భారత పోటీ ప్రోత్సాహక సంఘం
మునిసిపల్ ఘన వ్యర్థాల వ్యాపారం, వ్యర్థాల నుండి ఇంధన ఉత్పత్తి వ్యాపారాలను రాంకీ సస్టైనబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కువిక్రయం. తద్వారా రీ సస్టైనబిలిటీ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్‌ల ప్రస్తుత వ్యాపార పునర్నిర్మాణానికి సిసిఐ ఆమోదం
Posted On:
07 AUG 2024 6:49PM by PIB Hyderabad
మునిసిపల్ ఘన వ్యర్థాల (ఎమ్ఎస్‌డబ్ల్యు) వ్యాపారం, వ్యర్థాల నుండి ఇంధనం ఉత్పత్తి చేయు (డబ్ల్యుటిఇ) వ్యాపారాలను (విక్రయించబడిన వ్యాపారాలు) కొత్తగా చేరిన రాంకీ సస్టెయినెబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎస్‌పిఎల్) సంస్థకు విక్రయించడం ద్వారా రీ సస్టెయినెబిలిటీ లిమిటెడ్ (ఆర్ఇఎస్ఎల్), దాని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్‌ల యొక్క ప్రస్తుత వ్యాపార పునర్నిర్మాణానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత కొత్త సంస్థలో (a) ఆర్ఇఎస్ఎల్; (బి) ముంబయి వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎమ్‌డబ్ల్యుఎమ్ఎల్); (సి) ఆర్ఎస్ఎస్‌పిఎల్; (d) మెట్రోపొలిస్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ పిటిఇ. లిమిటెడ్ (మెట్రోపొలిస్); (ఇ) శ్రీ. ఎ. ఇషాన్ (ఇషాన్), శ్రీ. ఎ. అయోధ్య రామి రెడ్డి, ఆర్‌కె వెంచర్స్, శ్రీమతి. ఎ. వీరరాఘవమ్మ మరియు శ్రీ. ఎ. శరణ్ (వీళ్ళు వ్యవస్థాపక సభ్యులు) భాగస్వాములుగా ఉంటాయి.
ప్రతిపాదిత విలీనం తర్వాత, ఆర్ఎస్ఎస్‌పిఎల్ షేర్ హోల్డింగ్ వరుసగా మెట్రోపొలిస్, వ్యవస్థాపక బృందాల వాటాల పరంగా ఆర్ఇఎస్ఎల్ ప్రస్తుత షేర్ హోల్డింగ్ నమూనాను తెలియజేస్తుంది. ఆర్ఇఎస్ఎల్ (చేతిలో ఉన్న వ్యాపారాలు) వాటిలో కొన్ని హక్కులను వ్యవస్థాపక బృందం వదులుకుంటుంది అలాగే ఆర్ఎస్ఎస్‌పిఎల్ ఆధ్వర్యంలోని విక్రయించిన వ్యాపారాలలో మెట్రోపొలిస్ కొన్ని హక్కులను కల్పిస్తుంది.
ఆర్ఇఎస్ఎల్: ఆర్ఇఎస్ఎల్ దేశంలో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ, మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, బయో-మెడికల్ వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల నుండి ఇంధనం ఉత్పత్తి చేయు ప్లాంట్‌ల నిర్వహణ, రీసైక్లింగ్ అలాగే ఇతర సంబంధిత పర్యావరణ వ్యాపారాలను నిర్వహిస్తుంది.
ఎమ్‌డబ్ల్యుఎమ్ఎల్: ఎమ్‌డబ్ల్యుఎమ్ఎల్ పూర్తిగా ఆర్ఇఎస్ఎల్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. ఇది ఆర్ఇఎస్ఎల్‌లో విలీనం అవుతుంది కాబట్టి స్వతంత్ర సంస్థగా ఉనికిలో ఉండదు. ఇది భారతదేశంలో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ వ్యాపారాలను నిర్వహిస్తుంది.
ఆర్ఎస్ఎస్‌పిఎల్: ఆర్ఎస్ఎస్‌పిఎల్ కొత్తగా చేరిన కంపెనీ, ఇది ప్రస్తుతం భారతదేశంలో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం లేదు. అయితే, ప్రతిపాదిత విలీనం తర్వాత, ఆర్ఇఎస్ఎల్ విక్రయించిన వ్యాపారాలను ఆర్ఎస్ఎస్‌పిఎల్చేతికి వస్తాయి. అలాగే దీని షేర్ హోల్డింగ్ లో ఆర్ఇఎస్ఎల్ వాటాలను కలిగి ఉంటుంది.
మెట్రోపొలిస్: మెట్రోపొలిస్ అనేది సింగపూర్ చట్టాల ప్రకారం ప్రారంభించిన ఒక పెట్టుబడి సంస్థ. ఇది సెబీ (ఫారిన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్) నిబంధనలు, 2000 ప్రకారం ఫారిన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్‌గా నమోదైంది. మెట్రోపొలిస్ పెట్టుబడి నిధులు, వాహనాలు అలాగే కెకెఆర్ & కంపెనీ. Inc. (కెకెఆర్ & కంపెనీ మరియు దాని అనుబంధ సంస్థలతో కలిసి, “కెకెఆర్”) యొక్క వివిధ అనుబంధ సంస్థల సూచనలు, నిర్వహణలో గల ఖాతాల ద్వారా పరోక్ష సంపూర్ణ యాజమాన్య సంస్థ. కెకెఆర్ అనేది ప్రత్యామ్నాయ ఆస్తి నిర్వహణతో పాటు కాపిటల్ మార్కెట్స్, బీమా పరిష్కారాలను అందించే ప్రపంచస్థాయి పెట్టుబడి సంస్థ. కెకెఆర్ ప్రైవేట్ ఈక్విటీ, క్రెడిట్, రియల్ అసెట్‌లలో పెట్టుబడి పెట్టేందుకు నిధులను అందిస్తుంది. అలాగే ఇది హెడ్జ్ ఫండ్‌లను నిర్వహించే వ్యూహాత్మక భాగస్వాములను కలిగి ఉంది.
వ్యవస్థాపక బృందం: వ్యవస్థాపక బృందంలోని సభ్యులలో వ్యక్తిగత కుటుంబ సభ్యులు అలాగే ఆర్‌కె వెంచర్స్ ఉంటారు. ఈ సభ్యులు ఆర్ఇఎస్ఎల్‌లో వాటాలను కలిగి ఉండి, భారతదేశంలో వ్యర్థాల నిర్వహణ (ఆర్ఇఎస్ఎల్ ద్వారా), మౌలిక సదుపాయాల అభివృద్ధి అలాగే రియల్ ఎస్టేట్, ఫార్మాస్యూటికల్స్ వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న రాంకీ గ్రూపులో భాగంగా ఉంటారు.
సిసిఐ ఉత్తర్వుల్లో సమగ్ర వివరాలు ఉంటాయి.
***
(Release ID: 2043714)
Visitor Counter : 49