ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి ఎనిమిది కొత్త చర్యలను ప్రతిపాదించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


రూ.100 కోట్ల వరకు కవర్‌తో తయారీ రంగంలో మూలధన పెట్టుబడి పెట్టేందుకు
వీలుగా ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకం

ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ అందించడానికి కొత్త, స్వతంత్ర మూల్యాంకన నమూనాను
అభివృద్ధి చేయనున్న పిఎస్బిలు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదన

ఒత్తిడి సమయంలో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ ప్రోత్సాహక నిధి నుండి
రుణ మద్దతు ప్రతిపాదించిన శ్రీమతి నిర్మల సీతారామన్

రుణ యోగ్యమైన పారిశ్రామికవేత్తల కోసం ముద్ర రుణాలు రూ.20 లక్షలకు పెంపు

ట్రేడ్స్‌లో తప్పనిసరిగా ఆన్‌బోర్డింగ్ చేయడానికి కొనుగోలుదారుల కోసం
యూనియన్ బడ్జెట్ సగానికి పైగా టర్నోవర్ థ్రెషోల్డ్‌ ప్రతిపాదన

ఎంఎస్ఎంఈ క్లస్టర్‌లలో 24 కొత్త సిడ్బీ బ్రాంచ్‌లు సులభతరమైన, ప్రత్యక్ష క్రెడిట్ యాక్సెస్ కోసం ప్రతిపాదించిన శ్రీమతి నిర్మలా సీతారామన్

ఆహార వికిరణం, నాణ్యత, భద్రత పరీక్షల కోసం కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రతిపాదన

Posted On: 23 JUL 2024 1:03PM by PIB Hyderabad

 "ఈ బడ్జెట్ ఎంఎస్ఎంఈలు,  తయారీ రంగం, ముఖ్యంగా కార్మిక ప్రోత్సాహక తయారీ రంగంపై పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది" అని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా ఎంఎస్ఎంఈలు వృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా పోటీపడేందుకు వారికి ఫైనాన్సింగ్, నియంత్రణ మార్పులు, సాంకేతిక మద్దతును అందించే ప్యాకేజీని ప్రభుత్వం రూపొందించిందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) బడ్జెట్‌లోని నాలుగు ప్రధాన అంశాలలో భాగం. ఎంఎస్ఎంఈలకు మద్దతుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్దిష్ట చర్యలను ప్రతిపాదించారు:

ఉత్పాదక రంగంలోని ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకం

కొలేటరల్ లేదా థర్డ్-పార్టీ గ్యారెంటీ అవసరం లేకుండా యంత్రాలు, పరికరాల కొనుగోలు కోసం ఎంఎస్ఎంఈలకు టర్మ్ లోన్‌లను సులభతరం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రతిపాదించారు. అటువంటి ఎంఎస్ఎంఈల క్రెడిట్ రిస్క్‌ల పూలింగ్‌పై ఈ పథకం పనిచేస్తుందని శ్రీమతి సీతారామన్ చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫ్-ఫైనాన్సింగ్ గ్యారెంటీ ఫండ్, ప్రతి దరఖాస్తుదారునికి రూ.100 కోట్ల వరకు గ్యారెంటీ కవరేజీని అందజేస్తుందని ఆమె తెలిపారు. అయితే రుణం ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చని చెప్పారు. రుణగ్రహీత ముందస్తు గ్యారెంటీ రుసుమును, తరిగే లోన్ బ్యాలెన్స్‌పై వార్షిక హామీ రుసుమును చెల్లించాలి. 

ఎంఎస్ఎంఈ రుణాల కోసం కొత్త అసెస్‌మెంట్ నమూనాను అభివృద్ధి చేయనున్న పిఎస్బిలు 

కొత్త, స్వతంత్ర, అంతర్గత యంత్రాంగం ద్వారా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్బీలు) బాహ్య మదింపుపై ఆధారపడకుండా, క్రెడిట్ కోసం ఎంఎస్ఎంఈలను అంచనా వేయడానికి తమ అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సీతారామన్ ప్రతిపాదించారు. ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈల డిజిటల్ లావాదేవీలకు అనుగుణంగా కొత్త రుణ మూల్యాంకన నమూనాను అభివృద్ధి చేయడానికి నేతృత్వం వహించాలన్నారు. “ఇది కేవలం ఆస్తి లేదా టర్నోవర్ ప్రమాణాల ఆధారంగా క్రెడిట్ అర్హత సాంప్రదాయిక మదింపుపై గణనీయమైన మెరుగుదలగా అంచనా వేయడం జరిగింది. ఇది అధికారిక అకౌంటింగ్ సిస్టమ్ లేని ఎంఎస్ఎంఈలను కూడా కవర్ చేస్తుంది” అని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహక నిధి నుండి ఒత్తిడి సమయంలో ఎంఎస్ఎంఈలకు రుణ భరోసా 

ఎంఎస్ఎంఈలకు వారి ఒత్తిడి కాలంలో బ్యాంక్ క్రెడిట్‌ను కొనసాగించడానికి కొత్త యంత్రాంగాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. తమ నియంత్రణకు మించిన కారణాల వల్ల ‘ప్రత్యేక ప్రస్తావన ఖాతా’ (ఎస్ఎంఏ) దశలో ఉన్నప్పుడు, ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాన్ని కొనసాగించడానికీ, నిరర్ధక ఆస్తుల (ఎన్పిఏ) దశలోకి రాకుండా ఉండటానికీ రుణ సాయం అవసరం పడుతుంది. ప్రభుత్వ ప్రమోట్ చేసిన ప్రతిపాదిత  ఫండ్ నుండి గ్యారెంటీ ద్వారా క్రెడిట్ లభ్యత మద్దతు ఇవ్వడం జరుగుతుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

రుణ యోగ్యత ఉన్న పారిశ్రామికవేత్తల కోసం ముద్ర రుణాలు రూ.20 లక్షలకు పెంపు

‘తరుణ్’ కేటగిరీ కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్ర రుణాల పరిమితిని ప్రస్తుత రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

కొనుగోలుదారుల కోసం టర్నోవర్ థ్రెషోల్డ్, టిఆర్ఈడిఎస్ లో తప్పనిసరి  ఆన్‌బోర్డింగ్ కోసం సగానికి తగ్గింపు 

ఎంఎస్ఎంఈలు తమ వాణిజ్య రాబడులను నగదుగా మార్చడం ద్వారా వారి వర్కింగ్ క్యాపిటల్‌ను అన్‌లాక్ చేయడానికి దానిని మరింత సులభతరం చేయడానికి, టిఆర్ఈడిఎస్ ప్లాట్‌ఫారమ్‌లో తప్పనిసరి ఆన్‌బోర్డింగ్ కోసం కొనుగోలుదారుల టర్నోవర్ థ్రెషోల్డ్‌ (పరిథి)ని రూ.500 కోట్ల నుండి రూ.250 కోట్లకు తగ్గించాలని శ్రీమతి సీతారామన్ ప్రతిపాదించారు. ఈ చర్య మరో 22 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్ఈలు), మరో 7,000 కంపెనీలను ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకువస్తుంది. మధ్యతరహా సంస్థలు కూడా సరఫరాదారుల పరిధిలోకి వస్తాయి.

సులభమైన, ప్రత్యక్ష క్రెడిట్ యాక్సెస్ కోసం ఎంఎస్ఎంఈ క్లస్టర్‌లలో కొత్త సిడ్బీ బ్రాంచ్‌లు

3 సంవత్సరాలలో అన్ని ప్రధాన ఎంఎస్ఎంఈ క్లస్టర్‌లకు సేవలను అందించడానికి, వాటికి నేరుగా క్రెడిట్‌ను అందించడానికి సిడ్బీ కొత్త శాఖలను తెరవాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ సంవత్సరం అటువంటి 24 శాఖలను ప్రారంభించడంతో, సేవా కవరేజీ 242 ప్రధాన క్లస్టర్లలో 168కి విస్తరిస్తామని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఆహార వికిరణం, నాణ్యత, భద్రత పరీక్ష కోసం కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు

ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో 50 బహుళ ఉత్పత్తుల ఆహార వికిరణ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు శ్రీమతి సీతారామన్ ప్రతిపాదించారు. ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్‌తో 100 ఆహార నాణ్యత, భద్రతా పరీక్ష ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. 

ఇ-కామర్స్ ఎగుమతి కేంద్రాలు ఎంఎస్ఎంఈలు, సాంప్రదాయ వృత్తి కళాకారులు అంతర్జాతీయ మార్కెట్‌లలోకి ప్రవేశించడానికి అవకాశాలు

ఎంఎస్ఎంఈలు, సాంప్రదాయ వృత్తి కళాకారులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయించేందుకు వీలుగా, ఈ-కామర్స్ ఎక్స్‌పోర్ట్ హబ్‌లను ప్రభుత్వ-ప్రైవేట్-భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. నిరంతరాయమైన, నియంత్రణ, లాజిస్టిక్ ఫ్రేమ్‌వర్క్ కింద ఈ హబ్‌లు ఒకే పైకప్పు క్రింద వాణిజ్యం, ఎగుమతి సంబంధిత సేవలను సులభతరం చేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.

***


(Release ID: 2036014) Visitor Counter : 248


Read this release in: English