ఆర్థిక మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పిఎంసిఐఎల్‌) 19వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి.నిర్మలా సీతారామన్


ఆర్థిక మంత్రి మూడు సావనీర్ నాణేలను కూడా విడుదల చేశారు. ఎస్‌పిఎంసిఐ వెబ్‌సైట్ నుండి ఈ నాణేలను కొనుగోలు చేయవచ్చు

మెరుగైన భద్రతతో కార్యకలాపాలు మరియు ఉత్పత్తులను ఆధునీకరించడానికి ఎస్‌పిఎంసిఐఎల్‌ చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రశంసించిన శ్రీమతి సీతారామన్

Posted On: 15 FEB 2024 6:47PM by PIB Hyderabad

 

కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి.నిర్మలా సీతారామన్  ఈరోజు న్యూ ఢిల్లీలో హైబ్రిడ్ మోడ్ ద్వారా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పిఎంసిఐఎల్‌) 19వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించారు.

 

 ఈ కార్యక్రమంలో శ్రీ అజయ్ సేథ్, సెక్రటరీ, ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ; శ్రీ విజయ్ రంజన్ సింగ్, ఎస్‌పిఎంసిఐఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు డైరెక్టర్ల బోర్డు మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఎస్‌పిఎంసిఐఎల్‌కు చెందిన వివిధ యూనిట్లలో వర్చువల్ మోడ్‌లో హాజరయ్యారు; సీనియర్ అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగులు/ అపెక్స్ బైపార్టైట్‌ ఫోరమ్, ఈపిఎఫ్‌, జీపిఎఫ్‌ ట్రస్టీలు మరియు ఎస్సీ,ఎస్టీ మరియు ఓబీసీ సంస్థల నుండి గుర్తింపు పొందిన యూనియన్ల ప్రతినిధులు మరియు ఉద్యోగులు/ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

 

కేంద్ర ఆర్థిక మంత్రి మూడు సావనీర్ నాణేలను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు:
 

  1. భారతదేశంలో అంతరించిపోతున్న జంతువులపై రంగుల సావనీర్ నాణెం - గ్రేటర్ వన్ హార్న్డ్ రినో;
  2. బుద్ధుని జ్ఞానోదయంపై ద్వి-లోహ కవచమైన సావనీర్ నాణెం; మరియు
  3. రామ్‌లల్లా మరియు అయోధ్య రామమందిరం యొక్క రంగుల సావనీర్ నాణెం

 

 

 

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ప్రసంగిస్తూ.. బ్యాంక్ నోట్స్, సెక్యూరిటీ పేపర్, పోస్టల్ స్టాంపులు, పాస్‌పోర్ట్‌లు, మెడలియన్స్ మరియు ఇతరత్రా భద్రతా ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నందుకు ఎస్‌పిఎంసిఐఎల్‌ని సీతారామన్ అభినందించారు. దృశ్యలోపం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉండే నాణేల శ్రేణిని ముద్రించడం కోసం ఎస్‌పిఎంసిఐ  ఆలోచనాత్మకతను మరియు ఎస్‌పిఎంసిఐఎల్ యొక్క ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్‌తో కూడిన ఇ-పాస్‌పోర్ట్ తయారీకి సంబంధించిన కొత్త కార్యక్రమాలను గుర్తించి ఇది సమాచార సౌలభ్యంతో పాటు మెరుగైన భద్రతను కూడా నిర్ధారిస్తుందని చెప్పారు.

 

 ఎస్‌పిఎంసిఐఎల్‌ సావనీర్ ఉత్పత్తులను భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై ఇతర దేశాల ప్రముఖులకు అందజేస్తుందని మరియు అవి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి హైలైట్ చేశారు. ఎస్‌పిఎంసిఐఎల్‌కు సంబంధించిన సిఎస్‌ఆర్‌ప్రాజెక్ట్‌లను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రస్తావిస్తూ ఆకాంక్ష జిల్లాలు మరియు మారుమూల ప్రాంతాలలో ఇటువంటి ప్రాజెక్టులు ప్రశంసనీయమని అన్నారు. ఉద్యోగులు మరియు ఎస్‌పిఎంసిఐఎల్‌ బోర్డు సాంకేతిక పురోగతులను నిశితంగా గమనించాలని మరియు ఈ సముచిత రంగం యొక్క మారుతున్న అవసరాలకు అంతర్గతంగా స్పందించాలని కోరారు.


అంతకుముందు ఎస్‌పిఎంసిఐఎల్‌  సిఎండి తన ప్రారంభ ప్రసంగంలో కంపెనీ ముఖ్యమైన విజయాలను మరియు కార్యక్రమాలను పంచుకున్నారు. తొమ్మిది యూనిట్లు మరియు కార్పొరేట్ కార్యాలయాల చీఫ్ జనరల్ మేనేజర్‌లు అత్యుత్తమ విజయాలు సాధించిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఉత్పాదకత, పర్యావరణం & భద్రత, ఇంధన సంరక్షణ, అభ్యాసం & అభివృద్ధి, అధికార భాష మరియు విజిలెన్స్ కార్యకలాపాలు వివిధ విభాగాలలో ఎస్‌పిఎంసిఐఎల్‌ యూనిట్‌లకు అవార్డులు కూడా అందించబడ్డాయి. ఇందులో నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌కి మొత్తం అత్యుత్తమ పనితీరు కోసం ప్రతిష్టాత్మక సిఎండి కప్ అందించబడింది.

 

ఎస్‌పిఎంసిఐఎల్‌ గురించి:

సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది మినిరత్న కేటగిరీ–Iలో ఉంది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ (సిపిఎస్‌ఈ) భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల శాఖ పరిపాలనా నియంత్రణలో ఉంది.

 

***



(Release ID: 2006496) Visitor Counter : 84


Read this release in: English , Urdu , Hindi