జల శక్తి మంత్రిత్వ శాఖ
ఎఫ్ఎంబీఏపీలోని ఎఫ్ఎంపీ కింద ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం
प्रविष्टि तिथि:
01 DEC 2025 7:18PM by PIB Hyderabad
దేశంలోని ప్రధాన, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు కలిగిన అన్నీ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ఉప్పు/క్షార ప్రభావిత నేలలను గుర్తించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పరిధిలోని జోధ్‌పూర్ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ సర్వీస్ సెంటర్‌తో కలిసి కేంద్ర జల కమిషన్ 2003-2008 కాలంలో ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం నీరు నిలిచిపోయిన భూభాగం 28.267 వేల హెక్టార్లు, ఉప్పు ప్రభావిత భూభాగం 12.933 వేల హెక్టార్లుగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది. అదే విధంగా బుడమేరు మళ్లింపు కాలువలో 11.900 కిలోమీటర్ల పొడవు వరదలకు గురయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతంగా గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించినట్లు తెలిపింది.
వరద నియంత్రణ, సరిహద్దు ప్రాంతాల కార్యక్రమంలోని వరద నియంత్రణ కార్యక్రమం కింద వరద నివారణ, డ్రైనేజీ అభివృద్ధి, సముద్ర తీరం కోతను తగ్గించే పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు రూ. 100 కోట్ల కనీస పరిమితి, ప్రత్యేక కేటగిరి, కొండప్రాంత రాష్ట్రాలకు రూ. 50 కోట్ల పరిమితి కలిగిన కొత్త, కీలక వరద నిర్వహణ ప్రాజెక్టులు మాత్రమే నిధుల కోసం పరిగణలోకి తీసుకుంటుంది. వాటితోపాటు ప్రధాన అంతర్-రాష్ట్ర నదులపై ఆధునిక సాంకేతికత , వినూత్న సామాగ్రి/పద్ధతులను అవలంబించడం, ఒక చట్టం ద్వారా లేదా తగిన కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్‌ను అమలు చేసే రాష్ట్రాలను మాత్రమే నిధుల కోసం పరిశీలిస్తుంది.
ప్రాజెక్టుల కోసం నిధుల విధానం జనరల్ కేటగిరీ రాష్ట్రాల్లో 60 శాతం కేంద్రం-40 శాతం రాష్ట్రం.. ప్రత్యేక కేటగిరీతోపాటు కొండ ప్రాంత రాష్ట్రాలకు 90 శాతం కేంద్రం-10 శాతం రాష్ట్ర వాటా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఏ ప్రాజెక్ట్ ప్రతిపాదన కూడా సహాయం కోసం పరిశీలనలో లేదు.
ఈ సమాచారాన్ని జల శక్తి రాష్ట్ర మంత్రి శ్రీ రాజ్ భూషణ్ చౌదరి నేడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో అందించారు.
***
(रिलीज़ आईडी: 2197368)
आगंतुक पटल : 9