ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్ కింద 45వ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ డీప్ డైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోన్న ఎన్ఈజీడీ

Posted On: 18 JUN 2024 8:01PM by PIB Hyderabad

పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కోవటానికి తగిన భద్రతా చర్యలను నిర్ధారించుకునేందుకు, తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంస్థలు రక్షించుకునేందుకు, భవిష్యత్‌ సైబర్ దాడుల విషయంలో సిద్ధంగా ఉండేందుకు,  సైబర్ నేరాలపై అవగాహన పెంచే విషయంలో ఛీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్(సీఎస్ఐఓ)కు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఫ్రంట్‌లైన్ ఐటీ అధికారులకు సామర్థ్యాల  నిర్మాణం(కెపాసిటీ బిల్డింగ్) లక్ష్యంగా ‘సైబర్ సురక్షిత్ భారత్‌’ ఇనిషియేటీవ్‌ను ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది.

నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఈడీజీ) తన కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ కింద 2024 జూన్ 18 నుంచి 22 వరకు 45 వ సీఐఎస్ఓ డీప్-డైవ్ శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) లో నిర్వహిస్తోంది. ఇందులో గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, న్యూదిల్లీ, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఎంఈఐటీవై, ఎన్ఈజీడీ, ఆస్కీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సైబర్ దాడులను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, సైబర్ భద్రత విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి.. ఈ-ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయోజనాలను సంస్థలు, పౌరులకు అందించే విషయంలో సీఐఎస్ఓలకు అవగాహనతో పాటు వీలు కల్పించడం ఈ డీప్-డైవ్ శిక్షణ కార్యక్రమం లక్ష్యం. చట్టపరమైన నిబంధనలపై సమగ్ర దృక్పథాన్ని అందించడం, సైబర్ సెక్యూరిటీ రంగంలో విధానాలను రూపొందించడానికి సీఐఎస్‌వోలకు వీలు కల్పించడం, పటిష్టమైన సైబర్ సంక్షోభ నిర్వహణ ప్రణాళికలను రూపొందించడంపై ఈ శిక్షణ కార్యక్రమం దృష్టి సారించింది.

అవగాహనను పెంచటం, సామర్థ్యాలను పెంచడం, బలమైన  సైబర్ వ్యవస్థను సృష్టించడానికి ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకునేలా చేయడం ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతోంది.  కార్యక్రమంలో పాల్గొన్న వారికి సైబర్ భద్రత, రక్షణ విషయంలో సునితత్వం తెలియజేయటంతో పాటు అవగాహన కల్పించి, తద్వారా పౌరులకు వివిధ ప్రభుత్వ సేవలను సమగ్రంగా అందించడానికి డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవటం అనే ప్రయత్నంతో  ఈ కార్యక్రమం సాగుతోంది. సైబర్ అంశాల విషయంలో శుభ్రత, భద్రత, రక్షణను ప్రభుత్వ విభాగాలు చూసుకోవడానికి వీలుగా సైబర్ భద్రత గురించి సమగ్ర సమాచారం, పరిజ్ఞానాన్ని కూడా ఈ కార్యక్రమం అందిస్తుంది.

2018లో సీఐఎస్‌వో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ప్రభుత్వం, పరిశ్రమల కన్సార్టియం ఇది విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎన్‌ఈడీజీ 45  సీఐఎస్ఓ డీప్-డైవ్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. ఇది 1,662 మందికి పైగా సీఐఎస్ఓలు, ముందు వరుస ఐటీ అధికారులకు ప్రయోజనం చేకూర్చింది. అంతేకాకుండా సైబర్ భద్రతా రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. 

***


(Release ID: 2026873) Visitor Counter : 78


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP