సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవం’లో పాల్గొన్న పీఐబీ హైదరాబాద్

నాడు పోస్టు చేయడమైనది: 07 NOV 2025 6:31PM by PIB Hyderabad

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), డీపీడీ యూనిట్లతో కలిసి హైదరాబాద్‌లోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఈ రోజు భారతదేశ జాతీయ గేయం "వందేమాతరం" 150వ వార్షికోత్సవాన్ని దేశభక్తి భావనతో ఉత్సహంగా నిర్వహించింది. 

 

అధికారులు, సిబ్బంది ‘వందేమాతరాన్ని’ సామూహికంగా ఆలపించారు. మాతృభూమి పట్ల ఐక్యత, భక్తిని చాటుతున్న ఈ గేయం అందిస్తోన్న వెలకట్టలేని కాలాతీత సందేశాన్ని తెలియజేసేలా కార్యాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సీబీసీ హైదరాబాద్ సిబ్బంది కూడా ఉల్లాసభరితమైన నృత్య ప్రదర్శన చేశారు. 

పీఐబీ హైదరాబాద్ ఏడీజీ శ్రీమతి శ్రుతి పాటిల్ (ఐఐఎస్) మాట్లాడుతూ.. ఈ గేయానికి ఉన్న అసలైన, పరివర్తనాత్మక స్ఫూర్తితో పౌరులను తిరిగి అనుసంధానించడానికి, ఈ గేయ వారసత్వాన్ని భవిష్యత్ తరాల మనస్సుల్లో నిక్షిప్తమై ఉండేలా చూడటానికి దేశవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించాలన్న ప్రతిపాదనకు 2025 అక్టోబర్ 1న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. 

బంకిమ్‌చంద్ర ఛటర్జీ ‘వందేమాతరాన్ని’ రచించి 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇది మొదటగా 1875 నవంబర్ 7న బంగాదర్షన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. ‘ఆనందమఠ్‌’ అనే నవలలో భాగంగా ఆయన దీనిని రచించారు. 

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలను ప్రారంభించారు. పీఐబీ హైదరాబాద్, సీబీసీ హైదరాబాద్, డీపీడీ, సీబీఎఫ్‌సీ అధికారులు, సిబ్బంది ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. తద్వారా దేశభక్తి, ఐక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘150 ఏళ్ల వందేమాతరం’ జాతీయ వేడుకలో భాగమయ్యారు. 

***


(రిలీజ్ ఐడి: 2187532) సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English