సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
22 ఫిబ్రవరి 2024న జరుగనున్న ఎస్‌సిఒవిఎ 33వ సమావేశానికి అధ్యక్షత వహించనున్న డా. జితేంద్ర సింగ్
Posted On:
21 FEB 2024 6:53PM by PIB Hyderabad
జఫిబ్రవరి 22, 2024న న్యూఢిల్లీలో జరుగనున్న వాలెంటరీ (స్వచ్ఛంద) ఏజెన్సీల 33వ స్టాండింగ్ కమిటీ సమావేశానికి కేంద్ర శాస్త్ర& సాంకేతిక శాఖ (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయమంత్రి, పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించనున్నారు. వాలంటరీ ఏజెన్సీల స్టాండింగ్ కమిటీ (ఎస్‌సిఒవిఎ)ను 1986లో పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ శాఖ ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు,శాఖ సహాయ మంత్రి అధ్యక్షుడిగా, పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ విభాగం కార్యదర్శి సెక్రటరీగా ఏర్పాటు చేసింది.
ఎస్‌సిఒవిఎ స్వచ్ఛంద సంస్థల అనగా, పింఛనుదారుల సంక్షేమ సంఘాలు సంప్రదింపుల ఫోరమ్‌గా పని చేస్తుంది. ఎస్‌సిఒవిఎ పింఛనర్ల సంఘాలు నిర్మాణాత్మక చర్చల ద్వారా పింఛనుదారుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖలు/ విభాగాల ముందు నేరుగా లేవనెత్తేందుకు ఒక సంస్థాగత వేదికను అందిస్తుంది.
ఎస్‌సిఒవిఎలో పింఛనుదారుల సంక్షేమ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే 15మంది అనధికారిక సభ్యులు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు ప్రాతినిధ్యం వహించే అధికారిక సభ్యులు ఉంటారు. విభాగాల కార్యక్రమాల అమలుపై ఎస్‌సిఒవిఎ ఫీడ్ బ్యాక్‌ను అందించడంతో పాటు, పింఛనర్లకు సంబంధించిన కీలకమైన విధాన సమస్యలను చర్చిస్తుంది, ప్రభుత్వ చర్యలకు అనుబంధంగా స్వచ్ఛంద ప్రయత్నాలను సమీకరిస్తుంది.
గుజరాత్, ఒడిషా, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, పుదుచ్చేరికి చెందిన పింఛనుదారుల సంక్షేమ సంఘాలు 33వ ఎస్‌సిఒవిఎ చర్చలలో పాలుపంచుకోనున్నాయి. వీరితోపాటుగా, డిఒపిటి, రైల్వే మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, టెలికాం విభాగం, వ్యయ విభాగం, సిపిఎఒ, ఆర్ధిక సేవల విభాగం, సిజిడిఎ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పాలుపంచుకోనున్నాయి.
***
(Release ID: 2007920)
Visitor Counter : 97