హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వామ పక్ష తీవ్రవాదాన్ని తుద ముట్టించేందుకు జాతీయ విధానం

Posted On: 07 FEB 2024 4:01PM by PIB Hyderabad

భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం, పోలీస్ మరియు పబ్లిక్ ఆర్డర్ సబ్జెక్ట్‌లు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. అయితే, వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యుఇ) ప్రభావిత రాష్ట్రాల ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది.  ఎల్‌డబ్ల్యుఇ సమస్యను సమగ్రంగా పరిష్కరించడానికి, 2015లో "జాతీయ విధానం మరియు కార్యాచరణ ప్రణాళిక" ఆమోదించారు. భద్రతకు సంబంధించిన చర్యలు, అభివృద్ధి జోక్యాలు, స్థానిక కమ్యూనిటీల హక్కులు, మొదలైన వాటితో కూడిన బహుముఖ వ్యూహాన్ని ఇది ఊహించింది. ముందు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల బెటాలియన్లు, శిక్షణ, రాష్ట్ర పోలీసు బలగాల ఆధునీకరణ కోసం నిధులు, పరికరాలు & ఆయుధాలు, గూఢచార భాగస్వామ్యం, పటిష్ట పోలీసు స్టేషన్ల నిర్మాణం మొదలైన వాటి ద్వారా  ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలకు  కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది; అభివృద్ధి వైపు, ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌లతో పాటు, కేంద్ర ప్రభుత్వం రోడ్డు నెట్‌వర్క్ విస్తరణ, టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీని మెరుగుపరచడం, నైపుణ్యం, ఆర్థిక చేరికపై ప్రత్యేక దృష్టితో  ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత రాష్ట్రాల్లో అనేక నిర్దిష్ట కార్యక్రమాలను చేపట్టింది.

2018-19 నుండి 2022-23 మధ్య గత 5 సంవత్సరాలలో ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం (ఎస్ఐఎస్), భద్రతా సంబంధిత వ్యయం (ఎస్ఆర్ఈ), ప్రత్యేక కేంద్ర సహాయం (ఎస్సిఏ) పథకాల కింద  ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత రాష్ట్రాల సామర్థ్య నిర్మాణానికి రూ. 4931 కోట్లు విడుదల అయ్యాయి. ఇంకా,  మేనేజ్‌మెంట్ కోసం సెంట్రల్ ఏజెన్సీలకు సహాయం పథకం కింద హెలికాప్టర్లను ఆపరేట్ చేయడానికి,   ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత ప్రాంతాల్లోని భద్రతా శిబిరాల్లో క్లిష్టమైన మౌలిక సదుపాయాలను పరిష్కరించడానికి కేంద్ర ఏజెన్సీలకు రూ.765 కోట్లు ఇవ్వడం జరిగింది. రోడ్డు నెట్‌వర్క్ విస్తరణ, టెలికాం కనెక్టివిటీని మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక చేరికపై ప్రత్యేక దృష్టితో   ఎల్‌డబ్ల్యుఇ  ప్రభావిత రాష్ట్రాల్లో అనేక నిర్దిష్ట కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొన్ని చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:

* రోడ్ నెట్‌వర్క్ విస్తరణ కోసం, 13620 కి.మీ రోడ్లు నిర్మించడం జరిగింది. 

* టెలికాం కనెక్టివిటీని మెరుగుపరచడానికి,  ఎల్‌డబ్ల్యుఇ  ప్రభావిత ప్రాంతాల్లో 13,823 టవర్లు మంజూరు అయ్యాయి, 3700 కంటే ఎక్కువ టవర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. 

*  ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత జిల్లాల్లో స్థానిక జనాభాను ఆర్థికంగా చేర్చడం కోసం 4903 కొత్త పోస్టాఫీసులు ప్రారంభించారు. ఇంకా, ఏప్రిల్-2015 నుండి 30 ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత జిల్లాల్లో 955 బ్యాంకు శాఖలు మరియు 839 ఎటిఎంలు తెరిచారు. 

* నైపుణ్యాభివృద్ధి కోసం ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత జిల్లాల్లో 46 ఐటిఐలు, 49 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు (ఎస్‌డిసిలు) పని చేస్తున్నాయి. గిరిజన బ్లాకుల్లో నాణ్యమైన విద్య కోసం ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత జిల్లాలలో 130 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) పనిచేయడం ప్రారంభించింది.

  • రోడ్ నెట్‌వర్క్ విస్తరణ కోసం 13620 కి.మీ రోడ్లు నిర్మించారు.
  • టెలికాం కనెక్టివిటీని మెరుగుపరచడానికి,  ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత ప్రాంతాల్లో 13,823 టవర్లు మంజూరు అయ్యాయి. ఇప్పటికే 3700కు పైగా టవర్లు ప్రారంభమయ్యాయి.
  •  ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత జిల్లాల్లో స్థానిక జనాభాను ఆర్థికంగా చేర్చుకోవడం కోసం 4903 కొత్త పోస్టాఫీసులు ప్రారంభమయ్యాయి. ఇంకా, ఏప్రిల్-2015 నుండి 30   ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత జిల్లాల్లో 955 బ్యాంక్ శాఖలు, 839 ఏటిఎంలు తెరవడం జరిగింది.
  • నైపుణ్యాభివృద్ధి కోసం ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత జిల్లాల్లో 46 ఐటిఐలు, 49 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (ఎస్డిసిలు) పని చేస్తున్నాయి.
  • ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత జిల్లాల్లోని గిరిజన బ్లాకుల్లో నాణ్యమైన విద్య కోసం 130 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్)  ప్రారంభించడం జరిగింది. 

ఈ విధానాన్ని దృఢమైన అమలు చేయడం వల్ల హింసాకాండ స్థిరంగా క్షీణించింది. అది భౌగోళిక వ్యాప్తి జరగకుండా ఆగింది.  ఎల్‌డబ్ల్యుఇ సంబంధిత హింసాత్మక సంఘటనలు, ఫలితంగా మరణాలు (పౌరులు + భద్రతా దళాలు) గణనీయంగా తగ్గాయి. 

ఎల్‌డబ్ల్యుఇ సంబంధిత హింసను నివేదించే పోలీస్ స్టేషన్‌ల సంఖ్య 2010లో 96 జిల్లాల్లోని 465 పోలీస్ స్టేషన్‌ల నుండి 2023లో 42 జిల్లాల్లో 171 పోలీస్ స్టేషన్‌లకు గణనీయంగా తగ్గింది. భౌగోళిక వ్యాప్తిలో క్షీణత కూడా భద్రతా సంబంధిత వ్యయం కింద కవర్ చేయబడిన జిల్లాల సంఖ్య తగ్గడంలో ప్రతిబింబిస్తుంది. 

  రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ఈ విషయాన్ని తెలిపారు.    

 

***


(Release ID: 2003875) Visitor Counter : 116


Read this release in: English , Urdu , Hindi