రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స్వల్ప శ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో

Posted On: 12 SEP 2024 7:56PM by PIB Hyderabad



డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), భారత నౌకాదళం సంయుక్తంగా సెప్టెంబర్ 12న ఒడిశా తీరంలోని చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్-ఎస్ఆర్ఎస్ఎఎం) ని  విజయవంతంగా పరీక్షించింది. ఈ భూ ఆధారిత వర్టికల్ లాంచర్, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగిస్తారు. ఈ క్షిపణి తక్కువ ఎత్తులో ఎగురుతూ, హైస్పీడ్ ఏరియల్ లక్ష్యాన్ని చేధిస్తుంది. చాందీపూర్ ఐటీఆర్‌లో పరీక్షించిన ఈ క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది.

ప్రాక్సిమిటీ ఫ్యూజ్, సీకర్‌ సహా ఆయుధ వ్యవస్థలో పలు నవీకరించిన అంశాలను ఈ క్షిపణి పరీక్షలో పరిశీలించారు. ఐటీఆర్ చాందీపూర్ లో నెలకొల్పిన రాడార్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి వివిధ పరికరాల ద్వారా క్షిపణి వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి  ధ్రువీకరించారు.

డీఆర్డీవో, భారత నావికాదళానికి చెందిన బృందాలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ప్రశంసించారు. ఈ పరీక్ష వీఎల్-ఎస్ఆర్ఎస్ఎఎం ఆయుధ వ్యవస్థ విశ్వసనీయత, ప్రభావాన్ని పునరుద్ఘాటిస్తుందని పేర్కొన్నారు.

డీఆర్డీవో చైర్మన్, రక్షణ పరిశోధనాభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ సమీర్ వి కామత్ ఈ పరీక్షలో పాలుపంచుకున్న అధికారులను అభినందించారు. ఈ వ్యవస్థ భారత నావికాదళ కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని, శక్తిని రెట్టింపు పనిచేస్తుందని తెలిపారు.

 

****



(Release ID: 2054446) Visitor Counter : 44