ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమ్మ 70వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి వీడియో సందేశానికి తెలుగు అనువాదం

प्रविष्टि तिथि: 03 OCT 2023 1:50PM by PIB Hyderabad

సేవఆధ్యాత్మికతలు మూర్తీభవించిన అమ్మ మాతా అమృతానందమయి జీకి నేను సాదర నమస్సులు అర్పిస్తున్నానుఅమ్మ డెబ్భయ్యో పుట్టినరోజు సందర్భంగాదీర్ఘాయుష్షుతో పాటు ఆరోగ్యవంతమైన జీవనం అమ్మకు కలగాలని నేను ఆకాంక్షిస్తున్నానుప్రపంచం నలు మూలలా ప్రేమనూకరుణనూ వ్యాపింపచేయాలన్న ఆమె ఉద్యమం నిరంతరం మునుముందుకు సాగిపోతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నానుఅమ్మ అనుయాయులతో పాటు వేర్వేరు రంగాల నుంచి ఇక్కడకు తరలివచ్చిన వారందరికీ నేను అభినందనల్నీశుభాకాంక్షల్నీ తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
అమ్మతో 30 సంవత్సరాలకు పైగా నాకు ప్రత్యక్ష అనుబంధం ఉందికచ్ఛ్‌లో భూకంపం వచ్చిన తరువాతఅమ్మతో కలసి దీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు దక్కిందిఅమృతపురిలో అమ్మ 60వ జన్మదినాన్ని జరుపుకొన్న రోజు నాకు ఇప్పటికీ జ్ఞ‌ాపకముందిఈ రోజు నిర్వహిస్తున్న కార్యక్రమానికి నేను స్వయంగా హాజరై ఉండి ఉంటేఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యుండే వాణ్నిఈ రోజుకు కూడాఅమ్మ చిరునవ్వు మోముఆప్యాయత పొంగిపొరలే ఆమె స్వభావం ఇదివరకటిలా చెక్కుచెదరకుండా ఉన్నాయిపైపెచ్చుగడచిన పది సంవత్సరాల్లోఅమ్మ చేస్తున్న కార్యక్రమాలూప్రపంచంపై అవి ప్రసరిస్తున్న ప్రభావమూ అనేక రెట్లు విస్తరించాయికిందటి సంవత్సరం ఆగస్టులోహర్యానాలోని ఫరీదాబాద్‌లో అమృత ఆసుపత్రిని ప్రారంభించే భాగ్యం నాకు లభించిందిఅమ్మ హాజరీఆమె ఆశీస్సుల కాంతి మండల ప్రభావాన్ని మాటల్లో చెప్పలేం.. కేవలం అనుభూతించగలుగుతామంతేనాకు గుర్తుంది.. ఆ రోజు నేను అమ్మతో చెప్పిన మాటల్ని ఇవాళ మళ్లీ చెబుతున్నా.. స్నేహ-త్తిండేకారుణ్య-త్తిండేసేవన్-త్తిండేత్యాగ-త్తిండేపర్యాయమాణ అమ్మమాతా అమృతానందబయి దేవిభార-త్తిండే మహత్తాయఆధ్యాత్మిక పారంపర్య-త్తిండేనేరవ-కాశియాణ.. అనిఈ మాటలకుప్రేమకరుణసేవత్యాగం.. వీటికి ప్రతీక అమ్మఅని అర్థంభారత ఆధ్యాత్మిక సంప్రదాయానికి ఆమె వాహికగా కూడా ఉన్నారు.
మిత్రులారా,
అమ్మ చేస్తున్న కార్యాల్లో ఒక కోణాన్ని పరిశీలిస్తే ఆమె.. దేశ విదేశాల్లో సంస్థల్ని స్థాపించారువాటిని  ప్రోత్సహించారుఆరోగ్య రంగం కావొచ్చు లేదా విద్య రంగం కావొచ్చు.. అమ్మ మార్గదర్శకత్వంలో ఏర్పాటైన ప్రతి సంస్థా మానవులకు సేవ చేయడాన్నీసమాజ సంక్షేమానికి పాటుపడడాన్నీ కొత్త శిఖర స్థాయులకు చేర్చిందిదేశం స్వచ్ఛత ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడుఆ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి మొదటగా ముందుకు వచ్చిన వ్యక్తుల్లో అమ్మ ఒకరుగా నిలిచారుగంగానది తీరంలో స్నానాలకు గదులను నిర్మించడానికి రూ.100 కోట్లు ఆమె విరాళంగా ఇచ్చారుదీంతో స్వచ్ఛతకు ఒక కొత్త శక్తి సమకూరిందిఅమ్మకు ప్రపంచవ్యాప్తంగా అనుయాయులున్నారు.. వారు కూడా భారత్ పేరుప్రతిష్ఠల్నీదేశ విశ్వసనీయతనీ పెంపొందింపచేశారుఇంత గొప్ప స్ఫూర్తి లభించిందంటేమరి  ప్రయత్నాలు కూడాను పెద్దవి అయిపోతాయి.    
మిత్రులారా,
మహమ్మారి తరువాతి కాలపు ప్రపంచంలో,  అభివృద్ధి విషయంలో ప్రస్తుతం మానవతకు పెద్దపీట వేస్తూ భారత్ అనుసరిస్తున్న విధానం సర్వత్ర ఆమోదయోగ్యతను సంతరించుకుందిఈ దశలోఅమ్మ వంటి మహనీయ వ్యక్తులు భారత్ అవలంబిస్తున్న మానవీయ ప్రధాన విధానానికి ప్రతిబింబంగా ఉంటున్నారుఅశక్తుల్ని సశక్తులుగా చేయడంఆదరణకు నోచుకోని వర్గాలకు పెద్దపీట వేయడమనే మానవీయ యజ్ఞాన్ని అమ్మ సర్వ కాలాల్లో నిర్వహిస్తున్నారుకొద్ది రోజుల కిందట.. నారీశక్తి వందన్ అధినియాన్ని.. భారత పార్లమెంటులో ఆమోదించారుమహిళల మార్గదర్శకత్వంలో అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతో ముందుకుపోతున్నభారత్‌కు అమ్మ వంటి స్ఫూర్తి మూర్తి లభించారుప్రపంచంలో శాంతినీప్రగతినీ ప్రోత్సహించడానికి అమ్మ అనుయాయులంతా ఇలాంటి పనులు కొనసాగిస్తారని నేను నమ్ముతున్నానుమరో సారిఅమ్మకు ఆమె 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఆమెకు దీర్ఘాయుష్షు కలుగుగాక.. ఆమె ఆరోగ్యంగా ఉండుగాక.. ఆమె ఇదే విధంగా మానవాళికి సేవలను అందించుగాక.. మరి మా అందరిపై మీరు ఇలాగే మీ వాత్సల్యాన్ని వర్షిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నానుమరో సారి అమ్మకు నేను ప్రణామం చేస్తున్నాను.
గమనికఇది ప్రధానమంత్రి ఉపన్యాసానికి అనువాదంప్రధాని హిందీలో మాట్లాడారు.

 

***


(रिलीज़ आईडी: 2197102) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam