అందించడానికి 4జీ సాచ్యురేషన్ పథకం.

  4. ఆర్‌వోడబ్ల్యూ, టెలికాం మౌలిక వసతుల ఏర్పాటుకు అనుమతులను క్రమబద్ధీకరించడానికి గతిశక్తి సంచార్ పోర్టల్ ప్రారంభంఆర్‌వోడబ్ల్యూ (రైట్ ఆఫ్ వేనియమాల అమలు.

  5. స్వల్ప శ్రేణి వైర్‌లెస్ ట్రాన్సిమిషన్ కేంద్రాలు, టెలికమ్యూనికేషన్ లైన్ ఏర్పాటు చేయడానికి వీధుల్లో ఏర్పాటు చేసిన ప్రజా వసతులను ఉపయోగించుకోవడానికి కాలపరిమితితో కూడిన అనుమతి.

దేశవ్యాప్తంగా 31 లక్షలకు పైగా బేస్ ట్రాన్సీవర్ స్టేషన్(బీటీఎస్)లు ఏర్పాటయ్యాయి.ఈ టెలికాం మౌలిక వసతులను ప్రైవేటు టీఎస్‌పీలురాష్ట్రాల ఆధ్వర్యంలోని సర్వీసు ప్రొవైడర్లు ఏర్పాటు చేశారుఅలాగే.. వీటిని సాంకేతిక-వాణిజ్య అవసరాన్ని బట్టి ప్రైవేటురాష్ట్ర సర్వీసు ప్రొవైడర్లు ఉపయోగించుకుంటున్నారు. 

 

***


(रिलीज़ आईडी: 2202781) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Tamil