వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024-25 నుంచి 2030-31 కాలానికి వంటనూనెలు,


నూనె గింజలపై జాతీయ మిషన్‌ (ఎన్ఎంఈవో-ఆయిల్ సీడ్స్) ఏర్పాటుకు ఆమోదం తెలిపిన క్యాబినెట్

ఏడేళ్లలో నూనెగింజల ఉత్పత్తిలో భారత్ స్వావలంబనే మిషన్ లక్ష్యం

నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచేందుకు

వాటాదారులతో రాష్ట్రాల సమన్వయానికి వీలుగా సాథీ పోర్టల్

Posted On: 03 OCT 2024 8:14PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వంటనూనెలు-నూనెగింజలపై జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందిఈ మిషన్ ద్వారా దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు వంటనూనెల ఉత్పత్తిలో భారత్ స్వావలంబన సాధించేలా చేసే (ఆత్మనిర్భర్ భారత్లక్ష్యంతో ఈ మిషన్ ను రూపొందించారురూ.10,103 కోట్ల వ్యయంతో 2024-25 నుంచి 2030-31వరకు ఏడేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

తాజాగా ఆమోదం పొందిన ఎన్ఎమ్ఈఓనూనెగింజల కార్యక్రమం ఆవవేరుశనగసోయాబీన్పొద్దుతిరుగుడునువ్వులు వంటి నూనె గింజల ఉత్పత్తిని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందిఅలాగే పత్తిగింజలురైస్ బ్రాన్వృక్ష సంబంధ నూనెల వంటి ద్వితీయ వ్యవసాయ వనరుల నుంచి నూనెల సేకరణసంగ్రహణ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇది పనిచేస్తుందిప్రధాన నూనెగింజల ఉత్పత్తిని (2022-23లో) 39 మిలియన్ టన్నుల నుంచి 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచే లక్ష్యంతో ఈ మిషన్ పనిచేస్తుందిఎన్ఎంఈవో-ఓపీ (ఆయిల్ పామ్)తో కలిసిదేశీయ వంటనూనెల ఉత్పత్తిని 2030-31 నాటికి 25.45 మిలియన్ టన్నులకు పెంచడం ద్వారా 72% దేశీయ అవసరాలను తీర్చడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుందిఅధిక దిగుబడినిచ్చే అధిక నూనె కలిగిన వంగడాలను ఉపయోగించడంవరిసాగు చేయలేని భూముల్లో నూనెగింజల సాగును విస్తరించడంఅంతరపంటల సాగును ప్రోత్సహించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చుదీని కోసం జన్యు మార్పిడి వంటి అత్యాధునిక గ్లోబల్ సాంకేతికతలతో అభివృద్ధి చేసిన అత్యంత నాణ్యమైన విత్తనాలను మిషన్ ఉపయోగించుకుంటుంది.

నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచడం కోసం ‘సీడ్ అథెంటికేషన్ట్రేసబిలిటీ హోలిస్టిక్ ఇన్వెంటరీ (సాథీ)’ ద్వారా ఈ మిషన్ సంవత్సరాల ఆన్‌లైన్ విత్తన ప్రణాళికను ప్రవేశపెడుతుందిసహకార సంస్థలురైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు), ప్రభుత్వప్రైవేట్ విత్తన కార్పొరేషన్లు సహా విత్తనోత్పత్తి సంస్థలతో రాష్ట్రాలు ముందస్తు ఒప్పందాలు చేసుకోవడానికి ఇది వీలుకల్పిస్తుందివిత్తనోత్పత్తి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కొత్తగా 65 విత్తన కేంద్రాలు, 50 విత్తన నిల్వ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

వీటికి అదనంగాఏడాదికి 10 లక్షలకు పైగా హెక్టార్ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తూ 347 జిల్లాల వ్యాప్తంగా 600లకు పైగా వాల్యూ చైన్ క్లస్టర్స్ ఏర్పాటు చేయనున్నారుఎఫ్‌పీఓలుసహకార సంఘాలుప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల వంటి వాల్యూ చైన్ భాగస్వాములు ఈ క్లస్టర్ల నిర్వహణ చూసుకోనున్నారుఈ క్లస్టర్ల రైతులకు అత్యంత నాణ్యమైన విత్తనాలుఉత్తమ వ్యవసాయ పద్ధతుల (జీఏపీ)పై శిక్షణవాతావరణతెగులు నిర్వహణ పద్ధతుల గురించి సూచనలు అందుబాటులో ఉంటాయి.

అంతరపంటల సాగునుపంటల్లో వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ వరిబంగాళాదుంప సాగుకు వీలులేని మరో 40 లక్షల హెక్టార్లలో అదనంగా నూనెగింజల సాగును విస్తరించడానికి మిషన్ ప్రయత్నిస్తోంది.

పత్తి గింజలురైస్ బ్రాన్మొక్కజొన్నవృక్ష సంబంధ నూనెలు (టీబీఓలువంటి మూలాల నుంచి సేకరణను పెంపొందించడానికిపంట అనంతర యూనిట్లను స్థాపించడానికిఅప్‌గ్రేడ్ చేయడానికి ఎఫ్‌పీఓలుసహకార సంస్థలుపారిశ్రామికవేత్తలకు సహాయం అందించనున్నారు.   

 

ఇంకాసమాచారంఅవగాహనకమ్యూనికేషన్ (ఐఈసీప్రచారం ద్వారా వంట నూనెల కోసం సిఫార్సు చేసే ఆహారపరమైన మార్గదర్శకాల గురించి అవగాహనను ఇది ప్రోత్సహిస్తుంది.

 

దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంవంటనూనెల విషయంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం (స్వావలంబనసాధించడం తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంఅలాగే రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేయడం లక్ష్యంగా మిషన్ పనిచేస్తుందిఈ మిషన్ ద్వారా తక్కువ నీటి వినియోగంమెరుగైన భూసారంబీడు భూములను ఉత్పాదకంగా ఉపయోగించడం వంటి ముఖ్యమైన పర్యావరణ ప్రయోజనాలను కూడా ఉంటాయి.  

నేపథ్యం:

దేశీయంగా వంటనూనెల అవసరాల్లో 57%గా ఉన్న దిగుమతులపై దేశం ఎక్కువగా ఆధారపడి ఉందిదీనిని పరిష్కరిస్తూ స్వావలంబనను ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి పలు చర్యలు చేపట్టిందిదీనిలో భాగంగా 2021లో ఆయిల్ పామ్ సాగును పెంచడం కోసం రూ.11,040 కోట్ల వ్యయంతో వంటనూనెలు-ఆయిల్ పామ్ (ఎన్ఈఎమ్ఓ-ఓపీజాతీయ మిషన్‌ను ప్రారంభించింది.

దీనికి అదనంగా ముఖ్యమైన నూనె గింజలను సాగు చేసే రైతులకు లాభదాయక ఆదాయం అందించేందుకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పీ)ని ప్రభుత్వం పెంచిందిప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆశాకొనసాగింపు ద్వారా రైతులకు ధర మద్దతు పథకంధర లోపం చెల్లింపు పథకం ద్వారా మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నారుఅంతేకాకుండాచౌక దిగుమతుల నుంచి దేశీయ ఉత్పత్తిదారులను రక్షించడానికిస్థానికంగా సాగును ప్రోత్సహించడానికి వంట నూనెలపై 20% దిగుమతి సుంకం విధించారు.

 

***


(Release ID: 2061755) Visitor Counter : 109