సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ లో భరత కళా మండపం ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన , దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు, శ్రీ జి.కిషన్ రెడ్డి
ఘంటసాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భారత్ కళా మండపం ఆడిటోరియం నిర్మాణం
2024 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు పొందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో పాటు పద్మ విభూషణ్ అవార్డు కు ఎంపిక అయిన శ్రీ ఎం వెంకయ్య నాయుడు కి సన్మానం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సహకారంతో దేశ వారసత్వాన్ని సంరక్షించడానికి, ప్రచారం చేయడానికి, సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేసింది:
శ్రీ జి.కిషన్ రెడ్డి
భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం కృషి చేసిన ప్రధానమంత్రి ని దేశం తరుపున అభినందనలు . . మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2024 6:29PM by PIB Hyderabad
హైదరాబాద్ లో సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని(దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం) మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి , ప్రారంభించారు. ఘంటసాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్మించనున్న భరత కళా మండపం ఆడిటోరియానికి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీమతి పి.సుశీల, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
సంగీత నాటక అకాడమీ కి దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు ప్రాంతీయ కేంద్రం లేదు. ఇంఫాల్ లో మణిపూర్ డాన్స్ అకాడమీ, కథక్ కేంద్రం , సెంటర్ ఫర్ కుటియాట్టం, సత్రియా సెంటర్ వంటి అనేక సంస్థలు సంగీత నాటక అకాడమీ పరిధిలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు దీనికి పూర్తి స్థాయి ప్రాంతీయ కేంద్రం లేదు. ఈ లోటును దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం పూరిస్తుంది. , సంగీతం, జానపద, గిరిజన కళలు, నాటకరంగం, తోలుబొమ్మలాట లాంటి కళలపై పరిశోధన, డాక్యుమెంటేషన్ ను ప్రోత్సహించడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అత్యాధునిక ప్రాంతీయ కేంద్రంగా, రాష్ట్ర సాంస్కృతిక వికాసానికి దోహదపడే ప్రముఖ సాంస్కృతిక కేంద్రంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ "గత పదేళ్లుగా దేశ వారసత్వ సంపదను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకారంతో తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వానికి పెద్ద పీట లభించింది." అని అనాన్రు. " రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇచ్చింది., వేయిస్తంభాల ఆలయం కల్యాణ మండపాన్ని పునరుద్ధరించడం జరిగింది, సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రాల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు అమలు చేస్తుంది" అని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
భారత దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం కృషి చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని శ్రీ వెంకయ్య నాయుడు అభినందించారు. " దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారు.ప్రధాని చేస్తున్న కృషిని దేశం అభినందిస్తుంది" అని వెంకయ్యనాయుడు అన్నారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో మాతృభాష పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన అన్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాతృభాషను మరింత ప్రోత్సహిస్తూ పరిరక్షిస్తున్నారన్నారని శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 2024 పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించారు. బుర్రా వీణ సంప్రదాయాన్ని కొనసాగించి, పరిరక్షిస్తున్న శ్రీ దాసరి కొండప్ప, బంజారా భాషలోకి భగవద్గీతను అనువదించిన శ్రీ కేతావత్ సోమలాల్, చిందు యక్షగానం నృత్య కళాకారులు శ్రీ గడ్డం సమ్మయ్య, హరికథ రంగానికి సేవలు అందించిన శ్రీమతి ఉమామహేశ్వరి, తెలంగాణలోని వివిధ దేవాలయాల్లో శిల్ప కళ, కళలకు చేసిన కృషికి శ్రీ వేలు ఆనందాచార్యులను , కార్యక్రమంలో సన్మానించారు.
***
(రిలీజ్ ఐడి: 2005436)
సందర్శకుల సూచీ సంఖ్య : : 91