ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు కరవు భత్యం పెంపు జనవరి 1 నుంచి వర్తింపు మంత్రిమండలి ఆమోదం
• 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం
• 2 శాతం పెంపుతో ఖజానాపై ఏడాదికి రూ.6614.04 కోట్ల భారం
Posted On:
28 MAR 2025 4:16PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛన్‌దారులకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ను పెంచుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఇది మూల వేతనం/పింఛన్‌లో 53 శాతంగా ఉన్న ప్రస్తుత రేటు కన్నా 2 శాతం అదనంగా ఇస్తారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుంది. పెరిగిన ధరల భారం నుంచి ఉపశమనాన్ని కలగజేయాలనేది ఈ నిర్ణయంలోని ఉద్దేశం.
డీఏ (డియర్‌నెస్ అలవెన్స్), డీఆర్.. పెంచినందువల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి సంవత్సరం రూ. 6,614.04 కోట్ల మేరకు భారం పడుతుంది. ఈ నిర్ణయంతో, కేంద్ర ప్రభుత్వంలోని సుమారు 48.66 లక్షల మంది ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పించనుదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఏడో వేతన సంఘం ఆమోదించిన సూత్రానికి అనుగుణంగా ఈ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు.
***
(Release ID: 2116270)
Visitor Counter : 44