రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారతీయ నౌకాదళంలోకి సరికొత్త స్టెల్త్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తమాల్

Posted On: 01 JUL 2025 8:04PM by PIB Hyderabad

ఐఎన్ఎస్ తమాల్ (ఎఫ్ 71)ని మంగళవారం (2025 జులై1రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌లో గల యంతర్ షిప్‌యార్డులో భారతీయ నౌకాదళంలోకి చేర్చుకొన్నారుపశ్చిమ నౌకాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ జస్‌జీత్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారుయుద్ధనౌక ఉత్పత్తికొనుగోళ్ల కంట్రోలరు వైస్ అడ్మిరల్ రాజారాం స్వామినాథన్రష్యా ఫెడరేషన్‌కు చెందిన బాల్టిక్ నౌకాదళ కమాండర్ వైస్ అడ్మిరల్ సర్జీ లిపిన్‌తో పాటు భారతీయరష్యన్ ప్రభుత్వాలనౌకాదళాలపరిశ్రమలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రాజెక్ట్ 1135.6 శ్రేణిలో ఎనిమిదో బహుళ విధులను నెరవేర్చే స్టెల్త్ తరహా యుద్ధనౌకల్లో ఐఎన్ఎస్ తమాల్ ఎనిమిదోదిఅంతేకాదుఇది తుశీల్ శ్రేణిలోని అదనపు ఫాలో-ఆన్ నౌకల్లో రెండోది కూడాతుశీల్ శ్రేణికి చెందిన ఒకటో నౌక (ఐఎన్ఎస్ తుశీల్)ను 2024 డిసెంబరు 9న గౌరవ రక్షణ మంత్రి సమక్షంలో నౌకాదళంలోకి చేర్చుకొన్నారుఇప్పటి వరకు చేర్చుకొన్న ఏడు నౌకలు పశ్చిమ నౌకాదళ కమాండ్‌లో భాగంగా భారతీయ నౌకాదళానికి చెందిన వెస్టర్న్ ఫ్లీట్ ‘ద స్వోర్డ్ ఆర్మ్’లో భాగమయ్యాయిఈ కార్యక్రమం భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ తమాల్ లాంఛన ప్రవేశానికి సూచికగా నిలిచిందిఈ నౌకకు కెప్టెన్ శ్రీధర్ టాటా నాయకత్వం వహిస్తున్నారుఆయన శతఘ్ని ప్రయోగంలోనూక్షిపణి ప్రయోగంలోనూ నిపుణుడు.

నౌకను నడిపే సిబ్బందితో పాటు రష్యాకు చెందిన బాల్టిక్ నావల్ ఫ్లీట్ కు చెందిన సిబ్బంది ఒక చక్కని సంయుక్త గౌరవ వందనంలో పాల్గొనడంతో ఈ కార్యక్రమం మొదలైందియునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎండ్రీ సర్గెయెవిచ్ పుచ్‌కోవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారుభారతీయరష్యన్ నౌకాదళాల మధ్య నౌకావాణిజ్య సంబంధిత సాంకేతిక సహకారాన్ని గురించిఈ సహకారం ఇకమీదటా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను గురించి రష్యన్ ఫెడరేషన్‌కు చెందిన ఫెడరల్ సర్వీస్ ఫర్ టెక్నలాజికల్ కోఆపరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ  మిఖాయిలవ్ బేబిచ్ తన ప్రారంభోపన్యాసంలో వివరించారు.  తరువాత రష్యా ప్రభుత్వంలో సీనియర్ ప్రముఖులతో పాటు సీడబ్ల్యూపీ అండ్ ఏ వైస్ అడ్మిరల్ ఆర్స్వామినాథన్‌ ప్రసంగించారుతమాల్ జలప్రవేశ సన్నివేశాన్ని భారత్రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా ఉందని ఆయన అన్నారుఇది పరస్పర సహకార శక్తినీరెండు దేశాల టెక్నాలజీల ప్రదర్శన సామర్థ్యానికి కూడా ఉదాహరణ అని అన్నారుభారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కాలపరీక్షకు తట్టుకొని నిలిచిందనీగత 65 సంవత్సరాల్లో ఈ సహకారపూర్వక కృషితో నిర్మాణం పూర్తి అయిన 51వ నౌక... తమాల్ అనీ ఆయన వ్యాఖ్యానించారుఈ ప్రాజెక్టులో పనిచేసిన అందరికీముఖ్యంగా షిప్‌యార్డు కార్మికులుభారతీయ ఓఈఎంలురష్యన్ ఓఈఎంలకు వారి శ్రేష్ఠమైన పనితనానికి గానుఅలాగే స్వదేశీ వ్యవస్థలను తిరుగులేని విధంగా అనుసంధానించినందుకు ఆయన అభినందనలు తెలిపారుఈ ప్రాజెక్టు పురోగతికి భారత ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలు కూడా ఎంతో తోడ్పాటును అందించాయి.

దీనికి తరువాయిడెలివరీ యాక్ట్‌పై కమాండింగ్ ఆఫీసర్ డిజిగ్నేట్రష్యా నావల్ డిపార్ట్‌మెంటు డైరెక్టర్ జనరల్ శ్రీ సర్గెయి కుప్రియనావ్ సంతకం చేశారుదీంతో నౌకను భారతీయ నౌకాదళానికి బదలాయించే లాంఛనం పూర్తి అయిందితదనంతర కార్యక్రమంలో భాగంగా రష్యన్ నౌకాదళ ధ్వజాన్ని కిందకు దింపారుకమాండింగ్ ఆఫీసరుకు కమిషనింగ్ వారంటును నావల్ స్టాఫ్ చీఫ్ జారీ చేశారుభారతీయ నౌకాదళం ధ్వజాన్ని ప్రముఖ అతిథుల సమక్షంలో ఆవిష్కరించిజాతీయ గీతాన్ని ఆలపించారుసాంప్రదాయిక వందనం ‘కలర్ గార్డ్’ను నావిక సిబ్బంది సగర్వంగా ప్రదర్శించారుదీంతో పాటేనౌక కమిషనింగ్ ను సూచించే పతాకాన్ని కూడా ఆవిష్కరించారుఇది ఈ నౌక నౌకాదళ సేవలలో భాగం అయిందనడానికి ఒక సంకేతంనౌక విధులను నిర్వర్తిస్తున్నంత కాలంఈ పతాకం రెపరెపలాడుతూనే ఉంటుంది.

ముఖ్య అతిథి వైస్ అడ్మిరల్ సంజయ్ జస్‌జీత్ సింగ్ తన ప్రసంగంలో…భారతీయ నౌకాదళంలో తమాల్ చేరడం దేశ నౌకావాణిజ్య సంబంధిత రక్షణ సామర్థ్యాలుభారత్-రష్యా సహకారం.. వీటిలో ఒక ముఖ్య ఘట్టమని అభివర్ణించారువిశ్వసనీయతకూకౌశలానికీ  పేరుతెచ్చుకొన్న తల్‌వార్తేగ్ఇంకా తుశీల్ శ్రేణికి చెందిన నౌకల్లో ఇప్పుడు తమాల్ కూడా చేరిందని ఆయన వ్యాఖ్యానించారుప్రారంభ కార్యక్రమాన్ని ప్రభావవంతంగానుజ్ఞాపకం పెట్టుకోదగ్గదిగాను నిర్వహించడంలో నావిక సిబ్బందినీయంతర్ షిప్‌యార్డుకూ వారు చేసిన కృషికి గాను సీఇన్‌సీ అభినందనలు తెలిపారుయుద్ధనౌకను నిర్మించడంలో అలుపెరుగని రీతిలో ప్రయత్నాలు చేసినందుకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖఎఫ్ఎస్ఎం‌టీసీరోసోబోరోన్‌ఎక్స్‌పోర్ట్యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్యంతర్ షిప్‌యార్డులతో పాటు యుద్ధనౌక పర్యవేక్షక బృందాన్ని కూడా ఆయన  ప్రశంసించారు. ‘‘ఐఎన్ఎస్ తమాల్ వంటి బహుముఖీన వేదికల చేరికతో భారతీయ నౌకాదళం విస్తృతిప్రతిస్పందనశీలత్వంఎలాంటి క్లిష్ట స్థితుల్లోనైనా దృఢత్వాన్ని కలిగి ఉండే స్వభావం.. ఇవి మరింత వృద్ధి చెందాయి’’ అని ఆయన అన్నారు. ‘‘ఈ నౌక జాతీయ నౌకావాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడంనౌకావాణిజ్య సంబంధ భద్రతను పెంచుకొనే దిశగా మన యుద్ధ నిర్వహణ కార్యకలాపాల స్వరూపంలో బలాన్ని అంతకంతకూ మరింత పెంచుకొనే రీతిలో తన యోగ్యతను నిరూపించుకొంటుందని నేను నమ్ముతున్నాను’’ అని ఆయన అన్నారు.

తమాల్‌కు దీని పూర్తి సంగ్రామ సామర్థ్యాన్ని సంతరించడంలో రష్యన్ నౌకాదళంబాల్టిక్ ఫ్లీట్‌లు పోషించిన పాత్రను ముఖ్య అతిథి ప్రశంసించారుఅలాగే కమిషనింగ్ క్రూ చాటిన అంకితభావాన్నివృత్తినైపుణ్యాన్ని కూడా ఆయన అభినందించారురష్యాలో నిర్మాణం పూర్తయినప్పటికీఈ నౌకలో బ్రహ్మోస్ దూరగామి క్రూయిజ్ క్షిపణిహమ్సా-ఎన్‌జీ సోనార్ సిస్టమ్‌లు సహా 26 శాతం స్వదేశీ విడిభాగాలు ఉన్నాయని ఆయన అన్నారుఈ శ్రేణికి చెందిన తరువాతి రెండు నౌకల నిర్మాణం భారత్‌లో చేపట్టనుండటం పరస్పర బలంఉమ్మడి సామర్థ్యాల సద్వినియోగంతో పాటు సమన్వయపరుచుకొనే అవకాశాలను మరింత పెంచనుందన్నారుభారతీయ నౌకాదళం ఒక విశ్వసనీయసమర్ధపొందికైనభవిష్యత్కాల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేసినఏ సమయంలోనైనాఎక్కడైనాఏ సవాలుకైనా ఎదురొడ్డి నిలవడానికి తయారుగా ఉందని చెబుతూ ఆయన తన ప్రసంగాన్న ముగించారు.  

ముఖ్య అతిథి నౌకలో కలియదిరిగే అవకాశాన్ని కమాండింగ్ ఆఫీసరు కల్పించారుఈ నౌక తన సహ నౌకలకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంతో పాటు వెనుకటి శ్రేణి నౌకలతో పోలిస్తే చేసిన కొత్త మార్పులను గురించి కూడా కమాండింగ్ ఆఫీసరు వివరించారుదీని తరువాత సందర్శకుల పుస్తకంలో సంతకం చేసే ముందు స్మృతి చిహ్నాలను ఇచ్చి పుచ్చుకొన్నారుఅనంతరంఆయన ‘హై టీ’ కార్యక్రమంలో అతిథులతోనూప్రముఖులతోనూ సంభాషించారు.

సముద్రంలో శత్రుభయంకరమైన కదిలే కోటగా ఐఎన్ఎస్ తమాల్‌ను చెప్పుకోవచ్చుదీనిని నాలుగు కోణాలు అంటే వాయుఉపరితలంనీళ్ల కిందఇంకా విద్యుదయస్కాంత పార్శ్వాలన్నింటిలో నౌకాదళ యుద్ధంలో పూర్తి పరిధిలో నీలి జలాల్లో సమర నిర్వహణ కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారునౌకను 2022 ఫిబ్రవరి 22న లాంచ్ చేశారుఇది 2024 నవంబరులో తన తొలి సముద్ర పరీక్షల నిమిత్తం బయలుదేరిందిమరి 2025 జూన్ కల్లా ఓడరేవులోనూసముద్రంలోనూ .. ఈ రెండింటిలో ఫ్యాక్టరీ ట్రయల్స్ స్టేట్ కమిటీ ట్రయల్స్‌తోపాటు ఇతర పరీక్షలను విజయవంతంగా ముగించుకొందిఈ నౌక తన అన్ని రష్యన్ ఆయుధ వ్యవస్థలను ప్రయోగాత్మకంగానుఫలప్రదంగాను పరీక్షించిందిదీనిలో ఉపరితలం నుంచి గాలిలోకి నిట్టనిలువుగా ప్రయోగించినప్పుడు దాడి చేసే తరహా శ్టిల్-1 క్షిపణిఫిరంగిదళ ఆయుధాలతో పాటు నౌకావిధ్వంసక ఆయుధాలు కూడా కలిసి ఉన్నాయి.

తమాల్ రెండు విధులను నిర్వహించగలిగిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులువిస్తృత శ్రేణులను కలిగి ఉండి ఉపరితలం నుంచి గాలిలోకి నిట్టనిలువుగా ప్రయోగించడానికి వీలున్న దాడి చేయగల క్షిపణులుప్రామాణిక 30 ఎంఎం క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్, 100 ఎంఎం మెయిన్ గన్.. వీటితో పాటు చాలా శక్తిమంతమైన ఏఎస్‌డబ్ల్యూ రాకెట్లుఇంకా హెవీవెయిట్ నౌకావిధ్వంసక ఆయుధాలతో కూడా ఈ నౌక పని చేయగలదుతమాల్‌ నిర్మాణంలో భారతీయ టెక్నాలజీతో పాటు రష్యన్ టెక్నాలజీని ఉపయోగించారుదీనిలో అత్యాధునిక కమ్యూనికేషన్ఇంకా నెట్‌వర్క్ కేంద్రీకృత నిర్వహణ సామర్థ్యాలు ఇందులో ఉన్నాయిఉన్నత ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థపురోగామి ఈఓఐఆర్ సిస్టమ్స్ హంగులు కూడా ఈ నౌకకు కళ్లుగానుచెవులుగాను పనిచేస్తాయిఅత్యంత వైవిధ్యభరిత యుద్ధ నిర్వహణ వ్యవస్థ అన్ని ఆయుధాలుసెన్సర్లను ఒక ప్రభావవంత పోరాట యంత్రంలోకి అనుసంధానించారుఈ నౌక ఉన్నతీకరించిన జలాంతర్గామి నిరోధకవాయుజనిత ముందస్తు హెచ్చరిక విధులను నిర్వర్తించే  ‘కామోవ్ 28’ తో పాటు ‘కామోవ్ 31’ రకం హెలికాప్టర్లను కూడా మోసుకుపోగలుగుతుందిఈ సత్తాలన్నింటినీ పోగు చేసుకోవడంతో ఈ రక్షణ నౌక బలం ఇంతలంతలుగా పెరిగిపోయింది.

ఈ నౌకను పరమాణుక్రిమి యుద్ధ సంబంధితరసాయనిక పరమైన సురక్ష కోసం సంక్లిష్ట ఆటోమేటెడ్ వ్యవస్థలతో తీర్చిదిద్దారునష్టాన్ని నివారించే పనులతో పాటు మంటల్ని ఆర్పే పనులను కూడా సురక్షిత పోస్టులలో నుంచి కేంద్రీయ తరహాలో నిర్వహించే సత్తా దీనికి ఉందిదీనిలోని సంక్లిష్ట వ్యవస్థలు తీవ్రంగా గాయపడ్డ సైనికులకు అత్యవసర వైద్యసాయాన్ని అందించడంలో తోడ్పడి మరణాలను కనీస స్థాయికి పరిమితం చేయడంయుద్ధ ప్రభావాన్ని శీఘ్రంగా పునరుద్ధరించడంపోరాడే దక్షతనుప్రాణాలతో మిగిలి ఉండే అవకాశాలను పెంచడంలో సాయపడనున్నాయి.  

ఐఎన్ఎస్ తమాల్‌లో 26 మంది అధికారులతో పాటు దాదాపు 250 మంది నావికులను నియమించారువీరంతా సర్వత్ర సర్వదా విజయం అనే నౌక ఆదర్శవాక్యాన్ని శిరసావహిస్తారుఇది ప్రతి మిషన్‌లోనూ యుద్ధ నిర్వహణ కార్యకలాపాల్లో శ్రేష్ఠత్వానికి చెక్కుచెదరని నిబద్ధతను చాటిచెబుతుందిఅంతేకాకుండాభారతీయ నౌకాదళ ఆదర్శ వాక్యమైన ‘యుద్ధ సన్నద్ధవిశ్వసనీయపొందికైనభావికాలాన్ని దృష్టిలో పెట్టుకొని తయారుగా ఉండేజాతీయ నౌకావాణిజ్య ప్రయోజనాలను ఎప్పుడైనాఎక్కడైనా సరే సంరక్షించడాన్ని’ కూడా నెరవేరుస్తుంది.

ఈ నౌక త్వరలోనే కర్నాటక లోని కార్‌వార్‌లో గల తన హోం పోర్టుకు తొలి యాత్రను మొదలుపెట్టనుందిమార్గమధ్యంలో తమాల్ వేర్వేరు ఓడరేవులకు వెళ్లితన పోరాట సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందిఇది సమర సన్నద్ధ స్థితిలో భారత్‌కు చేరుకొంటుందినౌకావాణిజ్య మార్గాల్లో ఇది తన ఆధిపత్యాన్ని నిరూపించుకోనుంది.

 

**‌*


(Release ID: 2141476)
Read this release in: English , Urdu , Hindi , Bengali