వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజీలను అభివృద్ధిపరిచేందుకు రూ. 28,602 కోట్ల వ్యయంతో చేపట్టబోయే 12 కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
Posted On:
06 DEC 2024 5:05PM by PIB Hyderabad
ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజీలను అభివృద్ధిపరిచేందుకు, (భూసేకరణ ఖర్చులు సహా) రూ. 28,602 కోట్ల వ్యయంతో చేపట్టబోయే 12 కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టు 28న ఆమోదం తెలిపింది. అంతర్గత ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగాల అభివృద్ధి కోసం పారిశ్రామికవాడల సంస్థాగత ఆర్థిక నిబంధనలననుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సమకూర్చనుండగా, జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి, కార్యాచరణ నిధి (ఎన్ఐసీడీఐటీ) సహకారంతో కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూర్చనుంది. ఈపీసీ కాంట్రాక్టర్ల నియామకం అనంతరం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు 36 నుంచి 48 మాసాల్లో పూర్తవుతాయి.
జాతీయ పారిశ్రామిక కారిడార్ కార్యక్రమంలో భాగమైన ప్రాజెక్టులకు సంబంధించి వివిధ దశల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
క్రమ సంఖ్య
|
కారిడార్
|
పేరు
|
ప్రగతి
|
1
|
డీఎంఐసీ : ఢిల్లీ ముంబాయి ఇండస్ట్రియల్ కారిడార్
|
1. ఢోలెరా ప్రత్యేక పెట్టుబడుల ప్రాంతం (డీఎస్ఐఆర్), గుజరాత్
|
ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింది ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి
|
2. షేంద్ర బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతం (ఎస్బీఐఏ), మహారాష్ట్ర
|
3. సమీకృత పారిశ్రామిక టౌన్షిప్-గ్రేటర్ నోయిడా (ఐఐటీ-జీఎన్), ఉత్తరప్రదేశ్
|
4. సమీకృత పారిశ్రామిక టౌన్షిప్-విక్రమ్ ఉద్యోగ్ పురి (ఐఐటీ-వీయూఎల్), మధ్యప్రదేశ్
|
5. సమీకృత మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్- నంగల్ చౌధరి, హరియాణా
|
ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి
|
6. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్, మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ హబ్ (ఎంఎంఎల్ హెచ్, ఎంఎంటీహెచ్), ఉత్తరప్రదేశ్
|
7. దిఘీ పోర్ట్ పారిశ్రామిక ప్రాంతం, మహారాష్ట్ర
|
భారత ప్రభుత్వం 2024 ఆగస్టు 28న ఆమోదించిన ప్రాజెక్టులు
|
8. జోధ్ పూర్ పాలీ మార్వార్ పారిశ్రామిక ప్రాంతం, రాజస్థాన్
|
2
|
సీబీఐసీ: చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్
|
9. కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం, ఆంధ్ర ప్రదేశ్
|
ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి
|
10. తూమకూరు పారిశ్రామిక ప్రాంతం, కర్ణాటక
|
3
|
కోయంబత్తూరు మార్గం ద్వారా కొచ్చి వరకూ సీబీఐసీ విస్తరణ
|
11. పాలక్కాడ్ పారిశ్రామిక ప్రాంతం, కేరళ
|
భారత ప్రభుత్వం 2024 ఆగస్టు 28న ఆమోదించిన ప్రాజెక్టులు
|
4
|
ఏకేఐసీ: అమృత్ సర్ కలకత్తా పారిశ్రామిక కారిడార్
|
12. ఐఎంసీ ఖుర్పియా ఫారం, ఉత్తరాఖండ్
|
13. ఐఎంసీ రాజ్పురా పాటియాలా, పంజాబ్
|
14. ఐఎంసీ హిస్సార్, హరియాణా
|
15. ఐఎంసీ ఆగ్రా, ఉత్తరప్రదేశ్
|
16. ఐఎంసీ ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్
|
17. ఐఎంసీ గయ, బీహార్
|
5
|
హెచ్ఎన్ఐసీ: హైదారాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్
|
18. జహీరాబాద్ ఫేజ్-1, తెలంగాణా
|
6
|
హెచ్ బీఐసీ: హైదారాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్
|
19. ఓర్వకల్ పారిశ్రామిక ప్రాంతం, ఆంధ్ర ప్రదేశ్
|
7
|
వీసీఐసీ: వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్
|
20. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతం, ఆంధ్ర ప్రదేశ్
|
జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగమయ్యే ప్రతి పారిశ్రామిక నగరం, ప్రాంతం లేదా కేంద్రాన్ని స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) నిర్వహిస్తుంది. ఎస్పీవీల్లో ప్రైవేటు రంగానికి ప్రాతినిధ్యం ఉండవచ్చు, ఐతే ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. యూజర్ ఫీజు ద్వారా పెట్టుబడులు, ధరల నిర్ధారణ వంటి నూతన మార్గాల్లో మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడుల సమీకరణను చేపట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం) విధానాల ద్వారా పారిశ్రామిక స్మార్ట్ సిటీల అభివృద్ధిని చేపట్టే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అంతే కాక, అవసరాన్ని బట్టి ద్వైపాక్షిక, బహుళపక్ష పెట్టుబడులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సమీకరించుకోగలుగుతాయి.
వివిధ పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు ముఖ్యమైన రంగాల నిర్వచనం వేర్వేరుగా ఉండవచ్చు. ఇందుకోసం మార్కెట్ డిమాండ్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. హెవీ ఇంజినీరింగ్, వాహన రంగం, అనుబంధ విడిభాగాల పరిశ్రమలు, సాధారణ ఉత్పాదన రంగం, ఫార్మా, బయోటెక్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఐటీఈఎస్, వ్యవసాయ, ఆహారశుద్ధి, కంప్యూటర్, ఎలక్ట్రానిక్, ఆప్టికల్ ఉత్పత్తులు, ఏరోస్పేస్, రబ్బర్, ప్లాస్టిక్ పరిశ్రమలు, లోహ ఉత్పత్తులు, ఆర్ అండ్ డీ, ఐసీటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, నానో టెక్నాలజీ, ఆప్టో ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలని స్మార్ట్ సిటీల అభివృద్ధిలో భాగమయ్యేందుకు గుర్తించారు.
కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపర్చారు.
****
(Release ID: 2081790)
Visitor Counter : 50