రైల్వే మంత్రిత్వ శాఖ

2014–23 మధ్య కాలంలో 10,867 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిలు పూర్తి.

Posted On: 07 FEB 2024 4:07PM by PIB Hyderabad

నమూనా స్టేషన్ల పథకం 1999 జూన్ 2008 నవంబర్ మధ్య అమలులో ఉంది. రైల్వే మంత్రిత్వశాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని భారతీయ రైల్వేలలో స్టేషన్ల అభివృద్ధికోసం దీనిని ప్రారంభించింది.

దీర్ఘకాలిక దృష్టి కోణంతో ఈ పథకం నిరంతరాయ అభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుంది. ఇందులో మాస్టర్ప్లాన్లు ఇమిడి ఉన్నాయి. దీనిని ఆయా స్టేషన్లలో సదుపాయాలను దశలవారీగీ అభివృద్ధి చేసేందుకు నిర్దేశించారు. స్టేషన్ అందుబాటును పెంచడంవినియోగ ప్రాంతంవెయిటింగ్ హాళ్లుటాయిలెట్లులిఫ్ట్లుఎస్కలేటర్లుపరిశుభ్రతఉచిత వై ఫైస్థానిక ఉత్పత్తులకు కియోస్కులు,,ఒక స్టేషన్ఒక ఉత్పత్తి వంటివిప్రయాణికులకు మెరుగైన సమాచార వ్యవస్థలుఎగ్జిక్యుటివ్ లాంజ్లుబిజినెస్ సమావేశాలకు ప్రత్యేక ప్రదేశాలుఅందమైన గార్డెన్ వంటి వాటిని ఆయా స్టేషన్ల అవసరాలను బట్టి ఏర్పాటు చేస్తారు.

 

రైల్వే స్టేషన్ను నగరానికి ఇరువైపులా కలుపుతూ స్టేషన్ భవనాన్ని మెరుగుపరుస్తారు. మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ తీసుకువస్తారు. దివ్యాంగులకు సదుపాయాలుసుస్థిరపర్యావరణ హితకర స్టేషన్లుబలాస్ట్లెస్ ట్రాక్లురూఫ్ ప్లాజాలు అవసరమైన చోట ఏర్పాటుచేస్తారు. దీర్ఘకాలిక దృష్టితో ఈ పథకం కింద సిటీ సెంటర్లను అవసరమైన చోట ఏర్పాటు చేస్తారు. ఈ పథకం కింద బికనీర్ డివిజన్లో 23 స్టేషన్లతో పాటుజోధ్పూర్ డివిజన్ లో 18 స్టేషన్లతోపాటు 1318 స్టేషన్లపే భారతీయ రైల్వేలు అభివృద్ధి ఆధునీకరణకు గుర్తించాయి. 2014–23 సంవత్సరాల మధ్య మొత్తం 10867 రోడ్  ఓవర్ బ్రిడ్జిలు (ఆర్.ఒ.బిలు)రోడ్ అండర్ బ్రిడ్జిలు(ఆర్.యుబిలు) పూర్తి అయ్యాయి. మరోవైపు 2004–14 మధ్య కేవలం 4,148 ఆర్.ఒ.బిలుఆర్.యు.బిలు పూర్తి అయ్యాయి. 2023‌‌–24 సంవత్సరంలో 612 ఆర్ఒబిలుఆర్యుబిలు 2023 డిసెంబర్ నాటికి పూర్తి అయ్యాయి.  2023–24 లో డిసెంబర్ 23 నాటికి రూ 3,970 కోట్ల రూపాయలు ఆర్ఒబిలుఆర్.యు.బిల నిర్మాణంపై ఖర్చు చేశారు. రోడ్ ఓవర్ బ్రిడ్జిలురోడ్ అండర్ బ్రిడ్జిలను మానవ కాపలా లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించేందుకు నిర్మించారు. లెవల్ క్రాసింగ్లకు బదులుగా రోడ్ ఓవర్ బ్రిడ్జిలేదా రోడ్ అండర్ బ్రిడ్జి ల నిర్మాణం అనేది భారతీయ రైల్వేలలో నిరంతర ప్రక్రియ. ఇలాంటి పనులురైల్వేల  నిర్వహణలో భద్రతా పరమైన అంశాలనుప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పనులకు ఆమోదం తెలుపుతారు.

 

31.01.2024 నాటికి మొత్తం 1948 ఆర్.ఒ.బిలు, 2325 ఆర్.యు.బిలు భారతీయ రైల్వేలలో మంజూరయ్యాయి. ఇవి వివిధ ప్లానింగ్అంచనాఅమలు వంటి వివిధ దశలలో ఉన్నాయి..రైళ్ల నిర్వహణలో భద్రతను మెరుగుపరచడానికి,మొబిలిటీని పెంచడానికిరోడ్ క్రాసింగ్ పనులను వేగవంతం చేయడానికి రైల్వే 02.03.2023న నూతన విధానాన్ని తీసుకువచ్చింది. దీని ప్రధానాంశాలు కింది విధంగా ఉన్నాయి.

 

1. లెవల్ క్రాసింగ్ ల తొలగింపు ప్రాధాన్యతా ప్రాతిపదికనఆయా రైళ్లనిర్వహణ విషయంలో భద్రతపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. అలాగే రోడ్డు వినియోగదారులు,  పథకం అమలు సాధ్యాసాధ్యాలుఖర్చుతదితర అంశాలను బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటారు.

 

2. వీలున్నచోట పనులను ఒకే యూనిట్ ప్రాతిపదికన రైల్వే చేపడుతోంది. ఏదైనా రాష్ట్రప్రభుత్వం లేదారోడ్డు యాజమాన్య అథారిటీ కోరితేరైల్వే ఈ పనులను సింగిల్ ఎంటిటి విధానంలో పనులను చేపట్టేందుకు అనుమతి ఇస్తుంది. ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వే కమ్యూనికేన్లుఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

***



(Release ID: 2004296) Visitor Counter : 53


Read this release in: English , Urdu , Hindi