లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

మన మహిళలు చదువుకుని, సాధికారిత పొందినపుడే సమ్మిళిత్వంతో అభివృద్ధి చెందిన భారత్ సాధ్యం: లోక్ సభ స్పీకర్ మహిళల నేతృత్వంలో అభివృద్ధి, పిల్లల అభివృద్ధి...

2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న దార్శనికతకు పునాది: లోక్ సభ స్పీకర్

నారీశక్తి వందన్ చట్టం కేవలం ప్రాతినిధ్యానికి సంబంధించిన ఒక నిబంధన కాదు..

ప్రజాస్వామ్యంలో మహిళలకు దక్కాల్సిన సరైన స్థానాన్ని అందించే ఒక చారిత్రాత్మక అడుగు: లోక్ సభ స్పీకర్

భారత రాజ్యాంగం స్త్రీపురుష భేదం లేకుండా, సమానత్వానికి మూలస్తంభంగా

ఉండటానికి కారణం...రాజ్యాంగ సభలోని15 మంది మహిళా సభ్యులు: లోక్ సభ స్పీకర్

భారత నారి అంటే.. పురాతన కాలంలోని పండితుల నుంచి స్వాతంత్ర్య సమరయోధులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల వరకూ గౌరవం: లోక్ సభ స్పీకర్

మహిళా సాధికారత ఓ నిరంతర ప్రక్రియ.. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు

కొత్త చట్టాలు, విధాన సంస్కరణలు, మహిళా భాగస్వామ్యం అవసరం: లోక్ సభ స్పీకర్

ఆలోచనలను పంచుకోవటంలో మహిళల సాధికారతపై పని చేస్తోన్న కమిటీల సమావేశం కీలకం...

సమగ్ర విధాన రూపకల్పనకు మార్గం సుగమం: లోక్ సభ స్పీకర్

మహిళా సాధికారతపై పని చేస్తోన్న కమిటీలకు సంబంధించిన

చరిత్రాత్మక తొలి జాతీయ సమావేశాన్ని తిరుపతిలో ప్రారంభించిన లోక్ సభ స్పీకర్

Posted On: 14 SEP 2025 5:47PM by PIB Hyderabad

వికసిత్ భారత్ 2047 నాటికి సాధించాలనే దార్శనికతకు మహిళా సాధికారతపిల్లల సంక్షేమంతో ముడిపడి ఉన్న మహిళల నేతృత్వంలోని అభివృద్ధి... పునాది వంటిదని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అన్నారుమహిళా సాధికారతపై పని చేస్తున్న పార్లమెంటురాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలకు సంబంధించిన కమిటీల తొలి జాతీయ సమావేశాన్ని ఆయన తిరుపతిలో ఈ రోజు ప్రారంభించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఆడబిడ్డలు విద్యావంతులై స్వావలంబన పొందినప్పుడే భారత్ ‌సమ్మిళితత్వంతో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారుఈ సమావేశానికి 20 కంటే ఎక్కువ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు

"వికసిత్ భారత్ కోసం మహిళల నేతృత్వంలో అభివృద్ధిఅనే అంశంపై ఈ రెండు రోజుల సమావేశం జరుగుతోందిఇందులో ‘జెండర్ బడ్జెటింగ్’, ‘అధునాతన సాంకేతికతల సవాళ్లను ఎదుర్కొనేలా మహిళలకు సాధికారత కల్పించటంఅనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారుమహిళల నాయకత్వాన్ని బలోపేతం చేయడంపాలనలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంసమ్మిళిత విధానాలు ఉండేలా చూసుకోవటంమహిళలను కేవలం లబ్ధిదారులుగానే కాకుండా జాతీయాభివృద్ధికి ప్రధాన ఆధారంగా ఉన్న భారతదేశ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చింనున్నారు

మహిళా సాధికారతపై పనిచేస్తోన్న కమిటీల జాతీయ సమావేశం మొదటిసారిగా జరుగుతోందని,  భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక కీలక ఘట్టమని లోక్‌ సభ స్పీకర్ అన్నారుఇటువంటి సమావేశాలు.. ఆలోచనలుఅనుభవాలను పంచుకోవటంలో కీలక పాత్ర పోషిస్తాయనిసమగ్ర విధాన రూపకల్పనకు మార్గం సుగమం చేస్తాయని ఆయన అన్నారు.

ఈ సమావేశం దేశవ్యాప్తంగా ఉన్న చట్ట సభల సభ్యులువిధాన నిర్ణేతలుమహిళా నాయకులను ఒకచోట చేర్చిందిమహిళల నాయకత్వంసమానత్వంజీవితంలోని ప్రతి దశలోనూ మహిళలను కలుపుకొని వెళ్లటానికి సంబంధించిన వ్యూహాలను సమిష్టిగా రూపొందించనుంది

మహిళా సాధికారతశిశు సంక్షేమ సమస్యలు అలక్ష్యం చేయదగినంత చిన్నవి కావుఅవి జాతీయ పురోగతికి చెందిన పునాదితో ముడిపడి ఉన్నాయి’ అనే స్పష్టమైనశక్తిమంతమైన సందేశాన్ని తిరుపతి సమావేశం పంపుతుందని లోక్ స‌భ స్పీకర్ అభిప్రాయపడ్డారుపంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళా నాయకత్వంసమ్మిళిత చట్టాలువిధానాలుప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం అనే అంశంపై దృష్టి సారించనున్న ఈ సమావేశం.. 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడంలో కీలక పురోగమన ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

మహిళా సాధికారత అనేది ఒకేసారి చేపట్టే కార్యక్రమం కాదని.. జీవితంలోని ప్రతి దశలోనూ మహిళల అవసరాలను తీర్చే సమగ్ర విధానాలను తయారుచేయాల్సిన నిరంతర ప్రక్రియ అని స్పీకర్ ప్రధానంగా చెప్పారుపంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్నారుమహిళలు ఎదుర్కొన్న సవాళ్లుఅడ్డంకులను పరిష్కరించడంలో విధానచట్టాల రూపకల్పన మహిళల భాగస్వామ్యాన్ని పెంచటం అనేది ఉపయోగపడుతుందని అన్నారుభారత్ ‌అమృత కాలంలోకి అడుగుపెడుతున్న ప్రస్తుత తరుణంలో దేశాన్ని బలంసమ్మిళితత్వం వైపు నడిపించే తిరుగులేని శక్తిగా నారీ శక్తి తయారతోందని అన్నారు

దేశానికి సంబంధించిన ప్రతి రంగంలో మహిళల సామర్థ్యంనాయకత్వంభాగస్వామ్యం అనేవి సమానత్వానికి సంబంధించిన అంశాలు మాత్రమే కావని.. సమ్మిళితసుస్థిర వృద్ధికి పునాది అని ఆయన వివరించారువిద్యశాస్త్రీయ విజ్ఞానంపరిపాలనసాంకేతికతవ్యవస్థాపకతఆవిష్కరణలలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు జాతీయ పురోగతి వేగాన్నిస్వభావాన్ని .. మహిళలు పోషిస్తోన్న పాత్రవారి సురక్షితమైన భవిష్యత్తు అనేవి నిర్ణయిస్తాయని తెలిపారు

మరింత సమానత్వసమ్మిళిత సమాజానికి బాటలు వేసిన మహిళా స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా స్పీకర్ గుర్తు చేశారుధైర్యవంతులైన ఈ మహిళలు అడ్డంకులను అధిగమించి మూస ధోరణులను అధిగమించి నాయకులుగావ్యూహకర్తలుగాసంస్కర్తలుగా ఎదిగారుస్వాతంత్ర్య పోరాటం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు.. న్యాయంసమానత్వం కోసం పోరాటం అని కూడా వారు నిరూపించారువిద్యఆరోగ్యందేశాభివృద్ధిమహిళల హక్కులు వంటి రంగాల్లో వారు చేసిన కృషి స్వతంత్ర భారత్‌లో సమానత్వంన్యాయానికి సంబంధించిన విలువలు సజీవంగా ఉండేలా చూసిందని అన్నారు

రాజ్యాంగ సభలో కూడా 15 మంది మహిళా సభ్యులు రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో భాగమయ్యారుభారత రాజ్యాంగాన్ని లింగ తటస్థంగా ఉండేలా వారి దార్శనికతదృక్పథాలు ప్రభావితం చేశాయని అన్నారుఅవి మహిళలకు సమాన హక్కులుఅవకాశాలకు బలమైన పునాదిని వేశాయని లోక్‌సభ స్పీకర్ పేర్కొన్నారుఈ క్రియాశీల మహిళల భాగస్వామ్యం ఫలితంగానే రాజ్యాంగంలో స్వేచ్ఛాసమానత్వాలు ఉన్నాయని ప్రధానంగా చెప్పారు

ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా.. మహిళల నాయకత్వం గురించి ప్రస్తావించారుగార్గిఅనుసుయ వంటి ప్రాచీన మేథావుల నుంచి రాణి రుద్రమదేవిరాణి లక్ష్మీబాయి వంటి పరాక్రమవంతులైన నాయకుల వరకు ధైర్యంవిజ్ఞానంత్యాగం ద్వారా భారతదేశ చరిత్రను మహిళలు రూపొందించారని ఆయన అన్నారుభారతీయ మహిళలు నేడు అంతరిక్ష పరిశోధన నుంచి శాస్త్ర సాంకేతికతల వరకుక్రీడల నుంచి సాహిత్యం వరకుస్థానిక స్వపరిపాలన నుంచి జాతీయ నాయకత్వం వరకు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నట్లు పేర్కొన్నారుభారత్‌కు మహిళా రాష్ట్రపతిప్రధానమంత్రిముఖ్యమంత్రులుగవర్నర్లుస్పీకర్లుశాసనసభ్యులు ఉన్నారని.. ఇది చాలా గర్వకారణం అని వ్యాఖ్యానించారుమహిళా నాయకత్వం పట్ల దేశానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తోందని అన్నారు.

ఈ సందర్భంగా నారీశక్తి వందన్ అభినియాన్ని ఆయన ప్రస్తావించారుదీన్ని మహిళలకు సంబంధించిన పరివర్తనకు సంస్థగత రూపాన్నిచ్చే చారిత్రాత్మక రాజ్యాంగ సంస్కరణగా వర్ణించారులోక్‌సభరాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ను అందిస్తూ కొత్త పార్లమెంటు భవనంలో ఆమోదించిన మొదటి బిల్లు ఇదేదని.. ఇదెంతో గర్వంచదగ్గ విషయమని అన్నారుఈ కీలక చట్టం కేవలం ప్రతీకాత్మకం కాదని.. మహిళలకు పరిపాలనలో సరైన స్థానాన్ని అందించేలా చూసుకుంటూ దేశ భవిష్యత్తును రూపొందించేందుకు కొత్త తరం మహిళా నాయకులను సిద్ధం చేయడానికి దోహదపడతుందని ఉద్ఘాటించారు

ప్రతి మహిళ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందేలా చూసుకోవటం అనేది ఆత్మనిర్భర్ భారత్వికసిత్ భారత్‌ను సాధించడంలో కీలకమన్న ప్రధానమంత్రి దార్శనికతను లోక్‌సభ స్పీకర్ ఈ సందర్భంగా ప్రస్తావించారునేడు నాయకులుఆవిష్కర్తలుసంరక్షకులువ్యవస్థాపకులుగా మహిళలు లేని రంగం లేదని ఆయన అన్నారుగ్రామ పంచాయతీలుపట్టణ స్థానిక సంస్థలలోని క్షేత్రస్థాయి ప్రతినిధుల నుంచి శాస్త్ర సాంకేతికతప్రభుత్వ సంస్థలకు మహిళల నాయకత్వం వహిస్తున్నారని తెలిపారుభారత్‌లో ప్రగతి చోదకులుగాదేశ నిర్మాతలుగా మహిళలు ఎదగటాన్ని ఇది తెలియజేస్తోందని వివరించారు

ప్రారంభ సమావేశంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్మహిళా సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి డీపురందేశ్వరిఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ సీఅయ్యన్నపాత్రుడుఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులుశాసనసభశాసనమండలి సభ్యులు.. పార్లమెంటు రాష్ట్ర-  కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభల మహిళా సాధికారతకు సంబంధించిన కమిటీల చైర్‌పర్సన్లుసభ్యులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమానికి ముందు లోక్‌సభ స్పీకర్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారుచాలా కాలంగా భక్తిత్యాగంమహిళల భాగస్వామ్యంతో ముడిపడి ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుపతిని అభివర్ణించారుభారత అభివృద్ధి ప్రయాణంలో మహిళలుపిల్లలను కేంద్రంగా నిలపాలనే జాతీయ సంకల్పాన్ని పునరుద్ఘాటించడానికి ఇది సరైన వేదిక అని లోక్‌సభ స్పీకర్ అన్నారు.

 

***


(Release ID: 2166654) Visitor Counter : 11
Read this release in: English