పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చాటేలా పీహెచ్‌డీసీసీఐ ఆధ్వర్యంలో నేషనల్ యంగ్ షెఫ్ కాంపిటీషన్


ఢిల్లీలో ఘనంగా సన్నాహక కార్యక్రమం.. సంప్రదాయాన్నీ సృజననూ మేళవిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిభావంతులకు ప్రోత్సాహం

Posted On: 16 JUL 2025 10:39AM by PIB Hyderabad

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో కలిసి పీహెచ్‌డీ వాణిజ్యపారిశ్రామిక మండలి (పీహెచ్‌డీసీసీఐఅధికారికంగా నేషనల్ యంగ్ షెఫ్ కాంపిటీషన్ (ఎన్‌వైసీసీ)ను ప్రారంభించిందిన్యూఢిల్లీలోని పీహెచ్‌డీ హౌస్‌లో సన్నాహక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారుదేశవ్యాప్తంగా ఆతిథ్య రంగంలోని చివరి సంవత్సరం విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభావంతులను గుర్తించడంమార్గనిర్దేశం చేయడంతోపాటు వారి ప్రతిభను చాటుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

image.jpeg

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ అదనపు కార్యదర్శిడైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా (ఐఏఎస్మాట్లాడుతూ.. భారత పాక సంప్రదాయాలు ప్రాభవం కోల్పోకుండా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. “సాంస్కృతిక విజ్ఞానంప్రాంతీయ నైపుణ్యాలు మన పాకశాస్త్ర ప్రావీణ్యానికి ప్రాతిపదికలుమనం ఈ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు అత్యుత్తమ వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా భారత పాకశాస్త్ర ఘనతను చాటాలి” అని అన్నారుయువ షెఫ్లు సృజనాత్మకంగా ఆలోచిస్తూఅంతర్జాతీయ వేదికపై ఆత్మవిశ్వాసంతో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని పిలుపునిచ్చారు.

భారత పాకనిపుణుల సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌సీ), పర్యాటకఆతిథ్య నైపుణ్య మండలి (టీహెచ్ఎస్సీ) సంయుక్తంగా ఎన్‌వైసీసీని నిర్వహిస్తున్నాయి. ‘భారత పాకశాస్త్ర ప్రావీణ్యంసంప్రదాయంసృజనాత్మకతల మేళవింపు’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారుదేశవ్యాప్తంగా జోనల్ స్థాయి పోటీలు నిర్వహిస్తారువచ్చే ఏడాది జనవరిలో న్యూఢిల్లీలోని ఐహెచ్ఎంపూసాలో జరిగే ఫైనల్ పోటీతో ఇది ముగుస్తుంది.

జోన్లవారీ షెడ్యూల్:

            •           నార్త్ జోన్: 2025 ఆగష్టు 2025, ఏఐహెచ్ఎంచండీగఢ్

            •           ఈస్ట్ జోన్2025 సెప్టెంబరు 18, ఐహెచ్ఎంకలకత్తా

            •           వెస్ట్ జోన్: 2025 నవంబరుఐహెచ్ఎంముంబయి

            •           సౌత్ జోన్2025 డిసెంబరు 18, ఐహెచ్ఎంకోవలం

ప్రతీ జోనల్ వేదిక వద్ద ప్రధాన పోటీతోపాటు 11, 12వ తరగతి విద్యార్థులకు ఎన్‌వైసీసీలో భాగంగా కెరీర్ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారుఆతిథ్య విద్యలో విద్యార్థుల నమోదును పెంచడంతోపాటు పాకశాస్త్ర సంబంధిత ఉద్యోగావకాశాలను విద్యార్థులకు పరిచయం చేయడం వంటి అంశాలపైనా చర్చిస్తారు.

పీహెచ్డీసీసీఐ పర్యాటక కమిటీ కో చైర్మన్ శ్రీ రాజన్ సెహగల్ మాట్లాడుతూ.. భారతీయ పాకశాస్త్ర ఘనతను చాటేలా పరిశ్రమలువిద్యావ్యవస్థయువతను ఏకం చేసే ‘ఉద్యమంగా ఎన్వైసీసీని అభివర్ణించారు. “ఎన్‌వైసీసీ ఓ పోటీ మాత్రమే కాదుఇదొక సాంస్కృతిక పునరుజ్జీవంవైవిధ్యభరితమైన భారత ఆహార వారసత్వాన్ని కాపాడుకునిఆధునికీకరించే దిశగా పిలుపునిస్తోంది’’ అని ఐఎఫ్‌సీఏ అధ్యక్షుడు డాక్టర్ మన్‌జీత్ గిల్ వ్యాఖ్యానించారు.

image.jpeg

షెఫ్ సుధీర్ సిబల్షెఫ్ అనిల్ గ్రోవర్శ్రీ రాజన్ బహదూర్ (టీహెచ్ఎస్సీ), ప్రొఫెసర్ కమల్ కాంత్ పంత్ (ఐహెచ్ఎంపూసా), శ్రీ అమర్ జిత్ సింగ్ అహుజా (లే మెరిడియన్) కార్యక్రమంలో పాల్గొన్నారుపీహెచ్ డీసీసీఐకి చెందిన శ్రీమతి శాలిని ఎస్ శర్మ పోటీ విధివిధానాలను వివరించారు.

130కి పైగా ఆతిథ్య సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారువీనస్ ఇండస్ట్రీస్నెస్లే ప్రొఫెషనల్వాఘ్ బక్రీ టీ గ్రూప్క్రెమికామెక్ కెయిన్ ఫుడ్స్ తదితర ప్రముఖ సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయివిజేతలకు నగదు బహుమతులుఇంటర్న్ షిప్‌లుఅంతర్జాతీయ గుర్తింపు లభిస్తాయి. ‘బెస్ట్ సస్టెయినబుల్ డిష్’కు ప్రత్యేక అవార్డు అందిస్తారు.  

 

***


(Release ID: 2145132)