సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ – మై భారత్ @ 2047 అంశంపై చిత్రకళా పోటీలు... ఉత్సాహంగా పాల్గొన్న చిత్రకారులు
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2025 5:52PM by PIB Hyderabad
సేవా పర్వ్ 2025లో భాగంగా సాలార్ జంగ్ మ్యూజియం, సాంస్కృతిక వనరలు-శిక్షణ కేంద్రం (సీసీఆర్టీ) సంయుక్తంగా “వికసిత్ భారత్ – మై భారత్ @ 2047” అనే అంశంపై సోమవారం చిత్రలేఖన శిబిరాన్ని నిర్వహించింది. చిత్రలేఖనం శిబిరంలో 500 మందికి పైగా యువ కళాకారులు పాల్గొన్నారు. భారతదేశ భవిష్యత్తు దృష్టికోణాన్ని యువ కళాకారుల కళాత్మక భావనల ద్వారా వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సేవా పర్వ్ 2025: వీక్షిత్ భారత్ కే రంగ్, కాలా కే సంగ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరం.. 2047 నాటికి దేశం ఎలా ఉండాలనే దానిపై యువ కళాకారులు చిత్రలేఖన రూపంలో వ్యక్తపరచేందుకు ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్కు చెందిన పాఠశాల, కళాశాల విద్యార్థులు సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 500 మందికి పైగా కళాకారులు ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్, ఐఏఎస్, సీసీఆర్టీ అధికారులు, ప్రాంతీయ అధికారి శ్రీమతి సౌందర్య కౌశిక్, సాలార్ జంగ్ మ్యూజియం ప్రదర్శన నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. బహుమతులు, విజేతల జాబితాను, నగదు బహుమతులనూ త్వరలో ప్రకటించనున్నారు.
0Q6K.jpeg)
8GST.jpeg)

***
(రిలీజ్ ఐడి: 2169709)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27