కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీమతి సుమితా దావ్రా, సెక్రటరీ - కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం వారు ఈ‌ఎస్‌ఐ హాస్పిటల్ గుణదల, విజయవాడ మరియు ఈ‌ఎస్‌ఐ డిస్పెన్సరీ - ఆటోనగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో రోగులను సందర్శించి మరియు వారితో సంభాషించారు


సెక్రటరీ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ‌ఎస్‌ఐ పథకం పురోగతిని సమీక్షించి, ధానితో పాటు ఈ‌ఎస్‌ఐ‌సి మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు.

సెక్రటరీ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఈ‌ఎస్‌ఐ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని మరియు నివారణ - ఆరోగ్య సంరక్షణ కోసం ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించాలని ఆదేశించారు.

Posted On: 02 DEC 2024 5:27PM by PIB Hyderabad

ప్రభుత్వ కార్మిక & ఉపాధి కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా గారి అధ్యక్షతన సమీక్షా సమావేశం  ఈ‌ఎస్‌ఐ‌సి ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో 02.12.2024 న జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక రాజ్య భీమా  (ESI) స్కీమ్ వృద్ధి గణనీయంగా ఉందని, ఈ పథకం తన కవరేజీని విస్తృత శ్రేణి పరిశ్రమలు మరియు రంగాలను చేర్చడానికి విస్తరించిందని, అవసరమైన ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్థిక రక్షణ తో ఎక్కువ మంది కార్మికులు ప్రయోజనం పొందేలా చూస్తారని కార్యదర్శి తెలిపారు. ఈ‌ఎస్‌ఐ ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలతో సహా వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సమర్థవంతమైన సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగించుటతో, శ్రామిక శక్తికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు సేవలు గణనీయంగా మెరుగు పడ్డాయని తెలియచేసారు.

ఈ సందర్భంలో భారత ప్రభుత్వ ప్రయత్నాలతో కార్మిక రాజ్య భీమా  (ESI) పథకం 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 668 జిల్లాలకు చేరుకుంది, సుమారు 3.72 కోట్ల మంది బీమా కార్మికుల సామాజిక భద్రత మరియు వైద్య సంరక్షణ అవసరాలను తీర్చడం మరియు 14.43 కోట్ల మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తుంధి. ఇంకా, ప్రభుత్వం రెండు అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాలైన కార్మిక రాజ్య భీమా   ESIC మరియు ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) యొక్క కలయికపై పని చేస్తోంది, తద్వారా ఈ‌ఎస్‌ఐ ESI పథకం యొక్క విస్తరణను మిగిలిన అమలు కాని జిల్లాలకు AB-PMJAY ఎంప్యానెల్ నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా లబ్ధిదారులకు వైద్య సంరక్షణ అందించేందుకు కృషి చేస్తుంధి.

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని గుణదలలో ఈ‌ఎస్‌ఐ ఆసుపత్రిని సందర్శించిన సెక్రటరీ, అక్కడ రోగులతో మమేకమై ఆసుపత్రి సమర్ధవంతంగా పని చేస్తున్నందుకు ప్రశంసించారు. లబ్దిదారులకు అందించే నాణ్యమైన వైద్య సేవలను ఆమె ప్రశంసించారు మరియు రోగులకు ఆరోగ్యం కోసం వైద్య సేవల కొరకు అంకితభావంతో ఉన్న ఆసుపత్రి సిబ్బందిని ఆమె ప్రశంసించారు. విజయవాడలోని ఆటోనగర్‌లోని ఇఎస్‌ఐ డిస్పెన్సరీని కూడా సందర్శించిన ఆమె, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, రవాణా పరిశ్రమ, పికిల్ పరిశ్రమ మరియు కొరియర్ సేవలలో కార్మికుల సామాజిక భద్రతా అవసరాలను ఈ‌ఎస్‌ఐ పథకం సమర్థవంతంగా పరిష్కరిస్తోందని ఆమె గమనించారు. విభిన్న శ్రేణి కార్మికులకు ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్థిక రక్షణను విస్తరించడంలో, వారి శ్రేయస్సు మరియు భద్రతకు భరోసా కల్పించడంలో పథకం యొక్క కీలక పాత్రను ఆమె తెలిపారు.

కార్మికులకు సకాలంలో సేవలు అందేలా మరియు పథకం కింద పెరుగుతున్న కార్మికులకు వైద్య సంరక్షణ డిమాండ్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఈ‌ఎస్‌ఐ ESI మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను షెడ్యూల్ చేసిన గడువులోపు పూర్తి చేయాలని కార్యదర్శి ఆదేశించారు. శ్రామికశక్తిలో ESI పథకం ప్రయోజనాల గురించి గరిష్ట అవగాహన కల్పించేందుకు నిరంతర ఔట్రీచ్ కార్యక్రమాల అవసరాన్ని కూడా ఆమె తెలిపారు. అదనంగా, ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడానికి మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల శ్రేయస్సును ప్రోత్సహించడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీ శిబిరాలను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను ఆమె ప్రత్యేకముగా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ESI పథకం

ఈఎస్‌ఐ పథకం మొదటగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కేంద్రాలలో 01.05.1955 నుండి అమలు చేయబడుతున్నది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లోని 679 మండలాల్లో ESI పథకం అమలులో ఉంది. ESI పథకం యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్‌ను 01 ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నం మరియు తిరుపతిలో ఒక్కొక్కటి 02 ఉప-ప్రాంతీయ కార్యాలయాలు, 19 బ్రాంచ్ కార్యాలయాలు మరియు 4 DCBOలు చూస్తున్నాయి. ESI పథకం, ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 54 లక్షల మంది లబ్ధిదారుల సామాజిక భద్రత అవసరాలను తీరుస్తోంది. 2023-24 సంవత్సరంలో మొత్తం 1,53,793 పేమెంట్స్తో  ఈఎస్‌ఐ లబ్ధిదారులకు రూ.80 కోట్ల చెల్లింపులు జరిగాయి. 2024-25 సంవత్సరంలో ఈఎస్‌ఐ కార్పొరేషన్ ద్వారా దాదాపు 97,787 మంది కార్మికులకు వివిధ ప్రయోజనాల కింద రూ.56 కోట్లు ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయి.

***


(Release ID: 2079788) Visitor Counter : 102


Read this release in: English