రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మీదుగా... భాగల్పూర్-దుమ్కా-రాంపూర్హాట్ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (177 కి.మీ) డబ్లింగ్ రూ.3,169 కోట్ల వ్యయం... క్యాబినెట్ ఆమోదం

Posted On: 10 SEP 2025 3:08PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన సమావేశంలో బీహార్జార్ఖండ్పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని భాగల్పూర్-దుమ్కా-రాంపూర్హాట్ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (177 కి.మీ.)ను మొత్తం సుమారు రూ.3,169 కోట్ల వ్యయంతో డబ్లింగ్ చేసేందుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

విస్తరించిన లైన్ సామర్థ్యం వల్ల రవాణానుసామర్థ్యాన్ని మెరుగుపరిచివిశ్వసనీయమైన సేవలను భారతీయ రైల్వేలు అందిస్తాయిఈ బహుళ-ట్రాకింగ్ ప్రతిపాదన.. కార్యకలాపాలను సులభతరం చేస్తుందిరద్దీని తగ్గిస్తుందిఅలాగే భారతీయ రైల్వేల్లో అత్యంత రద్దీగా ఉండే సెక్షన్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవభారత లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందిఅలాగే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధిస్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించి సమగ్రాభివృద్ధి సాధించడం ద్వారా వారిని ‘ఆత్మ నిర్భర్’‌గా మారుస్తుంది.

సమగ్ర ప్రణాళికభాగస్వాముల సంప్రదింపుల ద్వారా బహుళ విధ అనుసంధానతనురవాణా సామర్థ్యాన్ని విస్తరించడంపై దృష్టి సారించి పీఎం-గతి శక్తి జాతీయ ప్రణాళిక ఆధారంగా ఈ ప్రణాళికలను రూపొందించారుప్రజలువస్తువులుసేవలకు ఎలాంటి అవరోధాలు లేని రవాణా సదుపాయాన్ని ఈ ప్రాజెక్టులు అందిస్తాయి.

బీహార్జార్ఖండ్పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని అయిదు జిల్లాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే 177 కి.మీ మేర ఉన్న వ్యవస్థను విస్తరిస్తుంది.

దేవఘర్ (బాబా బైద్యానాథ్ థామ్), తారాపీఠ్ (శక్తి పీఠంతదితర ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు రైలు అనుసంధానతను ఈ ప్రాజెక్టు సెక్షన్ కల్పిస్తుందితద్వారా దేశం నలుమూలల నుంచి యాత్రికులుపర్యాటకులను ఆకర్షిస్తుంది.

దాదాపుగా 441 గ్రామాలుసుమారుగా 28.72 లక్షల జనాభాకుమూడు ఆకాంక్షాత్మక జిల్లాలు (బంకాగొడ్డాదుమ్కా)కు రవాణా అనుసంధానాన్ని ఈ బహుళ ట్రాక్ ప్రాజెక్టు విస్తరించింది.

బొగ్గుసిమెంట్ఎరువులుఇటుకలురాళ్లు తదితరమైన వస్తువులను తరలించడానికి ఇది ముఖ్యమైన మార్గంసామర్థ్యాన్ని పెంచే పనుల వల్ల అదనంగా 15 ఎంపీటీఏ (ఏడాదికి మిలియన్ టన్నులుపరిమాణంలో సరుకు రవాణా అవుతుందివాతావరణ లక్ష్యాలను సాధించడానికిదేశంలో రవాణా ఖర్చులనుచమురు దిగుమతులనుకార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను (24 కోట్ల కేజీలుతగ్గించడానికి పర్యావరణహితమైనఇంధన సామర్థ్యం కలిగిన రైల్వేలు తోడ్పడతాయిఇది కోటి చెట్లను నాటడంతో సమానం.

 

***


(Release ID: 2165332) Visitor Counter : 2