నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రేపు, ఒడిశాలోని సంబల్‌పూర్‌లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన, విద్య & నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కీలక కార్యక్రమాలకు హాజరు

प्रविष्टि तिथि: 19 FEB 2024 9:32PM by PIB Hyderabad

కేంద్ర విద్య & నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, రేపు, (20 ఫిబ్రవరి 2024) ఒడిశాలోని సంబల్‌పూర్‌లో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా విద్య & నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సంబల్‌పూర్‌లోని వేదిక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 'రోబోటిక్స్ సెంటర్‌'ను కేంద్ర మంత్రి రేపు ప్రారంభిస్తారు. ఆ తర్వాత, మాజిపల్లిలో 'స్కిల్ ఇండియా సెంటర్' ప్రారంభోత్సవానికి హాజరవుతారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ములో రేపు ప్రారంభించనున్న వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లోనూ వర్చువల్‌ పద్ధతిలో కేంద్ర మంత్రి పాల్గొంటారు. 

సంబల్‌పూర్‌ గోశాలలోని పీఎం-శ్రీ జేఎన్‌వీలో బహుళార్ధక కేంద్రం శంకుస్థాపనకు కూడా ధర్మేంద్ర ప్రధాన్‌ హాజరవుతారు. ఫుట్‌బాల్ ఫర్ స్కూల్ (ఎఫ్‌4ఎస్‌) కార్యక్రమం కింద ఫుట్‌బాల్స్‌ కూడా పంపిణీ చేస్తారు.

రేపు సాయంత్రం, సంబల్‌పూర్‌లోని తపస్విని హాల్‌లో రాష్ట్రీయ ఉద్యమిత వికాశ్ పరియోజన ప్రారంభోత్సవానికి శ్రీ ప్రధాన్ హాజరవుతారు.

***


(रिलीज़ आईडी: 2007429) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी