సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్‌లో ‘‘రోడ్ టు గేమ్ జామ్’’లో అగ్ర స్థానంలో నిలిచిన 10 గేమ్‌ల ప్రదర్శన: పోటీలు నిర్వహించిన గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ)
గేమ్ జామ్ మొదటి ఎడిషన్ కు 1650 కళాశాలల నుంచి 5500కు పైగా రిజిస్ట్రేషన్లు
Posted On:
07 APR 2025 5:19PM
|
Location:
PIB Hyderabad
భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో-విజువల్ ఎంటర్‌టైన్మెంట్ సదస్సు (వేవ్స్)లో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ మొదటి సీజన్లో భాగంగా నిర్వహించిన రోడ్ టు గేమ్ జామ్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని కేజెన్ సహకారంతో గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ) నిర్వహించింది. మొదటి పది స్థానాల్లో నిలిచిన గేమ్‌ల వివరాలను ఏప్రిల్ 12న ప్రకటిస్తారు. 2025, మే 1 నుంచి 5 వరకు ముంబయిలో జరిగే వేవ్స్ కార్యక్రమంలో వీటిని ప్రదర్శిస్తారు.
ఈ పోటీలకు దేశవ్యాప్తంగా ఉన్న 453 నగరాలు, పట్టణాలకు చెందిన 1,650 కళాశాలల నుంచి మొత్తం 5,500 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. భారత్ గేమింగ్ రంగంలో యువ ప్రతిభను ప్రోత్సహించే అంశంలో ఈ గేమ్ జామ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. దేశంలో గేమింగ్ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న జీడీఏఐ లక్ష్యానికి అనుగుణంగా ఏఎంఏ, విజ్ఞాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఈ పోటీల్లో పాల్గొనేవారికి నిపుణులు విలువైన సూచనలు అందించారు.
వివిధ దశల వడపోత అనంతరం 175 బృందాలు సమర్పించిన ఆటలను గేమింగ్ రంగంలో నిపుణుల బృందం 10 రోజుల పాటు సమీక్షించింది. వాటి నుంచి ఎంపిక చేసిన 20 ఉత్తమ ఆటలను జాతీయ, అంతర్జాతీయ స్టూడియో ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ప్యానెల్ ప్రస్తుతం సమీక్షిస్తోంది.
‘‘ఎవిరీథింగ్ ఫాల్స్ అపార్ట్’’, ‘‘స్టక్ టుగెదర్’’, ‘‘హ్యాండిల్ విత్ కేర్’’, ‘‘ఇన్విజిబుల్ కనెక్షన్స్’’, ‘‘ది సౌండ్ ఆఫ్ సైలెన్స్’’ అంశాల్లో తమ సృజనాత్మకతకు, సాంకేతిక నైపుణ్యాలకు జీవం పోయాలని గేమ్ జామ్ పోటీదారులకు సవాలు విసిరింది.
తదుపరి దశకు ఎంపికైన 20 బృందాల్లో తుది 10 స్థానాల్లో చోటు దక్కించుకున్న వారిని 2025, ఏప్రిల్ 12న ప్రకటిస్తారు. వారికి వేవ్స్ సదస్సును సందర్శించి తమ ఆటలను గేమింగ్ రంగానికి చెందిన విశిష్ట జ్యూరీ ముందు ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. దీనికోసం అయ్యే ఖర్చులను కూడా వారికి చెల్లిస్తారు.
విజేతలుగా నిలిచినవారికి మొత్తం రూ.7 లక్షల నగదు బహుమతిని అందిస్తారు. దీనిలో మొదటి స్థానంలో సాధించిన వారికి రూ.4 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.2.5 లక్షలు, మూడో స్థానం దక్కించుకున్న వారికి రూ.1.5 లక్షలు లభిస్తాయి.
గేమ్ జామ్ గురించి జీడీఏఐ అధ్యక్షుడు శ్రీధర్ ముప్పిడి మాట్లాడుతూ.. ‘‘రోడ్ టు గేమ్ జామ్ కేవలం పోటీలు నిర్వహించడానికే పరిమితం కాలేదు. దేశ గేమింగ్ రంగంలో యువ డెవలపర్లు తమకున్న కెరీర్ అవకాశాలను అన్వేషించడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అవసరమైన వేదికగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై భారత గేమింగ్ రంగం వృద్ధిని కొనసాగించేలా క్రియేటర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే వ్యవస్థను నిర్మించేందుకు జీడీఏఐ కట్టుబడి ఉంది’’.
భారత్‌లో గేమింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ రంగంలో ఆవిష్కరణలు, సృజనాత్మకతకు అంతర్జాతీయ కేంద్రంగా మన స్థానాన్ని బలోపేతం చేయడంలో ఈ తరహా కార్యక్రమాలకు కీలకపాత్ర పోషిస్తాయి.
షార్ట్‌లిస్ట్ అయిన 20 ఉత్తమ బృందాల వివరాలు:
గేమ్ పేరు
|
బృందం పేరు
|
హార్ట్ హాట్ హావక్
|
నోడ్ 2డీ
|
యాంకర్డ్
|
ప్లేబుల్ గేమ్స్
|
హోప్స్ అవుట్
|
ది రీపర్స్ ఎగ్జిక్యూషన్
|
అబాండన్డ్ హాస్పిటల్ – ది సౌండ్ ఆఫ్ సైలెన్స్
|
ఆశ్‌దేవ్
|
ఎక్స్‌పెడిషన్ ఆఫ్ ది ఫర్గాటెన్
|
ఫ్యూజన్ ఆర్ట్స్
|
సైలెన్స్ కిల్స్
|
అబ్సర్డ్ సాఫ్ట్‌వేర్
|
పాప్ టు ది టాప్
|
|
ది బర్డెన్ ఆఫ్ బీయింగ్ గిఫ్టెడ్
|
అద్వైత్ ఆర్
|
నో లైట్స్ ఇన్ ఇన్ఫెర్నో
|
కోడ్ కెలవర్
|
గాబ్లిన్స్ కాల్
|
మృదుల్ జోషి
|
ఎన్‌ట్విన్డ్: రీఇమాజిన్డ్
|
పార్కిన్స్
|
మై ఇన్నర్ డెమోన్స్
|
లెమన్‌సూప్
|
నో టైమ్ టు క్రాల్
|
దట్ టీమ్
|
ఫ్రెజైల్ రెలిక్
|
బైట్ బిల్డర్స్
|
Serum XIII సీరమ్ XIII
|
సిద్ధార్థ పటేల్
|
మను స్కిప్స్ స్కూల్
|
ఇన్ఫీమీస్
|
2 మినిట్స్ టు డూమ్
|
సుశాంత్ సూదన్
|
కేక్_పుల్లీ
|
క్యూట్ పొటాటో
|
డెలివర్ హౌవెవర్
|
టోర్నడో గేమ్ దేవ్
|
అనంత్ ఎక్స్‌ప్రెస్
|
రెనిగేడ్స్
|

జీడీఏఐ గురించి:
భారత్‌లో గేమింగ్ రంగ వృద్ధిని ప్రోత్సహించేందుకే అంకితమైన సంస్థ గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ). అవగాహన, పరిశ్రమ సహకారం, వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా డెవలపర్లను జీడీఏఐ ప్రోత్సహిస్తోంది. అలాగే అంతర్జాతీయ గేమింగ్ మార్కెట్లో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తూ, ఈ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.
ప్రసార మాధ్యమాలు, వినోదం (ఎం అండ్ ఈ) రంగంలో ఒక ముఖ్య కార్యక్రమం అయిన మొట్టమొదటి ప్రపంచ శ్రవణ, దృశ్య, వినోద శిఖరాగ్ర సదస్సు(‘వేవ్స్’)ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెల 1 నుంచి 4 తేదీల మధ్య కాలంలో మహారాష్ట్రలోని ముంబయిలో నిర్వహించనుంది.
మీరు పరిశ్రమలో పనిచేస్తున్న వృత్తినిపుణుడు లేక వృత్తినిపుణురాలు గాని, లేదా ఆవిష్కర్త గాని అయితే, ఎం అండ్ ఈ రంగంతో మీరు జతపడి, మీ సహకారాన్ని అందించడానికి, మీ నవకల్పనను ఆవిష్కరించడానికి, ఎం అండ్ ఈ రంగానికి మీ వంతు తోడ్పాటును అందించడానికి మీకు ఒక ప్రపంచ స్థాయి వేదికను ఈ శిఖరాగ్ర సదస్సు అందుబాటులోకి తీసుకువస్తోంది.
భారత్ సృజనాత్మక శక్తిని ఇంతలంతలు చేస్తూ కంటెంట్ క్రియేషన్, మేధాసంపత్తి, సాంకేతిక నవకల్పనలకు ఒక కూడలిగా ఇండియాకున్న స్థానాన్ని బలపరచడానికి ‘వేవ్స్’ సన్నద్ధమవుతోంది. ఈ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రసారం, ముద్రణ మాధ్యమాలు, టెలివిజన్, రేడియో, చలనచిత్రాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్దం..సంగీతం, ప్రకటనల రంగం, డిజిటల్ మాధ్యమాలు, సామాజిక మాధ్యమ వేదికలు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)లతోపాటు ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్).. ఈ పరిశ్రమలపైన, రంగాలపైన ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.
మీరేమైనా ప్రశ్నలను అడగదలచుకొన్నారా? అయితే సమాధానాలు ఇక్కడ here
తాజా ప్రకటనలను ఎప్పటికప్పుడు తెలుసుకోండిక్కడ: PIB Team WAVES
రండి, మాతో కలసి నడవండి. వేవ్స్‌లో పాల్గొనడానికి నమోదు చేసుకొండి: now
జీడీఏఐ గురించి మరిన్ని వివరాలకు, సంప్రదించండి: మచ్చయ్య కలెంగడ- +919986431762
Release ID:
(Release ID: 2119802)
| Visitor Counter:
53