సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ,హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆధ్యాత్మికత మహోత్సవం


ఆధ్యాత్మికతపై జరుగుతున్న అతి పెద్ద ప్రపంచ సమ్మేళనంలో భాగంగా అలరించనున్న శంకర్ మహదేవన్, కుమారేష్ రాజగోపాలన్, శశాంక్ సుబ్రమణ్యం సంగీత మహోత్సవం

प्रविष्टि तिथि: 13 MAR 2024 7:49PM by PIB Hyderabad

 హైదరాబాద్ శివార్లలో ఉన్న హార్ట్‌ఫుల్‌నెస్  ప్రధాన కార్యాలయమైన కన్హ శాంతి వనంలో మార్చి 14 నుంచి నాలుగు రోజుల పాటు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (స్పెషల్ సెల్), హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో   అంతర్జాతీయ ఆధ్యాత్మికత మహోత్సవం జరుగుతుంది.శంకర్ మహదేవన్, కుమారేష్ రాజగోపాలన్ మరియు శశాంక్ సుబ్రమణ్యంల ఆధ్యాత్మిక సంగీత ప్రదర్శనతో మహోత్సవం ప్రారంభమవుతుంది. 

నాలుగు రోజుల పాటు జరిగే  మహోత్సవంలో ప్రపంచం వివిధ ప్రాంతాలకు చెందిన  

 అన్ని విశ్వాసాలు, నమ్మకాలకు చెందిన పలువురు  నుండి ఆధ్యాత్మిక ప్రముఖులు  పాల్గొంటారు. మార్చి 15 వ తేదీన భారత రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము,మహోత్సవంలో పాల్గొంటారు. మార్చి 16న  ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖర్ కార్యక్రమంలో పాల్గొంటారు.     "అంతర్గత శాంతి కోసం  ప్రపంచ శాంతి" అనే అంశంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం)  హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. 

 ఆధ్యాత్మిక చింతనతో  ప్రజలు జీవించేలా చూసేందుకు ఆధ్యాత్మక ప్రముఖుల ప్రసంగాల ద్వారా మహోత్సవం ద్వారా కృషి జరుగుతుంది. 

కార్యక్రమంలో రామకృష్ణ మిషన్, పరమార్థ్ నికేతన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, మాతా అమృతానందమయి మఠం, హైదరాబాద్ ఆర్చ్ బిషప్, రెవ్ కార్డినల్ ఆంథోనీ పూల, చిన జీయర్ స్వామి, బ్రహ్మ కుమారీలు, పతంజలి యోగా పీఠం,  గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ, మహర్షి ఫౌండేషన్ (అతీంద్రియ ధ్యానం), ఈశా ఫౌండేషన్, ఇంటర్నేషనల్ బౌద్ధ సమాఖ్య (IBC), శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, హైదరాబాద్ ఆర్చ్ డియోసెస్, రాష్ట్ర సంత్ తుక్డోజీ మహారాజ్ అఖిల భారతీయ శ్రీ గురుదేవో సేవ మండలి , సంత్ జ్ఞానేశ్వర్ దేవస్థానం, అలండి, ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ మిషన్ ధరంపూర్, శ్రీ రామ్ చంద్ర మిషన్/ హార్ట్‌ఫుల్‌నెస్ లాంటి పలు సంస్థలు పాల్గొంటున్నాయి. 

మహోత్సవంలో  శ్రీ చిన్న జీయర్ స్వామి - శ్రీ వైష్ణవ గురువు; గౌర్ గోపాల్ దాస్ - మోటివేషనల్ స్పీకర్; మార్క్ మిల్టన్ - విద్య 4 శాంతి; పిర్ జియా ఇనాయత్ ఖాన్ – ఇనయతి ఆర్డర్; అభిజిత్ హల్డర్ - ఐబిసి ; బాబా రామ్‌దేవ్ - పతంజలి యోగపీఠ్; మాతా అమృతానందమయి; హర్జిందర్ సింగ్ ధామి - ఎస్జిపిసి ; గోవింద్ గిరి మహారాజ్ - గీతా పరివార్; డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి - ఏఐఐఓ ; చినజీయర్ స్వామి - శ్రీ వైష్ణవులు; సోదరి శివాని – బ్రహ్మ కుమారీలు;ఆచార్య డా. లోకేష్ ముని జీ– అహింసా విశ్వ భారతి;  ఆంథోనీ పూలా – హైదరాబాద్ ఆర్చ్ బిషప్; డాక్టర్ జయంతి ఎస్  రవి – ఆరోవిల్ ఫౌండేషన్; సద్గురు - ఈశా ఫౌండేషన్; శ్రీ శ్రీ రవిశంకర్ - ఆర్ట్ ఆఫ్ లివింగ్; వెన్ గెషే దోర్జీ - టిబెట్ హౌస్; స్వామి ఆత్మ ప్రియానంద - ఆర్కే  మిషన్; బి.కే. మృత్యుంజయ - బ్రహ్మ కుమారీలు ; స్వామి చిదానంద – పరమార్థ్ నికేతన్; శ్రీ రాకేష్ భాయ్ - SRMD - జైన్;  ఆనంద భంటే - బౌద్ధ సన్యాసి; టోనీ నాడర్ - అతీంద్రియ ధ్యానం; కబీర్ బేడీ - నటుడు; శేఖర్ కపూర్ - నటుడు; వెంకటేష్ – నటుడు , నిర్మాత; కృతి శెట్టి - నటి.తదితరులు మహోత్సవానికి హాజరవుతారు. 

మహోత్సవంలో వివిధ అంశాలపై  చర్చలు, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలు, భారతదేశ ఆధ్యాత్మిక చరిత్ర, శాంతి కథనాలు, పుస్తకాలు, సంగీతం ద్వారా ఆధ్యాత్మికత ప్రదర్శనలు జరుగుతాయి. 
ఉత్సాహం ఉన్న వారికోసం పంచకర్మ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రపంచ ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనేలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి  చలనచిత్రం, సంగీతం, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల కృషి చేస్తున్నారు. . పాల్గొనేవారి కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

***


(रिलीज़ आईडी: 2014438) आगंतुक पटल : 89
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English