ఆర్థిక మంత్రిత్వ శాఖ
జాతీయ పింఛను వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రజల అభిప్రాయాలు కోరుతూ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసిన పీఎఫ్ఆర్డీఏ
प्रविष्टि तिथि:
01 OCT 2025 1:23PM by PIB Hyderabad
సరళమైన, హామీతో కూడిన, ఊహించదగిన పింఛను పథకాలతో జాతీయ పింఛను విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఒక సమగ్ర సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. పదవీ విరమణ తర్వాత లభించే ఆదాయంపై ఉద్యోగులకు మరింత స్పష్టత, ముందస్తు అంచనాలను అందించడానికి రూపొందించిన మెరుగైన ఎంపికలను ప్రవేశపెట్టడం ద్వారా జాతీయ పింఛను విధానాన్ని (ఎన్పీఎస్) అమలు చేయడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నంగా ఈ పత్రాన్ని విడుదల చేశారు.
సెప్టెంబర్ 30, 2025 తేదీతో విడుదల చేసిన సంప్రదింపుల పత్రం, ఎన్పీఎస్ ప్రణాళిక కింద మూడు విభిన్న పథకాలను ప్రతిపాదిస్తుంది. ప్రతి ఒక్కటీ హామీతో కూడిన అనువైన పింఛను చెల్లింపుల కోసం విభిన్న చందాదారుల అవసరాలను తీరుస్తుంది.
పింఛను పథకం-1 (హామీరహిత, అనువైన డిక్యూములేషన్): ఈ పథకం స్టెప్-అప్ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) యాన్యుటీ కలయిక ద్వారా పింఛను ఆదాయాన్ని గరిష్ఠం చేయడంపై దృష్టి పెడుతుంది.
పింఛను పథకం-2 (హామీతో కూడిన ప్రయోజనం): పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ - డబ్ల్యూ) ఆధారంగా కాలానుగుణ ద్రవ్యోల్బణ సవరణలతో నిర్ణయించిన పింఛనును అందించడానికి రూపొందించిన హామీతో కూడిన ప్రయోజన పథకం.
పింఛను పథకం-3 (పింఛను క్రెడిట్‌ల ద్వారా హామీ): "పింఛను క్రెడిట్‌లు" అనే వినూత్న భావనను పరిచయం చేస్తుంది. ప్రతి క్రెడిట్ ఒక స్థిర నెలవారీ పింఛను చెల్లింపునకు హామీ ఇస్తుంది. లక్ష్య ఆధారిత ప్రణాళిక ద్వారా అంచనాను, సభ్యుల పాత్రను పెంచుతుంది.
సభ్యుల సలహాల కోసం ఆహ్వానం
సంప్రదింపుల పత్రం పీఎఫ్ఆర్డిఏ వెబ్‌సైట్‌లో పరిశోధన, ప్రచురణ ట్యాబ్ కింద అందుబాటులో ఉంది. (లింక్: https://pfrda.org.in/en/web/pfrda/w/consultation-paper)
ఎన్పీఎస్ చందాదారులు, కాబోయే చందాదారులు, పెన్షన్ ఫండ్‌లు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు, సాధారణ ప్రజలతో సహా వాటాదారులందరి నుంచి పీఎఫ్ఆర్డీఏ అభిప్రాయాలను కోరుతోంది. ఈ పథకాల విజయవంతమైన అభివృద్ధి, అమలు కోసం ప్రతిపాదనలపై సమగ్ర సమీక్ష, నిర్మాణాత్మక సూచనలను అథారిటీ ప్రోత్సహిస్తోంది.
వాటాదారులు తమ సలహాలు, సూచనలు, ఇతర సమాచారాన్ని సంప్రదింపుల పత్రంలోని ఫీడ్‌బ్యాక్ నమూనా పత్రం ద్వారా 31 అక్టోబర్ 2025 లోగా సమర్పించాలని పీఎఫ్ఆర్డీఏ కోరింది.
***
(रिलीज़ आईडी: 2173946)
आगंतुक पटल : 39