సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతా హీ సేవ 2025: సీజీవో టవర్స్‌లో ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాథ్’ కార్యక్రమాన్ని నిర్వహించిన పీఐబీ హైదరాబాద్
* ప్రతిజ్ఞ, పారిశుద్ద్య కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2025 5:43PM by PIB Hyderabad
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగమైన స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా కవాడీగూడలోని సీజీవో టవర్స్‌లో ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాథ్’ కార్యక్రమాన్ని పీఐబీ హైదరాబాద్ నిర్వహించింది.
పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన భారత్ సాధనకు తమ అంకిత భావాన్ని తెలియజేస్తూ.. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయడంతో ఈ కార్యక్రమం మొదలైంది.
పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య యోధులను సత్కరించారు.
PQTG.jpeg)
ఈ సందర్భంగా పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్, ఐఐఎస్ మాట్లాడుతూ.. ‘‘పారిశుద్ధ్యం కేవలం ఒక్క రోజుకే పరిమితమైన కార్యక్రమం కాదు. అది నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములవుతాం’’ అని తెలియజేశారు.
‘ఏక్ తరీక్, ఏక్ గంట, ఏక్ సాథ్’ అన్న ప్రధానమంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ దార్శనికతను సాధించేందుకు సమష్టి కృషి అవసరమనే సందేశాన్ని బలపరుస్తూ.. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అధికారి శ్రీమతి వరగంటి గాయత్రి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్రీ అశ్వనీ కుమార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2171288)
సందర్శకుల సూచీ సంఖ్య : : 57